మోవాబుతో యుద్ధము

3 1. యూదా రాజ్యమున యెహోషాఫాత్తు పరిపాలన కాలములో పదునెనిమిదవ యేట, యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము రాజై సమరియా నగరము నుండి పండ్రెండేండ్లు పరిపాలించెను.

2. ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అయినను ఈ రాజు తన తల్లిదండ్రులంత దుర్మార్గుడు కాడు. అతడు బాలు పూజకొరకు తన తండ్రి నిర్మించిన స్తంభమును పడగ్టొించెను.

3. అయినను పూర్వము నెబాతు కుమారుడు యరోబామువలె యెహోరామును ప్రజలను పాపమునకు పురికొల్పెను. తాను దుష్కార్య ములు చేయుట మానడయ్యెను.

యిస్రాయేలు, యూదాలు

మోవాబు మీదికి దండెత్తుట

4. మోవాబు రాజైన మేషా గొఱ్ఱెల పెంపక దారుడై విస్తారమైన మందలుకలిగి, ఏటేా లక్ష గొఱ్ఱెపిల్లలను, లక్షపొట్టేళ్ళ ఉన్నిని యిస్రాయేలు రాజునకు కప్పముగా సమర్పించెడివాడు.

5. కాని అహాబు చనిపోగానే మోవాబురాజు యిస్రాయేలు రాజునకు ఎదురు తిరిగెను.

6. వెంటనే యెహోరాము సమరియా నుండి తన సైన్యములన్నిని సమావేశపరచెను.

7. అతడు యూదా రాజగు యెహోషాఫాత్తు వద్దకు దూతలనంపి ”మోవాబు నాకు ఎదురు తిరిగినాడు. నేను అతని మీదికి దాడిచేసినచో నీవు నాకు తోడ్పడెదవా?” అని అడిగించెను.

8. యూదా రాజు ”తప్పక తోడ్పడుదును. నేను నీవాడినే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే. నా సైన్యములు, గుఱ్ఱములు, మీ బలములతో కలిసిపోరాడును. కాని మనము ఏ మార్గమున యుద్ధమునకు పోవలెనో తెలుపుము” అని ప్రత్యుత్తరము పంపెను. ”ఎదోము ఎడారిగుండ పోవుదము” అని యిస్రాయేలు రాజు మరల జవాబు పంపెను.

9. ఆ రీతిగా యిస్రాయేలు, యూదా, ఎదోము రాజులు యుద్ధమునకు వెడలిరి. ఏడుదినములు ప్రయాణముచేసిన పిదప వారి సైన్యమునందలి యోధులకును, పశువులకును నీరు కొరతపడెను.

10. యెహోరాము రాజు ”హా! చెడితిమికదా! యావే మన ముగ్గురిని శత్రువులచేతికి అప్పగించుటకే పిలిచె నేమో!” అనెను.

11. కాని యెహోషాఫాత్తురాజు ”యావేను సంప్రదించుటకు ఇచట ప్రవక్త ఎవడును దొరకడా?” అని అడిగెను. యెహోరాము సైనికోద్యోగి ఒకడు ”షాఫాత్తు కుమారుడు ఎలీషా ఉన్నాడు. పూర్వము అతడు ఏలీయాకు పరిచారకుడుగా ఉండెడి వాడు” అని చెప్పెను.

12. యెహోషాఫాత్తు ”ఇకనేమి, అతడు ప్రభువు సందేశమును విన్పింపగలడు” అనెను. కనుక ఆ ముగ్గురు రాజులు ఎలీషావద్దకు వెళ్ళిరి.

13. కాని ఎలీషా యిస్రాయేలు రాజుతో ”నేను నీకెందుకు తోడ్పడవలయును? నీవు వెళ్ళి మునుపు మీ తల్లిదండ్రులు సంప్రదించిన ప్రవక్తలనే సంప్ర తింపుము” అనెను. యిస్రాయేలు రాజు యెహోరాము ”అయ్యా! నీవు ఇట్లనవలదు. ప్రభువు మమ్ము ముగ్గురిని మోవాబురాజు చేతికి అప్పగించినాడు” అని పలికెను.

14. ఎలీషా ”సైన్యాములకధిపతియగు యావే సాన్ని ధ్యమున నేను నిలబడియున్నాను. ఆయన జీవము తోడు! యూదారాజైన ఈ యెహోషాఫాత్తు మొగము చూచి నీ మాటలు ఆలింపవలసి వచ్చినదికాని లేకున్న నిన్ను కన్నెత్తియైన చూచిఉండను.

15. సరియే! ఇప్పుడొక సంగీతకారుని నా యొద్దకుకొనిరండు” అనెను. ఆ పాటగాడు వాద్యమును వాయింపగా ఎలీషా యావేబలమును పొంది.

16.”వినుడు! దైవ సందేశమిది. ఈ లోయనిండ గోతులు త్రవ్వుడు.

17. గాలిగాని, వానగాని లేకున్నను లోయ నీితోనిండును. మీరును, మీ సైనికులును, మీ జంతువులును తృప్తిగా నీళ్ళు త్రాగవచ్చును.

18. ఇంకను వినుడు. త్రాగుటకు నీినిచ్చుట ప్రభువునకు తేలికైనపని. పైగా అతడు మోవాబీయులనుగూడ మీ చేతికి అప్పగించును.

19. మీరు ముఖ్యమైన మోవాబీయుల సురక్షితపట్టణము లన్నిని జయింతురు. వారి పండ్లచెట్లనన్నిని నరుకుదురు. నీిబుగ్గలను అన్నిని పూడ్చివేయు దురు.  సారవంతమైన పంటపొలములన్నిని రాళ్ళు రప్పలు పడవేసి పాడుచేయుదురు” అని పలికెను.

20. మరునాి ఉదయకాలబలి నర్పించు సమయ మునకు ఎదోమువైపునుండి నీరు పొరలివచ్చి ఆ ప్రదేశమునంతిని క్రమ్మివేసెను.

21. ముగ్గురు రాజులు తమను ఎదిరింపవచ్చిరని విని మోవాబీయులు పిల్లలనక, పెద్దలనక ఆయుధ ములు చేపట్టగలవారందరు ప్రోగైవచ్చి తమ పొలిమేర మీద గుమికూడిరి.

22. వారు మరునాిప్రొద్దుట నిద్దురలేచి చూడగా ఉదయించు సూర్యునికిరణములు సోకి ఆవలినీరంతయు నెత్తురువలె ఎఱ్ఱగా కన్పించెను.

23. అప్పుడు మోవాబీయులు ”అది నెత్తురుసుమా! ముగ్గురురాజులు తమలో తాము పోరాడుకొని చచ్చి యుందురు. మనమువెళ్ళి వారి శిబిరమును దోచు కొందము” అనుకొనిరి.

24. కాని మోవాబీయులు శిబిరముచెంతకు రాగానే యిస్రాయేలీయులు వారిని తరిమిక్టొిరి. వారిని వెన్నాడి చిక్కినవారిని చిక్కినట్లు ఖండఖండములుగా తునియలు చేసిరి.

25. వారి పట్టణములను నాశనము చేసిరి. యిస్రాయేలు సైన్య మున ప్రతివాడు మోవాబీయుల పంటపొలముల మీద రాళ్ళుపడవేసెను. ఇంకను వారి నీిబుగ్గలను పూడ్చివేసి, పండ్లచెట్లను నరికివేసిరి. కడకు వారి రాజధాని కీర్‌హరేసెతు మిగులగా ఒడిసెల విసరు యిస్రాయేలు సైనికులు దానినికూడ ముట్టడించిరి.       

26. మోవాబు రాజు తనకు ఓమి కలుగనున్నదని గ్రహించి ఏడువందలమంది ఖడ్గధారులను వెంట నిడుకొని శత్రుసైన్యముగుండ సిరియారాజు నొద్దకు పారిపోజూచెను. కాని అది అతని వలన కాకపోయెను.

27. అంతట అతడు యువరాజగు తన జ్యేష్ఠ కుమా రుని నగరప్రాకారముమీద దహనబలిగా సమర్పించెను. యిస్రాయేలీయుల మీదికి కోపము ప్రేరేపితముకాగా, నగరమును ముట్టడించుటకు వెరచి, తమ దేశము నకు మరలివచ్చిరి.