దేవుని మహిమ, నరుని ఘనత

ప్రధానగాయకునికి గిత్తీత్‌ రాగమునుబ్టి పాడదగిన

దావీదు కీర్తన

8            1.             మా దేవుడవైన ప్రభూ! నీ నామము

                              భూమియందంతటను ఘనమైనది.

                              ఆకాశమునకు పైన

                              నీ మహిమ కన్పించుచున్నది.

2.           చింబిడ్డలు పసికందులు

               నిన్ను స్తుతించునట్లు చేసితివి.

               విరోధులను ఎదిరించుటకు

               నీవొక రక్షణదుర్గమును నిర్మించితివి.

               దానినుండి నీవు నీ శత్రువులను,

               నీ మీద తిరుగుబాటు చేయువారిని

               అణచివేయుదువు.

3.           నీ చేతిపనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను కాంచి

               నేను విస్మయమొందితిని.

4.           నీవు నరుని జ్ఞప్తికితెచ్చుకొనుటకు

               అతడేపాివాడు? అల్పమానవుని

               పరామర్శించుటకు అతడు ఎంతివాడు?

5.           అయినను నీవు నరుని దేవునికంటెను

               కొంచెము తక్కువ వానినిగా

               మాత్రమే చేసితివి.

               కీర్తిమహిమలను కిరీటముతో

               అతడిని అలంకరించితివి.

6-8. గొఱ్ఱెలు, ఎడ్లు, వన్యమృగములు,

               ఆకాశమునందలి పకక్షులు,

               సముద్రమునందలి చేపలు,

               సాగరమునందలి జీవరాసులు మొదలుకొని

               నీవు చేసిన సృష్టికంతికి

               అతనిని అధిపతిని గావించితివి.    

               సమస్తమును

               అతని పాదముల క్రింద ఉంచితివి.

9.           మా దేవుడవైనన ప్రభూ!

               నీ నామము భూమియందంతటను

               ఎంతో ఘనమైనది.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము