యిస్రాయేలు రాజులపై విలాపగీతము
19 1. యిస్రాయేలురాజుల మీద
ఈ విలాపగీతమును
వినిపింపుమని ప్రభువు నాతో చెప్పెను.
2. మీ తల్లి గొప్ప ఆడుసింగము.
ఆమె భీకరములైన సింహముల మధ్య
తన కిషోరములను పెంచెను.
3. ఆమె ఒక కిషోరమును పెంచి,
పెద్దజేసి వేట నేర్పెను. అది నరభక్షకి అయ్యెను.
4. జాతులు దానిని గూర్చి వినెను.
దానిని గోతిలో బడద్రోసి, బంధించి,
కొక్కెములు తగిలించి ఐగుప్తునకు
ఈడ్చుకొనిపోయెను.
5. ఆమె వేచి వేచి విఫలురాలయ్యెను.
అటుపిమ్మట ఆమె మరియొక
సంతానమును పెంచగా అది కొదమసింగమయ్యెను.
6. అది పెరిగి పెద్దదై తోడి సింగాలతో తిరుగజొచ్చెను.
వేటనేర్చుకొని నరభక్షకి అయ్యెను.
7. అది కోటలను నాశనము చేసెను.
నగరములను ధ్వంసము చేసెను.
దాని గర్జనకు దేశములోని ప్రజలు భయపడిరి.
8. వివిధ దేశముల నుండి జాతులేకమై వచ్చి
దానితో పోరాడిరి, దానికొరకు వలపన్నిరి.
అది వారు త్రవ్విన గోతిలోపడి బందీఅయ్యెను.
9. వారు దానిని బోనులో బ్టెి బబులోనియా
రాజువద్దకు కొనిపోయిరి.
ఆ సింగమును చెరలో ప్టిెరి.
కనుక దాని గర్జనములు యిస్రాయేలు
కొండలపై మరల వినిపింపవయ్యెను.
10. మీ తల్లి ఏి ప్రక్కన నాిన ద్రాక్షవల్లి వింది.
నీరు సమృద్ధిగా లభించుట వలన
ఆ తీగ ఆకు తొడిగి పండ్లు కాచెను.
11. అది పటువైన రెమ్మలు చాచెను.
ఆ రెమ్మలు రాజదండములయ్యెను.
ఆ తీగ ఎత్తుగా పెరిగి మేఘమండలమును తాకెను.
దాని ఎత్తును గుబురైన ఆకులను గాంచి
జనులెల్లరును విస్తుపోయిరి.
12. అయితే బహు రౌద్రముచేత అది పెరికి
వేయబడినదై, నేలమీద పడవేయబడెను.
తూర్పుగాలి విసరగా దానిపండ్లు వాడిపోయెను.
మరియు దాని గ్టి రెమ్మలు తెగి,
వాడిపోయి, అగ్నిచేత కాలిపోయెను.
13. దానినిపుడు నీరులేక ఎండియున్న ఎడారిలో నాిరి.
దాని రెమ్మలు విరిగి,
ఎండి అగ్నికాహుతి అయ్యెను.
14. దాని బోదెకు నిప్పంటుకొని రెమ్మలను,
పండ్లను కాల్చివేసెను.
ఆ రెమ్మలలో ఇక పటుత్వముండదు.
అవి మరల రాజదండములు కాజాలవు.
ఇదియే విలాపగీతము.
ఇది విలాపముగనే వాడుకలోనికి వచ్చెను.