3 1. అయినచో అన్యజనుల కంటె యూదుల కున్న గొప్పతనమేమి? సున్నతివలన ప్రయోజనమేమి?

2. ఎటు చూచినను అధికమే! దేవుడు తన సందేశమును  యూదులకు అప్పగించిన విషయము మొదటిది.

3. వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రమున ఏమి? వారి అవిశ్వాసము దేవుని విశ్వసనీయతను భంగపరచునా?

4. ఎన్నికిని కాదు! ప్రతివ్యక్తి అసత్య వాదియైనను దేవుడు మాత్రము సత్యశీలి. ఏలయన,

”నీవు మాటలలో

సత్యవంతుడవని ప్రదర్శింపబడవలెను.

నీవు తీర్పు చేయబడినపుడు గెలుపొందవలెను” అని వ్రాయబడియున్నది.

5. కాని, మన అన్యాయము దేవుని ధర్మమును ప్రదర్శించుటకు తోడ్పడినచో అప్పుడు ఏమందుము? మనలను శిక్షించుటలో దేవుడు తన ధర్మమును అతిక్రమించెనని అందుమా? నేను ఇట వాస్తవముగా మానవతీరున మాట్లాడుచున్నాను.

6. అది ఎన్నికిని కాదు! అటులయినచో దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు చెప్పును?

7. నా అసత్యము దేవుని సత్యమును ప్రదర్శించుచు, ఆయన వైభవమునకు తోడ్పడుచున్నది గదా! అటులయిన ఆయన నన్ను ఏల ఇంకను పాపిగా తీర్పుచేయును?

8. అటులైన మేలు కలుగుటకే కీడు చేయుదమని కొందరు మమ్ము దూషించి చెప్పినట్లు మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారు తగిన దండనను పొందుదురు.

ఎవరును నీతిమంతులు కారు  

9. అయినచో, మనము అన్యజనుల కంటె ఏమైన గొప్పవారమా? లేదే! యూదులును, గ్రీకులును అందరును ఒకే విధముగా పాప ప్రభావమునకు లోనై ఉన్నారని నేను ముందే చూపితిని గదా!

10. ఏలయన వ్రాయబడిన ప్రకారము:

               ”నీతి మంతుడు ఎవడును లేడు,

               ఏ ఒక్కడును లేడు.

11.           దేవుని గ్రహించువాడును,

               అన్వేషించువాడును ఒక్కడును లేడు.

12.          అందరును దేవునికి దూరమైన వారే.

               అందరును దుర్మార్గులే.

               ఒక్కడును మంచిచేయడు,

               ఏ ఒక్కడును చేయడు.

13.          వారి గొంతు తెరువబడిన సమాధివలె ఉన్నది.

               వారు మాటలతో మోసపుచ్చుదురు.

               వారి పెదవులయందు సర్పవిషము ఉన్నది.

14.          వారి నోళ్ళు శాపములతోను,

               ద్వేషముతోను నిండిఉన్నవి.

15.          వారి పాదములు రక్తపాతమునకై

               పరుగులెత్తుచున్నవి.

16.          వారు పాదముంచిన ప్రతిస్థలమున

               వినాశము, దౌర్భాగ్యము అనునవియే మిగులును.

17.          శాంతిపథము వారికి తెలియదు.

18.          దేవునకు భయపడుటయు వారు ఎరుగరు”.

19. ధర్మశాస్త్రమున చెప్పునది, దానిని అను సరించి జీవించువారికే వర్తించునని మనకు తెలి యును. అది, వారు ఎట్టి సాకులును చెప్పకుండ చేసి ప్రపంచమునంతను దేవుని తీర్పునకు లోబర చును.

20. ఏలయన, ధర్మశాస్త్రమును పాించు టద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించునట్లు చేయుటయే ధర్మశాస్త్రము యొక్క పని.

దేవుడు మానవులను నీతిమంతులుగా చేయు తీరు   

21. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. యేసు క్రీస్తు నందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును, ప్రవక్తలును దానికి సాక్ష్య మొసగిరి. క్రీస్తునందు విశ్వా సము గలవారిని అందరిని దేవుడు తనకు అంగీకార యోగ్యులుగా చేసికొనును. ఎట్టి భేదమును లేదు.

23. మానవులందరు పాపముచేసి, అందరు దేవుని మహిమకు కొరతబడిరి.

24. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతి మంతులుగా చేయబడిరి.

25. మానవులకు గతమున దేవుడు ఓర్పువహించి మానవుల పాపములను ఉపేక్షించి నందున, ఆయన తన నీతిని కనపరచవలెనని 26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను కరుణా పీఠముగా బయల్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లుచేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చు వాడైయుండుటకు ఆయనను అటుల చేసెను.

27. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమియును లేదే! ఏ కారణమున? క్రియలవలననా? కాదు. విశ్వాసమువలన 28. మానవుడు నీతి మంతుడు అగునది విశ్వాసమువలనగాని, ధర్మ శాస్త్రానుసార క్రియలవలన కాదని మేము భావించు చున్నాము.

29. లేక దేవుడు ఒక్క యూదులకే  దేవుడా? ఆయన అన్యులకు కూడ దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడ దేవుడు.

30. విశ్వాసము ద్వారా ఆయన సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను చేయును.

31. అయినచో ఈ విశ్వాసమువలన మనము ధర్మ శాస్త్రమును ధ్వంసము చేసినట్లగునా? ఎంత మాత్ర మును కాదు. మనము ధర్మశాస్త్రమును నిలబెట్టుదుము.