బాధలలో దేవునికి మనవి

జ్ఞాపకార్ధాంశముగా దావీదు కీర్తన

38 1.      ఓ ప్రభూ! నా మీద కినుకబూని

                              నన్ను చీవాట్లు పెట్టకుము.

                              నా మీద ఆగ్రహము చెంది

                              నన్ను శిక్షింపకుము.

2.           నీవు రువ్విన బాణములు

               నా శరీరమున గ్రుచ్చుకొనినవి.

               నీ హస్తము నన్ను శిక్షించినది.

3.           నీ కోపము వలన నేను రోగమువాత పడితిని.                          

నా పాపమునుబ్టి నా ఎముకలలో స్వస్థత లేదు.

4.           నా పాపములు అను వెల్లువ

               నన్ను ముంచివేసినది.

               నా దోషములు అను పెనుభారము

               నా మీదనిలిచి నన్ను క్రుంగదీసినది.

5.           నా బుద్ధిహీనత వలన నా గాయములు

               క్రుళ్ళి దుర్గంధమొలుకుచున్నవి.

6.           నేను వంగిన దేహముతో క్రుంగి కృశించుచు,

               దినమంతయు విలపించుచున్నాను.

7.            నేను జ్వరము వేడిమివలన మాడిపోవుచున్నాను.                  

నా దేహమున ఆరోగ్యము ఏ మాత్రమును లేదు.

8.           నేను పూర్తిగా క్రుంగిపోయి

               వినాశము వాతపడితిని.

               హృదయవేదనవలన మిగుల విలపించితిని.

9.           ప్రభూ! నా కోరికలు నీకు తెలియనివి కావు.

               నా నిట్టూర్పులు నీ వెరుగనివికావు.

10.         నా గుండె దడదడకొట్టుకొనుచున్నది.

               నేను సత్తువ కోల్పోయితిని.

               నా కన్నులలోని కాంతి కూడ అంతరించినది.

11.           నా స్నేహితులు, ఇరుగుపొరుగు వారు

               నా గాయములను చూచి

               నా చెంతకు వచ్చుటలేదు.

               నా బంధువులుకూడ

               దూరముగా నిలుచుచున్నారు.

12.          నన్ను చంపజూచువారు

               నాకు ఉరులు పన్నుచున్నారు.

               నాకు కీడెంచువారు

               నా వినాశము గురించి మాటలాడుచున్నారు.

               రోజంతయు నా మీద కుట్రలు పన్నుచున్నారు.

13.          కాని నేను చెవివానివలె

               వారి పలుకులు విననైతిని.

               మూగవానివలె వారితో మ్లాడనైతిని.

14.          నేను వినలేనివాడనైతిని.

               వారి పలుకులకు బదులుచెప్పక ఊరకుింని.

15.          ప్రభూ! నేను నిన్నే నమ్ముచున్నాను.

               నీవు నాకు తప్పక ప్రత్యుత్తరమిత్తువు.

16.          నా ప్రార్థన ఇది:

               నా విరోధులు నన్ను జూచి

               సంతసింపకుందురుగాక! 

               నా పాదములు తొిల్లినపుడు

               వారు నా పతనమును జూచి

               ఉబ్బిపోకుందురుగాక!”

17.          నేను పడిపోవుటకు సిద్ధముగా ఉన్నాను.

               నాకు నిరంతరము నొప్పి కలుగుచున్నది.

18.          నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.

               నా తప్పిదములకు దుఃఖపడుచున్నాను.

19.          నా శత్రువులు బలిసి వృద్ధిలోకి వచ్చుచున్నారు.                       

చాలమంది నిష్కారణముగా

               నన్ను ద్వేషించుచున్నారు.

20.        నేను మేలుచేయగా నాకు కీడుచేసిన వారున్నారు.

               నేను మంచినిజేయ యత్నించుచున్నాను

               గనుక వారు నాకు శత్రువులగుచున్నారు.

21.          నా దేవుడవైన ప్రభూ!

               నీవు నన్ను చేయి విడువకుము.

               నన్ను ఉపేక్షించుచు

               దూరముగా నిలిచియుండకుము.

22.         నా రక్షకుడవైన ప్రభూ!

               నీవు నన్నాదుకొనుటకు శీఘ్రమే రమ్ము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము