నీతిసూర్యుడైన ప్రభువు

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

19 1.       ఆకాశము దేవునిమహిమను చాటుచున్నది.

                              అంతరిక్షము ప్రభువు సృష్టిని

                              వెల్లడి చేయుచున్నది.

2.           ఒక పగలు మరియొక పగికి

               ఈ సంగతిని బోధచేయుచున్నది.

               ఒక రేయి మరియొక రేయికి

               జ్ఞానమును తెలియచేయుచున్నది.

3.           ఆ రేయింబవళ్ళకు భాషగాని, మాటలుగాని లేవు.

               వానినుండి ఎి్ట ధ్వనియు విన్పింపదు.

4.           అయినను వాని స్వరము

               భూమియందంతట వ్యాపించినది.

               వాని సందేశము

               నేల అంచులవరకు విన్పించుచున్నది.

5.           ప్రభువు ఆకసమున సూర్యునికి

               ఒక గుడారమును నిర్మించెను.

               సూర్యబింబము పెండ్లిపందిరినుండి వచ్చు

               వరునివలె వెలువడును.

               క్రీడాకారునివలె సంతసముతో

               పరుగునకు పూనుకొనును.

6.           అది ఆకాశమున ఈ అంచునుండి

               బయలుదేరి ఆ అంచువరకును పయనించును.

               దాని వేడిమినేదియు తప్పించుకోజాలదు.

7.            ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది.

               అది ప్రాణమునకు సేదతీర్చును.

               ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి.

               అవి బుద్ధిహీనులకు జ్ఞానమును ఒసగును.

8.           ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి.

               అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి.

               అవి మనసునకు వివేచనము ఒసగును.

9.           దైవభీతి నిష్కల్మషమైనది,

               అది కలకాలము నిలుచును.

               ప్రభువు చట్టములు సత్యమైనవి,

               అవి అన్నియు ధర్మమైనవే.

10.         అవి మేలిమి బంగారముకంటె

               ఎక్కువగా ఆశింపదగినవి.

               తేనెపట్టునుండి చిప్పిలు తేనెకంటె తీయనైనవి.

11.           అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును.

               వానిని పాించుటవలన

               నాకు గొప్ప బహుమతి లభించును.

12.          తన తప్పులను తాను తెలిసికోగలవాడెవడు?

               నేను తెలియక చేసిన

               తప్పిదములనెల్ల తుడిచివేయుము.

13.          నేను చేసిన అహంకారపూరిత పాపములనుండి

               నీ దాసుడనైన నన్ను కాపాడుము.

               నేను ఆ తప్పిదములకు

               లొంగిపోకుండునట్లు చేయుము.

               అప్పుడు నేను దోషరహితుడను అగుదును.

               ఘోరమైన పాపమునుండి తప్పుకొందును.

14.          నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడవునైన

               ప్రభూ! నా పలుకులు, నా ఎదలోని తలంపులు,

               నీ మన్నన బడయునుగాక!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము