మ్రొక్కుబడులను గూర్చి

1. నరులు

27 1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయు లతో ఇట్లు చెప్పుమనెను: ”ఎవడైనను ప్రభువునకు నివేదిత అర్పణగా మ్రొక్కుబడి చేసినయెడల వానికి గాని, లేక వాికిగాని సమమైన వెలను మ్రొక్కుబడిగా చెల్లించవలయును. తన్నుతాను ప్రభువునకు అర్పించు కొనెనేని ఆ మ్రొక్కుబడిని తీర్చుకొనుటకై ఈ క్రింది రీతిగా ప్రామాణికమైన తులామానము ప్రకారము సొమ్ము చెల్లింపవలయును.

3-7: ఎట్లనగ: ఇరువది నుండి అరువది యేండ్ల మధ్యలో నున్న పురుషులకు-50 వెండి నాణెములు, అదే ప్రాయములోనున్న స్త్రీలకు – 30 వెండి నాణెములు.

ఐదు నుండి ఇరువది యేండ్ల మధ్యలోనున్న మగ వారికి-20 వెండి నాణెములు. అదే ప్రాయములో నున్న ఆడువారికి-10 వెండి నాణెములు.

ఒక నెల నుండి ఐదేండ్ల వరకుగల మగబిడ్డలకు-5 వెండినాణెములు. అదే ప్రాయపు ఆడుబిడ్డలకు-3 వెండి నాణెములు. అరువదియేండ్లకు పై బడిన పురుషులకు-15 వెండి నాణెములు, అదేప్రాయపు స్త్రీలకు-10 వెండి నాణెములు.

8. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత పేదవాడైనప్పుడు, అతనిని యాజకుని ఎదుటకు కొనిరావలెను. అప్పుడు యాజకుడు ఆ మ్రొక్కుకొనిన వాని స్థితినిబ్టి అతని వెలను నిర్ణయింపవలెను.

2. పశువులు

9. ఎవడైన తగినపశువును ప్రభువునకు అర్పింతు నని మ్రొక్కుకొనినచో, ఇక ఆ పశువు పవిత్రమైన కానుకగా మారిపోవును.

10. అి్ట మ్రొక్కుబడి చేసికొనినవాడు ఆ పశువును మార్చి దానికి బదులుగా మరియొకదానిని ఈయరాదు. చెడుదాని బదులు మంచిదానిని, మంచిదానికి బదులు చెడుదానిని మార్చకూడదు. అటుల చేయదలచినచో ఆ రెండు ప్రభువునకే చెందవలయును.

11. కాని అతడు అశుద్ధపశువును ప్రభువునకు సమర్పించెదనని మ్రొక్కు కొనినచో, దానిని యాజకునియొద్దకు కొనిరావల యును.

12. ఆ పశువు బాగోగులనుబ్టి యాజకుడు దానికి వెలకట్టును. ఇక ఆ వెలకు తిరుగులేదు. 13. మ్రొక్కుకొనినవాడు ఆ పశువును విడిపించుకొనగోరిన యెడల దానివెలను, దానికి అదనముగా ఐదవవంతు సొమ్మును చెల్లింపవలయును.

3. ఇండ్లు

14. ఎవడైన తన ఇంిని ప్రభువునకు అర్పించి నచో యాజకుడు ఆ ఇంి బాగోగులనెంచి దానికి ధర నిర్ణయించును. ఇక ఆ వెలకు తిరుగులేదు.

15. యజమానుడు ఆ ఇంిని మ్రొక్కుబడినుండి విడిపించు కొనగోరినయెడల యాజకుడు నిర్ణయించిన వెలను, దానికి అదనముగా ఐదవవంతు సొమ్మును చెల్లింప వలయును.

4. పొలములు

16. ఎవడైన పిత్రార్జితమైన భూమిని ప్రభువునకు అర్పించెనేని, ఆ పొలమున వెదజల్లు విత్తనములను బ్టి దానికి వెలకట్టవలయును. అనగా కుంచము యవధాన్యపు విత్తనములకు ఏబది వెండికాసుల చొప్పున వెలకట్టవలయును.

17. యజమానుడు హితవత్సరమున పొలమును దేవునికి అర్పించెనేని యాజకుడు నిర్ణయించిన వెలయే స్థిరము.

18. కాని అతడు హితవత్సరము గడచినపిదప పొలమును అర్పించెనేని యాజకుడు ఆ సమర్పించిన సమయము నుండి మరల వచ్చు హితవత్సరమునకు ఎన్ని ఏండ్లు న్నవో గణించి వెల నిర్ణయింపవలెను. ఆ గడువుకు ఎన్ని ఏండ్లు తక్కువైన  వెలకూడ అంతగా తగ్గును.

19. యజమానుడు తానర్పించిన భూమిని మ్రొక్కు బడినుండి విడిపించుకొనగోరినయెడల, దానికి నిర్ణ యింపబడిన వెలలో, ఐదవవంతు దానికి కలుప వలెను: అపుడది దాని స్వంతదారునిది అగును.

20. కాని అతడు ఆ పొలమును మ్రొక్కుబడినుండి విడిపించుకొనకయే మరియొకనికి అమ్మినయెడల ఆ మీదట దానిని విడిపించుకొను అవకాశము ఉండదు.

21. ఆ పొలమును కొనినవాడు హిత వత్సరమున దానిని విడనాడవలెనుకదా! అప్పుడది ప్రభువునకు అర్పితమై యాజకునికి భుక్తమగును.

22. పిత్రా ర్జితముగాక స్వయముగా సంపాదించుకొనిన పొల మును ఎవడైన ప్రభువునకు అర్పించినయెడల, 23. యాజకుడు రానున్న హితవత్సరమునకు ఇంక ఎన్ని ఏండ్లున్నవో గణించి వెల నిర్ణయించును. ఆ దినము ననే యజమానుడు పొలము వెల చెల్లించును. ఆ సొమ్ము ప్రభువునకు ముట్టును.

24. కాని హిత వత్సరము వచ్చినపుడు ఆ భూమి అమ్మినవానికి, అనగ ఎవని పిత్రార్జితమో వానికే చెందును.

25. ఎల్లప్పుడు దేవాలయ తులామానము ప్రకారము వెల కట్టవలయును. ఒక వెండికాసునకు ఇరువది చిన్నములు.

మ్రొక్కుబడినుండి విడిపింపవలసినవి

1. తొలిచూలు పిల్లలు

26. పశువులకు ప్టుిన తొలిచూలు పిల్లలు స్వయముగనే ప్రభువునకు చెందును. కనుక వాని నెవరు మరల ప్రభువునకు అర్పింపరాదు. అది ఎద్దు అయినను, గొఱ్ఱెపిల్ల అయినను ప్రభువునకే చెందును.

27. కాని ప్రభువునకు అర్పింపదగని జంతువుల తొలిచూలు పిల్లలను మాత్రము విడిపించుకొని రావచ్చును. అప్పుడు వాని వెలను, దానికి అదనముగా ఐదవవంతు సొమ్మును చెల్లింపవలెను. అటుల విడి పింపని తొలిచూలు పిల్లలను యాజకుడు ఎవరికైన తగిన వెలకు అమ్మివేయవచ్చును.

2. శాపముపాలైనవి

28. శాపముపాలైన వస్తువును మాత్రము – నరుడినైౖనను, జంతువునైౖనను, పిత్రార్జిత పొలమునైనను – మరల విడిపింపరాదు. అది పూర్తిగా దేవునికే చెందును.

29. శాపముపాలైన నరుని కూడ మరల విడిపింపరాదు, వధింపవలసినదే.

3. పన్నులు

30. పొలమున పండిన ధాన్యములోను, పండ్ల లోను పదియవవంతు ప్రభువునకు చెందును.

31. ఎవడైన తానర్పించిన పదియవవంతును మరల కొనగోరినయెడల దానికి నిర్ణయింపబడిన వెలకు అదనముగా ఐదవవంతు సొమ్మును చెల్లింపవల యును.

32. కాపరిదండము క్రింద లెక్కింపబడు పశుమందలోని ప్రతి పదియవది ప్రభువునకు అర్పింపవలయును.

33. కాని ఇట్లు లెక్కపెట్టునపుడు యజమానుడు ఇది మంచిదా, కాదా అని చూడరాదు. ఒక పశువునకు బదులుగా మరియొకదానిని మార్చ రాదు. అటుల మార్చవలసినయెడల ఆ రెండు పశువు లును ప్రభువునకే చెందును. ఇక వాిని  మ్రొక్కుబడి నుండి విడిపించుకొనుటకు  వీలుపడదు.”

34. ప్రభువు సీనాయికొండ మీద మోషే ముఖమున యిస్రాయేలీ యులకు ప్రసాదించిన నియమములు ఇవియే.

Previous                                                                                                                                                                                               Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము