2. సొలోమోను సూక్తులు

మొది సంకలనము

10 1.       సొలోమోను సామెతలు:

                              విజ్ఞుడైన కుమారుడు

                              తండ్రికి ఆనందము చేకూర్చును.

                              మూర్ఖుడైన పుత్రుడు

                              తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును.

2.           అన్యాయముగా గడించిన సొమ్ము

               ఆనందమును ఈయజాలదు.

               కాని న్యాయబద్ధముగా జీవించువాడు

               మృత్యువు నుండి తప్పుకొనును.

3.           ప్రభువు ధర్మాత్ముని ఆకలిబాధకు గురిచేయడు.

               కాని అతడు దుష్టుని కోరికలు మాత్రము తీర్పడు.

4.           సోమరిపోతు లేమిని అనుభవించును.

               కష్టించి పనిచేయువాడు సంపదలు బడయును.

5.           వివేకి పంట పండినపుడు కోతకు పూనుకొనును. కోతకాలమున కునుకుతీయువాడు

               నగుబాట్లు తెచ్చుకొనును.

6.           ధర్మాత్ముడు దేవుని దీవెనలు పొందును.

               దుర్మార్గుల మాటలు హింసతో నిండియుండును.

7.            జనులు పుణ్యపురుషులను స్మరించుకొని

               దీవెనలు పలుకుదురు.

               కాని దుర్మార్గులను ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు.

8.           విజ్ఞుడు ఉపదేశమును ఆలించును.

               ఊరక వదరు వెఱ్ఱివాడు నాశనము తెచ్చుకొనును.     

9.           సత్యవర్తనుడు భద్రముగా బ్రతుకును.

               కాని కుిలవర్తనుడు విరోధికి దొరికిపోవును.    

10.         కనుసైగ చేయువాడు వ్యధ ప్టుించును.

               పనికిమాలిన వదరుబోతు నశించును.      

11. సజ్జనుని మాటలు జీవపు ఊటవింవి.

               దుష్టుని పలుకులు హింసతో నిండియుండును.

12.          ద్వేషము తగవులను కొనితెచ్చును.

               ప్రేమ అపరాధములను కప్పిపెట్టును.

13.          తెలివిగల వారి మాటలలో

               విజ్ఞానము ఉి్టపడును.

               కాని మూర్ఖుని వీపు కఱ్ఱదెబ్బలకు గురియగును.

14. వివేకి జ్ఞానము కూడబెట్టుకొనును.

               కాని అవివేకి తన మాటలవలననే

               వినాశనము తెచ్చుకొనును.

15.          ధనవంతుని సంపద అతనిని సంరక్షించును. పేదవాని లేమి అతనిని క్రుంగదీయును.

16.          సత్కార్యములు చేసినందులకు

               ప్రతిఫలము జీవనము.

               దుష్కార్యములు చేసినందులకు

               ప్రతిఫలము వినాశనము.

17.          దిద్దుబాటుకు లొంగువాడు

               జీవనపథమున నడచును.

               మందలింపులను లక్ష్యము చేయనివాడు

               అపమార్గము పట్టును.

18.          అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధీకుడు

               నిందలను ప్రచారము చేయువాడు మూర్ఖుడు.

19.          అతిగా ప్రేలినచో తప్పుదొరలక తప్పదు.

               మౌనము వహించువాడు వివేకి.

20.        పుణ్యపురుషుని పలుకులు మంచి వెండివింవి.

               దుష్టుని  భావములు చెత్తవింవి. 

21.          ధర్మాత్ముని పలుకులు

               చాలమందికి లాభము చేకూర్చును.

               మూఢుని మూర్ఖత అతనికే చావు తెచ్చిపెట్టును.

22.        దేవుని దీవెనవలన సిరులబ్బును.

               స్వయంకృషివలననే  సంపదలు కలుగవు.

23.        దుష్కార్యములవలన మూర్ఖునికి

               వినోదము కలుగును.

               కాని జ్ఞానార్జనమువలన

               జ్ఞానికి ప్రమోదము కలుగును.

24.         దుష్టుడు దేనికి భయపడునో

               అదియే అతనికి సంభవించును.

                కాని ధర్మాత్ముని కోరికలు ఫలించును.

25.        తుఫాను లేచినపుడు దుర్మార్గుడు నిర్మూలమగును

               కాని సత్పురుషుడు దృఢముగా నిలుచును.

26.        పింకి పులుపు, కింకి పొగ ఎట్టులో

               సోమరి తనను పనికి పంపినవానికట్లుండును.

27.         దేవునిపట్ల భయభక్తులు చూపువాడు

               దీర్ఘాయుష్మంతుడు అగును.

               దుష్టుడు అల్పాయుష్కుడగును.

28.        ధర్మాత్ముల కోరికలు ఆనందము చేకూర్చును.

               కాని దుష్టుల కోరికలు వమ్మగును.

29.        ప్రభువు పుణ్యాత్మునకు

               రక్షణదుర్గము వింవాడగును.

               కాని ఆయన దుష్టాత్ముని కూలద్రోయును.

30.        ధర్మాత్ముడు భద్రముగానుండునుగాని

               దుష్టుడు నేలమీద నిలువడు.

31.          సజ్జనుడు విజ్ఞాన వాక్యములు పలుకును.

               కల్లలాడు నాలుక పెరికివేయబడును.

32.        సత్పురుషుడు కరుణపూరిత

               వాక్యములు పలుకును.

               కాని దుష్టుడు కపటపు మాటలు పలుకును.