యెరూషలేమున వసించినవారు

11 1. పెద్దలు యెరూషలేమున స్థిరపడిరి. మిగిలినవారిలో ప్రతి పదికుటుంబములలో ఒక కుటుంబము  యెరూషలేమున  స్థిరపడవలెనని ఒప్పందము చేసికొని చీట్లు వేసికొనిరి. యెరూషలేము న వసింపని కుటుంబములు అన్ని ఇతర నగర ములలో వసింపవలెను.

2. యెరూషలేమున జీవించు టకు ఒప్పుకొనిన వారందరిని ప్రజలు దీవించిరి.

3. యూదా రాజ్యమునకు చెందిన వారిలో యెరూషలేమున వసించిన ప్రముఖవ్యక్తుల జాబితా ఇది: యూదా పట్టణములలో ప్రతివారు తమతమ పట్టణములలోని స్వస్థలములలో జీవించిరి. యిస్రా యేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయపు పనివాండ్రు, సొలోమోను సేవకుల బిడ్డలు ఇతర నగరములలో తమతమ భూములలోనే నివాసములు ఏర్పరచుకొనిరి.

యోరూషలేమునందలి యూదులు

4. యెరూషలేమున వసించిన యూదా తెగ వారు వీరు: జెకర్యా మనుమడును ఉజ్జీయా కుమారు డునైన అతాయా. యూదా కుమారుడైన పెరెసు వంశ మునకు చెందిన అమర్యా. షెఫత్యా, మహలలేలు ఇతని మూల పురుషులు.

5. కొల్హోసే మనుమడును బారూకు కుమారుడునైన మాసెయా. హసాయా, అదాయా, యోయారిబు, జెకర్యా, షిలోను ఇతని మూలపురుషులు. 

6. పెరెసు వంశజులలో మొత్తము నాలుగు వందల అరువది ఎనిమిది మంది ప్రముఖ వ్యక్తులు యెరూషలేమున వసించిరి.

7. యెరూషలేమున స్థిరపడిన బెన్యామీను తెగ వారు వీరు: యోయేదు మనుమడును మెషుల్లాము కుమారుడునగు సల్లు. పెదయా, కోలాయా, మాసేయా, ఈతియేలు, యెషయా ఇతని మూలపురుషులు.

8. గబ్బయి, సల్లయి ఇతనికి దగ్గరి చ్టుాలు. బెన్యా మీను కుటుంబ సభ్యులు తొమ్మిది వందల ఇరువది ఎనిమిది మంది యెరూషలేమున వసించిరి.

9. సిక్రి కుమారుడైన యోవేలు వారికి అధికారి. హసెనూవా కుమారుడగు యూదా రెండవ అధికారి.

10. అచట వసించిన యాజకులు వీరు: యోయారీబు కుమారులు యెదాయా, యాకీను.

11. మెషూల్లాము మనుమడును హిల్కియా కుమారు డునగు సెరాయా. సాదోకు, మెరాయోతు, దేవాలయా ధికారియైన అహీటూబు, సెరాయా ఇతని మూలపురు షులు.

12. ఈ వంశమునకు చెందినవారు ఎనిమిది వందల ఇరువది రెండు మంది దేవాలయమున ఊడి గము చేసిరి. పెలాయా మనుమడును యెరోహాము కుమారుడునైన అదాయా. అంసీ, జెకర్యా, పషూరు, మల్కీయా ఇతని మూలపురుషులు.

13. ఈ వంశ మునకు చెందినవారు రెండువందల నలుబది రెండు మంది ఆయా వంశములకు అధిపతులు. అహ్సయి మనుమడును అసరేలు కుమారుడునైన అమష్షయి. మెషిల్లేమోతు, ఇమ్మేరు ఇతని మూలపురుషులు.

14. ఈ వంశమునకు చెందినవారు నూట ఇరువది ఎని మిది మంది మహావీరులు. ప్రసిద్ధ కుటుంబమునకు చెందిన హగ్గేదోలీము కుమారుడగు సబ్దీయేలు వీరికి అధిపతి.

15. అచట వసించిన లేవీయులు వీరు: అస్రికాము మనుమడును హష్హూబు కుమారుడునైన షెమయా. హషబ్యా, బున్ని ఇతని మూల పురుషులు.

16. షబ్బెతాయి, యోసాబాదు అను ఇద్దరు ప్రము ఖులు దేవాలయమునకు చెందిన బాహ్య విషయ ములను చూచుకొనుచుండిరి.

17. ఆసాపు వంశ మునకు చెందిన సబ్ది మనుమడును మీకా కుమారు డునైన మత్తనియా. స్తుతిగీతములు పాడు గాయకులకు ఇతడు నాయకుడు. బక్బుక్యా ఇతనికి సహాయకుడు. యెదూతూను వంశమునకు చెందిన గాలాలు మను మడును షమ్మువ కుమారుడునైన అబ్దా.

18. పవిత్ర నగరమగు యెరూషలేమున మొత్తము రెండు వందల ఎనుబదినాలుగుమంది లేవీయులు వసించిరి.

19.  అచట వసించిన దేవాలయ ద్వార సంరక్షకులు వీరు: అక్కూబు, తల్మోను అను వారు, వారి బంధువులు మొత్తము కలిసి నూట డెబ్బది రెండు మంది.

20. మిగిలిన యిస్రాయేలీయులు, మిగిలిన యాజకులు, లేవీయులు యూదా రాజ్యములోని వారి వారి నగరములలో సొంతభూములలోనే   వసించిరి.

21. దేవాలయపు పనివాండ్రు (నెతీనీయులు) యెరూషలేములోని ఓఫెలులో వసించిరి. వారు సీహా, గిష్పా నాయకుల క్రింద పనిచేసిరి.

22. హషబ్యా  మనుమడును  బానీ  కుమారుడునైన  ఉజ్జి యెరూషలేమున వసించు లేవీయులకు పర్యవేక్షకుడు. మత్తన్యా, మీకా అనువారు ఇతని మూలపురుషులు. ఈ ఉజ్జి దేవాలయములో పాటలు పాడిన ఆసాపుని వంశమునకు చెందినవాడు 23. లేవీయులు దేవాల యమున ప్రతిదినము వంతుల ప్రకారము పాటలు పాడవలయును. వారికి అనుదిన బత్తెము ఈయవ లెనని రాజశాసనము కలదు.

24. యూదావంశమున సేరా కుటుంబమునకు చెందిన మెషెసాబెలు కుమా రుడు పెతాహియా పారశీకప్రభువు ఆస్థానమున అన్ని ప్రజావ్యవహారములు చక్కబెట్టువానిగా ఉండెను.

ఇతర పట్టణములలోని యూదులు

25. చాలమంది వారి పొలముల దాపునగల గ్రామములలో వసించిరి. యూదా వంశమువారు కిర్యతార్బా, దీబోను, యేకబ్సీలు నగరములందు వాని దాపునగల గ్రామములందు వసించిరి.

26-27. మరియు వారు యేషూవ, మొలాదా, బేత్పేలెటు, హసర్షువలు, బేర్షెబా నగరములలోను, బేర్షెబా వాని చేరువనగల గ్రామములలో వసించిరి.

28-29. ఇంకను సిక్లాగు, మెకోనా, మరియు దాని చుట్టు పట్లగల గ్రామములు, ఎన్‌-రిమ్మోను, సోరా, యార్మూతు తావులలో వసించిరి.

30. సనోవా, అదుల్లాము నగరములలో వాని దాపునగల పల్లెలలో, లాకీషులో దాని చెంతగల పొలములలో, అసేకాలోను దాని ప్రక్కననున్న పల్లెలలో వసించిరి. ఈ రీతిగా యూదీయులు  దక్షిణమున  బేర్షెబా,  ఉత్తరమున హిన్నోము లోయ ఎల్లలుగాగల దేశమున స్థిరపడిరి.

31-35. బెన్యామీను వంశమువారు గేబా, మిక్మాసు, హాయ, బేతేలు, వాని చెంతగల గ్రామ ములు, అనానోతు, నోబు, అనన్యా, హాసోరు, రామా, గిత్తాయీము, హాదీదు, సెబోయీము, నెబల్లాతు, లోదు, చేతివృత్తులవారి లోయ ఓనో మొదలైన తావులలో వసించిరి.

36. యూదా వంశజులతో వసించిలేవీయులు కొందరు వచ్చి బెన్యామీనీయులతో నివసించిరి.

Previous                                                                                                                                                                                              Next