మిగిలిన ఏడుతెగలకు నేల
18 1. యిస్రాయేలీయులందరు షిలో వద్ద ప్రోగై సమావేశపుగుడారమును నెలకొల్పిరి. వారు అప్పికే తమ నేలనంతిని స్వాధీనము చేసికొనిరి.
2. అయినను యిస్రాయేలీయులలో ఏడుతెగలవారికి ఇంకను వారసత్వభూమి లభింపలేదు.
3. యెహోషువ వారితో ”మన పితరులదేవుడైన యావే మీకు అను గ్రహించిన భూమిని స్వాధీనముచేసికొనకుండ ఇంకను ఎంతకాలము జాగుచేసెదరు?
4. ఒక్కొక్క తెగనుండి ముగ్గురు మనుష్యులను ఎన్నుకొనుడు. వారు ఈ నేల నాలుగుచెరగులు పరిశీలించి దానిని ఎట్లు విభజింప వలెనో నిశ్చయించి నా యొద్దకు వచ్చెదరు.
5. వారు ఈ భూమిని ఏడుభాగములుగా విభజింపవలెను. యూదా తెగవారు దక్షిణభాగమున, యోసేపు తెగ వారు ఉత్తరభాగమున ఉందురు.
6. మీరు ఈ నేలను పరిశీలించి, ఏడుముక్కలుగా విభజించి నాకు వర్త మానము కొనిరండు. నేను ప్రభువు ఎదుట మీకు వంతుచీట్లు వేసెదను.
7. లేవీయులకు మీతోపాటు భాగము లేదు. యావే యాజకులుగా పనిచేయుటయే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్ధ తెగవారు యోర్దానునకు ఆవలిదరిని, తూర్పువైపున తమ వారసత్వభూమిని గైకొనిరి. యావే సేవకుడైన మోషే వారికి ఆ భాగమునిచ్చెను” అనెను.
8. అంతట ఆ మనుష్యులు లేచి పయనమైరి. యెహోషువ వారితో ”మీరు వెడలిపోయి ఈ దేశము గుండ నడచి, నేలను పరిశీలించి దాని వివరములను వ్రాసి నా యొద్దకురండు. నేను షిలోవద్దనే యావే ఎదుట మీకు చీట్ల ప్రకారము వంతులు వేసెదను” అని చెప్పెను.
9. ఆ మనుష్యులు వెడలిపోయి నేల నాలుగు ప్రక్కలు గాలించి అందలి పట్టణములన్నిని ఏడు ప్టికలుగా వ్రాసి షిలో వద్ద విడిది చేయుచున్న యెహోషువ చెంతకు కొనివచ్చిరి.
10. అతడు షిలో యందే యావే ఎదుట వంతులువేసి యిస్రాయేలీయు లలో ఆయా తెగలవారికి భూములు పంచియిచ్చెను.
బెన్యామీను తెగ
11. వంతులు వేయగా చీి చొప్పున వచ్చిన మొదివంతు బెన్యామీను కుటుంబములకు లభించెను. వారి భాగము యూదా, యోసేపు తెగలవారి భాగము లకు మధ్యనుండెను.
12. వారి ఉత్తరపు సరిహద్దు యోర్దాను నుండి ప్రారంభమై యెరికో ఉత్తరభాగము మీదుగా పోయి పడమటనున్న పీఠభూములను దాి బెతావెను అరణ్యమును చేరెను.
13. అక్కడి నుండి దక్షిణముగా పోయి లూసు లేక నేి బేతేలును చేరెను. అక్కడి నుండి క్రిందికి పోయి దిగువనున్న బేత్‌హోరోను దక్షిణమునగల కొండమీది అారోతు-అడ్డారును సమీపించెను.
14. అక్కడినుండి ఆ సరిహద్దు వంకర తిరిగి పడమరగా దక్షిణమునకు మరలి బేత్‌హోరోనుకు దక్షిణమున నున్న కొండ వద్దగల కిర్యత్బాలు చెంత ముగిసెను. ఈ కిర్యత్బాలు నగరమే నేడు యూదీయుల అధీనముననున్న కిర్యత్యారీము పట్టణము. ఇది వారి పడమి సరిహద్దు.
15-16. ఆ సరిహద్దు దక్షిణమున కిర్యత్యారీము నుండి (గాసీను చేరి,) నెఫ్తోవా సరస్సును దాి, రేఫాయీము మైదానమునకు ఉత్తరమున బెన్‌హిన్నోము లోయకు ఎదుటనున్న కొండ దాపునజేరి, యెబూసీయుల సీమకు దక్షిణముననున్న హిన్నోము లోయజొచ్చి, ఎన్-రోగేలు చేరెను.
17-19. అక్కడి నుండి ఉత్తరముగా వంకదిరిగి ఎన్‌షెమేషు చేరి, ఆదుమ్మీము శిఖరమునకు అభిముఖముగాను గిల్గాదు చేరెను. రూబేను కుమారుడు బోహాను శిల వరకును క్రిందికి దిగి బేత్‌హరాబా ఉత్తర అంచున ఉన్న కెటేఫు చేరి బేత్‌హోగ్లా ఉత్తరాంచున సరిహద్దుచ్టుి, ఉప్పు సముద్రపు ఉత్తర అఖాతమునొద్ద యోర్దానుకు దక్షిణా గ్రమున ఆగిపోయెను. ఇది వారి దక్షిణపు సరిహద్దు. యోర్దానే తూర్పు సరిహద్దు.
20. ఈ ఎల్లలలో గల నేలయే బెన్యామీనీయుల వారసత్వ భూమి.
బెన్యామీను పట్టణములు
21-28. వారివారి కుటుంబముల ననుసరించి బెన్యామీను తెగలవారి పట్టణములు ఇవి: యెరికో, బేత్‌హోగ్లా, ఏమెక్కేసీసు, బేత్-అరబ్బా, సేమరాయీము, బేతేలు, అవ్వీము, పారా, ఓఫ్రా, కేఫరమ్నోని, ఓఫ్ని, గేబా-ఇవియన్నియు వానివాని పల్లెలతోకూడి పండ్రెండు పట్టణములు. గిబ్యోను, రామా, బేరోత్తు, మీస్ఫే, కేఫీరా, మోసా, రేకెము, ఇర్పీలు, తరల, సేలా ఏలెఫు, యెరూషలేము, గిబియా, కిర్యతు వానివాని పల్లెలతో కలసి ఇవియన్నియు పదునాలుగు పట్టణములు. వారివారి కుటుంబములతో కలసి బెన్యామీను తెగ వారికి లభించిన వారసత్వభూమి యిదియే.