ఆపదలో ప్రార్థన

 దావీదు కీర్తన

25 1.  ప్రభూ! నేను నీకు ప్రార్థన చేయుచున్నాను.    

2.           నేను నిన్ను నమ్మితిని.

               నా విరోధులు నా పతనముచూచి

               సంతసింపకుండునట్లు చేయుము.

               వారివలన నేను అవహేళనకు

               గురికాకుండునట్లు చేయుము.

3.           నిన్ను నమ్మినవారు ఎన్నడును

               అవమానమునకు గురికాకుందురుగాక!

               నీ మీద తిరుగుబాటుచేయు

               దుర్మార్గులకే తలవంపులు వచ్చునుగాక!

4.           ప్రభూ! నీ మార్గములను

               నాకు తెలియజేయుము.

               నీ త్రోవలను నాకెరిగింపుము.

5.           నన్ను నీ సత్యమునందు నడిపింపుము.

               నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక

               నాకు బోధచేయుము.

               దినమంతయు నీ కొరకై వేచియుందును.

6.           ప్రభూ! చిరకాలమునుండి

               నీవు నాపట్ల చూపుచువచ్చిన

               కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము.

7.            యవ్వనమున నేను చేసిన పాపములను

               గుర్తుపెట్టుకొనకుము.     

               నీ ప్రేమనుబ్టియు, నీ మంచితనముబ్టియు,

               నీవు నన్ను జ్ఞప్తియందుంచుకొనుము.

8.           ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు.

               అతడు పాపులకు

               తన త్రోవలను తెలియచేయును.

9.           వినయవంతులను సన్మార్గమున నడిపించును.

               దీనాత్ములకు తన మార్గమును బోధించును.

10.         ప్రభువు నిబంధనములను,

               ఆజ్ఞలను పాించువారిని ఆయన ప్రేమతోను,

               నమ్మదగినతనముతోను నడిపించును.

11.           ప్రభూ! నీ పేరునకు తగినట్లుగా

               నా ఘోర పాపములను మన్నింపుము.

12.          ప్రభువునకు భయపడువారు.

               తాము నడువవలసిన త్రోవను

               ఆయననుండియే తెలిసికొందురు.

13.          వారు సదా శుభములు బడయుదురు.

               వారి సంతానము

               భూమిని స్వాధీనము చేసికొనును.

14.          ప్రభువునకు భయపడువారు

               అతనికి సన్నిహితులగుదురు.

               అతడు తన నిబంధనను వారికి తెలియజేయును.

15.          నేను ఎప్పుడును ప్రభువు సహాయముకొరకు

               కనిపెట్టుకొనియుందును.

               నా పాదములను బంధనములనుండి

               విడిపించువాడు ఆయనే.

16.          ప్రభూ! నీ దృష్టిని నా మీదికి మరల్చి

               నన్ను కరుణింపుము.

               నేను ఏకాకిని, దరిద్రుడను.

17.          నా విచారములెల్ల తొలగింపుము.

               నా బాధలనెల్ల తుదమ్టుింపుము.

18.          నా దైన్యమును, నా వెతలను పరిశీలింపుము.

               నా పాపములన్నింని క్షమింపుము.

19.          నాకెంతమంది శత్రువులున్నారో చూడుము.

               వారికి నేననిన ఎంత ద్వేషమో చూడుము.

20.        నీవు నన్ను కాపాడి సంరక్షింపుము.

               నేను నిన్నాశ్రయించితిని కనుక

               నా శత్రువులవలన అవహేళనమునకు

               గురికాకుండునట్లు చేయుము.

21.          నీ మంచితనమును, ధర్మవర్తనమును 

               నన్ను కాపాడునుగాక!

               నేను నీ కొరకై వేచియుింని.

22.         ప్రభూ! యిస్రాయేలును

               సకలవిపత్తులనుండియు రక్షింపుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము