17 1.        జగడములతోకూడిన ఇంట

                              పంచభక్ష ్యములను ఆరగించుటకంటె,

                              సమాధానముతో పిడికెడు

                              పచ్చడి మెతుకులు తినుటమేలు.

2.           కొడుకు కొరగానివాడైనచో

               తెలివిగల దాసుడు యజమానుడై

               తండ్రి ఆస్తిలో భాగము పంచుకొనును.

3.           వెండిబంగారములను కుంపి పరీక్షించును.

               నరుని హృదయమును ప్రభువు పరీక్షించును.

4.           దుష్టులు దుష్టభావములను ఆలకింతురు.

               అబద్ధీకుడు అసత్యభాషణములు వినును.

5.           పేదవానిని గేలిచేయుట

               అతనిని సృజించిన దేవుని గేలిచేయుటయే.

               పరుల కష్టములనుచూచి సంతసించువాడు

               శిక్షను పొందును.

6.           మనుమలు వృద్ధులకు గౌరవము,

               కుమారులకు తండ్రులే గౌరవము.

7.            మూర్ఖుడు సుభాషితములు పలుకలేడు.

               ఉదాత్తునకు అబద్ధమాడుట తగదు.

8. లంచము మంత్రమువలె పనిచేయును.

               అది సాధించిపెట్టని కార్యములేదు.

9. అన్యుని తప్పు కప్పియుంచువాడు మన్ననపొందును,

               ఆ తప్పును వెల్లడిచేయువాడు

               మిత్రులను విడదీయును.

10.         మూర్ఖుడు నూరుదెబ్బలు క్టొినను

               నేర్చుకొనలేనియంత,

               వివేకశీలి ఒక్కసారి మందలించినంతనే

               నేర్చుకొనును.

11.           దుష్టుడు తిరుగుబాటునకే పూనుకొనును.

               కనుక క్రూరదూత వానిమీదికి వచ్చును.

12.          పిల్లలను కోల్పోయిన ఎలుగుబింనైన

               సమీపింపవచ్చుగాని

               మూర్ఖతతో తిరుగాడు మూఢుని సమీపింపరాదు.

13.          ఉపకారికి  అపకారము చేయువాని ఇంికి

               కీడు చుట్టుకొనును.

14.          వివాదమునకు పూనుకొనుట,

               కట్టలో గండిపడుట వింది.

               దానిని మొదటనే ఆపివేయుట మేలు.

15.          నిర్దోషులను దండించుట,

               దోషులను విడచిపుచ్చుట అను రెండు

               చెయిదములను ప్రభువు అసహ్యించుకొనును.

16. మూర్ఖునిచేత ధనమున్నను ప్రయోజనములేదు.

               తెలివిలేమిచే వాడా సొమ్ముతో

               విజ్ఞానమును ఆర్జింపడు.

17.          స్నేహితుడు ఎల్లవేళల ఆదరముతో ప్రవర్తింపవలెను.

               ఆపదలలో ఆదుకొనుటకుగాకున్న

               సోదరుడు ఇక ఎందులకు?

18.          తోడి నరునికి హామీగా ఉండువానికి

               బుద్ధి ఇసుమంతయునులేదు.

19.          వివాదమును కోరువాడు

               పాపమును కోరుకొనినట్లే.

               ఎల్లప్పుడు గొప్పలు చెప్పుకొనువాడు

               ఆపదలు తెచ్చుకొనును.

20.        కుిల హృదయునికి ఫలితమేమియుదక్కదు.

               మోసపుమాటలు పలుకువానికి

               నాశనము తప్పదు.

21.          మూఢుని కనిన తరడ్రి దుఃఖపూరితుడు అగును. మూర్ఖుని తండ్రికి సంతోషము ఎక్కడిది?

22.        సంతోషచిత్తము మందువలె

               ఆరోగ్యమును చేకూర్చును.

               విషాదస్వభావము ఆరోగ్యమును

               నాశనము చేయును.

23.         దుర్మార్గుడు దొంగచాటుగా లంచముప్టి

               న్యాయము చెరచును.

24.         వివేకశీలి తెలివితో పనికి పూనుకొనును.

               కాని బుద్ధిహీనుని కన్నులు

               భూదిగంతములలో ఉండును.

25.        మూర్ఖుడైన పుత్రుడు

               తండ్రి కడుపున చిచ్చుపెట్టును.

               తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును.

26.        నిరపరాధికి అపరాధము విధించుట

               న్యాయము కాదు.

               సత్పురుషుని శిక్షించుట ధర్మముకాదు.

27.         తెలిసినవాడు అధికముగా మ్లాడడు.

               వివేకి కోపమును అణచుకొనును.

28.        మౌనముగానున్నచో అవివేకియు

               విజ్ఞునివలె చూపట్టును.

               పెదవులు విప్పనిచో

               మూర్ఖుడును వివేకివలె కన్పించును.