యెరికో పట్టణమును ఆక్రమించుట

6 1. అప్పుడు యిస్రాయేలీయుల వలన భయముచే యెరికో పట్టణవాసులు నగరద్వారమును గ్టిగా మూసివేసిరి. లోపలివారు బయికిపోలేదు, బయి వారు లోపలికి రాలేదు.

2. అంతట యావే యెహోషువతో ”నేనిప్పుడు యెరికో నగరమును, యెరికో రాజును నీకు కైవసము చేసియున్నాను.

3. మీ యోధులు, పరాక్రమశాలులు పట్టణమును ఒక సారి చ్టుిరావలెను. అటుల మీరు ఆరు రోజులు చేయవలెను.

4. ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలి కొమ్ముబాకాలను పట్టుకొని దేవుని మందసము ముందు నడువవలెను. ఏడవరోజు యాజకులు బాకాలను ఊదుచుండగా మీరు ఏడుసార్లు పట్టణము చ్టుిరండు.

5. ఆ బాకాలధ్వని విని మీ జనులందరు యుద్ధనాదములతో కేకలు వేయవలెను. అప్పుడు కోటగోడ దానియంతట అదియే నేలకూలును. వెంటనే మీ జనులు లోనికిపోయి నగరమును వశము చేసికోవలెను” అనిపలికెను.

6. నూను కుమారుడగు యెహోషువ యాజకులను పిలిచి ”మీరు నిబంధన మందసమును మోసికొనిపొండు. ఏడుగురు యాజకులు ఏడుబాకాలు పట్టుకొని యావే నిబంధనమందసము ముందువెళ్ళుడు” అని చెప్పెను.

7. ప్రజలతో ”మీరు ముందుకు పొండు. పట్టణముచుట్టు నడువుడు. ఆయుధములు ధరించిన వీరులు యావే మందసము నకు ముందుగా నడువుడు” అని పలికెను.

8. ప్రజలు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఏడుగురు యాజకులు ఏడుబాకాలు ఊదుచు యావే సాన్నిధ్యమున ముందు సాగుచుండగా యావేనిబంధన మందసము వారిని అనుసరించెను.

9. ఆయుధము లను ధరించిన వీరులు బాకాలను ఊదు యాజకులకు ముందుగా నడచిరి. మిగిలిన దండు మందసము వెనుక నడచెను. ఈ రీతిగా బాకాలు మ్రోగుచుండగా జనులు ముందుకు సాగిరి.

10. అప్పుడు యెహోషువ ”నేను చెప్పువరకు మీరు కేకలు వేయవలదు. ఒక్కమాట కూడ మ్లాడ వలదు. మీ కంఠమునుండి ఏ శబ్ధమును రాకూడదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను” అని ప్రజలకు ఆనతిచ్చెను.

11. యెహోషువ ఆజ్ఞాపించిన ప్రకారము యావే మందసము నగరమును ఒకసారి చ్టుివచ్చెను. ఆపై ప్రజలు శిబిరమునకు తిరిగి వచ్చి అక్కడ రాత్రి గడపిరి.

12. యెహోషువ ఉదయమున లేచెను. యాజకులు యావే మందసము నెత్తుకొనిరి.

13. ఏడుగురు యాజకులు ఏడుబాకాలను ఊదుచు యావే మందసము ముందునడచిరి. ఆయుధములు ధరించిన వీరులు వారిముందు నడచిరి. మిగిలిన దండు యావే మందసము వెనుక నడచెను. ఈ రీతిగా బాకాలు మ్రోగుచుండగా దండుకదలెను.

14. రెండవరోజు నగరముచుట్టు ఒకసారి తిరిగి వారు శిబిరమునకు మరలివచ్చిరి. అటుల ఆరు రోజులు చేసిరి. 15. ఏడవరోజు ఉదయమున లేచి మునుపివలె కోటగోడచుట్టు ఏడుసార్లు తిరిగిరి. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు కోటచుట్టు తిరిగిరి.

16. ఏడవసారి యాజకులు బాకాలను ఊదు చుండగా యెహోషువ ”యావే యెరికో నగరమును మీ వశము చేసెను. యుద్ధనాదము చేయుడు” అనెను.

యెరికో శాపమునకు గురియగుట

17. యెహోషువ ప్రజలతో ”ఈ నగరము, నగరములోని సమస్తము యావే శాపమునకు గురి అయ్యెను. మనము పంపిన వేగులను దాచి రక్షించినది కావున రాహాబు అను వేశ్యయు, ఆమె ఇంివారును మాత్రమే బ్రతుకుదురు. 18. మీరు శాపవిషయమున జాగ్రత్తతో నుండుడు. శాపమునకు గురియైన దేనిని మీరు దురాశచే ముట్టరాదు. మ్టుినచో యిస్రాయేలీ యుల శిబిరమునకు గూడ ఆ శాపము తగిలి గొప్ప ఆపద సంభవించును.

19. వెండిబంగారములు, ఇత్తడిపాత్రలు, ఇనుపపాత్రలు అన్నియు యావేకు చెందును. కావున వానిని యావే ధనాగారములో ఉంచవలెను” అని చెప్పెను.

20. అంతట యాజకులు బాకాలూదగా ప్రజలు కేకలు వేసిరి. బాకాలమ్రోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోటగోడ కుప్ప కూలిపడెను. తక్షణమే ప్రజలు నేరుగా పట్టణములో జొరబడి పట్టణమును ఆక్రమించుకొనిరి. 21. స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, ఎద్దులు, గొఱ్ఱెలు, గాడిదలు – ఇదియదియనక, శ్వాసించు ప్రతిదానిని సంహరించి శాపముపాలు చేసిరి.

రాహాబు గృహము రక్షింపబడుట

22. అప్పుడు యెహోషువ ఆ దేశమున వేగు నడపిన మనుష్యులనిద్దరను పిలిచి ”ఆ వేశ్య ఇంట ప్రవేశించి ఆమెను, ఆమెకు సంబంధించిన వారి నందరిని తీసికొనిరండు. మీ శపథము నెరవేర్చు కొనుడు” అని చెప్పెను. 23. వేగునడపిన పడుచు వారు రాహాబు ఇంికిబోయి ఆమెను, ఆమె తల్లి దండ్రులను సహోదరులను, ఆమెకు సంబంధించిన వారిని అందరను వెలుపలికికొనివచ్చిరి. వారు ఆమె బంధువులను అందరను బయికి తీసికొని వచ్చి సురక్షితముగా యిస్రాయేలీయుల శిబిరమునకు చేర్చిరి.

24. వారు పట్టణమును, పట్టణములోని సమస్తమును తగులబ్టెిరి. వెండిబంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రములను మాత్రము యావే మందిరమందలి ధనాగారమునకు చేర్చిరి.

25. కాని రాహాబు అను వేశ్యను, ఆమె తండ్రి కుటుంబము వారిని, ఆమె బంధువులనందరను యెహోషువ రక్షించెను. యెరికోలో వేగు నెరపుటకు యెహోషువ పంపిన వేగులవారిని ఇద్దరను దాచి కాపాడుటచేత రాహాబు నేివరకు యిస్రాయేలీయుల నడుమ బ్రతుకు చున్నది.

యెరికో పునర్నిర్మాతను శపించుట

26. అప్పుడు యెహోషువ

               ”యెరికో పట్టణమును మరల క్టించువాడు యావే శాపమునకు గురియగునుగాక!

               ఎవడైన దానికి మరల పునాదులు వేసినచో

               వాని పెద్దకొడుకు మరణించునుగాక!

               ద్వారములెత్తినచో

               వాని చిన్నకొడుకు గతించునుగాక!”

అని ప్రజలచే యావే ముందు ప్రమాణము చేయించెను.

27. యావే ఇట్లు యెహోషువకు తోడైయుండుట చేత అతని కీర్తి దేశమంతట వ్యాపించెను.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము