సీమోను ప్రధానయాజకుడు నాయకుడు అగుట(క్రీ.పూ. 142-134)

13 1. త్రూఫోను పెద్ద సైన్యమును ప్రోగు జేసికొని యూదయా మీదికి దాడి చేసి ఆ దేశమును నాశనము చేయనెంచెనని సీమోను గ్రహించెను.

2. ఆ దోపిడిని గూర్చి విని యూదులెల్లరును గడగడ వణకుచున్నారని గూడ తెలిసికొనెను. కనుక అతడు యెరూషలేమునకు వెళ్ళి  అచట  ప్రజలను సమావేశ పరచెను.

3. అతడు ప్రజలను ప్రోత్సహించుచు ”మా కుటుంబమువారు, మా అన్నలు, నేను ధర్మశాస్త్రమును, దేవాలయమును కాపాడుటకు ఎన్ని పనులు చేసితిమో మీరెరుగుదురు. మేమెన్ని యుద్ధములు చేసితిమో, ఎన్ని శ్రమలకు గురైతిమో మీకు తెలియును.

4. నా సోదరులందరును యిస్రాయేలీయుల కొరకు ప్రాణ ములర్పించిరి. ఇప్పుడు నేనొక్కడినే మిగిలియున్నాను.

5. ఇి్ట ఆపత్కాలమున నేను నా ప్రాణములను సురక్షి తముగా కాపాడుకోదలచుకోలేదు. నేను నా సోదరుల కంటె విలువైన వాడనుకాను.

6. ఇప్పుడు అన్యజాతి వారెల్లరును మనపైగల ద్వేషముచే మనలను నాశ నము చేయనున్నారు. కాని నేను మన జాతిని, మన దేవళమును, మీ భార్యాపుత్రులను కాపాడుటకు పోరాడి తీరుదును” అని అనెను.

7. ఆ మాట విని ప్రజలు ఉత్సాహము తెచ్చుకొనిరి.

8. వారు గొంతెత్తి ”నీ సోదరులైన యూదా, యోనాతానులకు బదులుగా నీవు మాకు నాయకుడవు కమ్ము.

9. నీవు మన యుద్ధ ములు నడుపుము, మేమెల్లరము నీవు చెప్పినట్లు చేయుదుము” అని అనిరి.

10. కనుక సీమోను యూద సైనికులనెల్ల ప్రోగుచేసెను. యెరూషలేము గోడలను, నగరము చుట్టుపట్లగల గోడలను త్వరిత గతిని క్టించెను.

11. అతడు అబ్షాలోము కుమా రుడగు యోనాతాను నాయకత్వము క్రింద యొప్పాకు పెద్ద సైన్యమును పంపెను. వారచి ప్రజలను వెళ్ళ గ్టొి ఆ నగరమును స్వాధీనము చేసికొనిరి.

సీమోను త్రూఫోనును యూదయా నుండి వెళ్ళగొట్టుట

12. త్రూఫోను యూదయాను ముట్టడించుటకు పెద్దదండుతో బయలుదేరెను. అతడు సీమోను సోద రుడు యోనాతానునుగూడ బంధించి తనవెంట తీసి కొనివచ్చెను.

13. సీమోను మైదానపుటంచున ఉన్న అదిదావద్ద దండుదిగెను.

14. తన సోదరుడగు యోనాతానునకు బదులుగా సీమోను నాయకుడయ్యె నని, అతడిపుడు తనతో యుద్ధము చేయనున్నాడనియు త్రూఫోను తెలిసికొనెను. కనుక అతడు సీమోనునకు ఈ క్రింది సందేశముపంపెను: 15. ”నీ సోదరుడు యోనాతాను పదవిలో ఉన్నపుడు రాజు కోశాగార మునకు చెల్లింపవలసిన సొమ్ము చెల్లింపడయ్యెను. కావుననే నేను అతనిని బంధించి ఉంచితిని.

16. నీవు మాకిపుడు వందయెత్తుల వెండిని చెల్లింపుము. యోనాతాను కుమారులనిద్దరిని బందీలుగా మా యొద్దకు పంపుము. యోనాతాను విడుదల పొందిన తరువాత మా మీద తిరుగబడడని హామీగూడ యిమ్ము. అప్పుడు నేను నీ సోదరుని విడిపింతును.”

17. త్రూఫోను వంచనతో అి్ట సందేశము పంపెనని సీమోనునకు తెలియును. అయినను అతడు వెండిని యోనాతాను పుత్రులను పంపించెను. అట్లు పంప కున్న యూదులతో మాటవచ్చునేమోయని సీమోను వెరచెను.

18. తాను వెండిని, బాలకులను పంపలేదు కనుక, యోనాతాను మృత్యువాతబడెనని ప్రజలు తన్ను నిందింతురేమోయని అతడు భయపడెను.

19. కనుక అతడు త్రూఫోను కోరినట్లే చేసెను. అయినను త్రూఫోను తాను మాటయిచ్చినట్లు యోనాతానును విడుదల చేయడయ్యెను.

20. అటుపిమ్మట త్రూఫోను అదోరా మార్గము గుండ తిరిగివచ్చి యూదయామీద దాడి చేసి ఆ దేశ మును నాశనము చేయదొడగెను. కాని సీమోను సైన్య మును వెంటబెట్టుకొని శత్రువు వెనువెంటపోయి ప్రతి స్థలమునను అతనిని ఎదిరింపదొడగెను.

21. యెరూషలేము కోటలోని శత్రుసైనికులు ఆహారపదార్థ ములను తీసికొని శీఘ్రముగా ఎడారి మార్గమున తమ చెంతకు రావలసినదని త్రూఫోనునకు వార్తలు పంపు చుండిరి.

22. త్రూఫోను ఆ కోటనెట్లయిన చేరుకో వలెనని తన అశ్వికబలమునంతిని ప్రోగుచేసి కొనెను. కాని ఆ రేయి దట్టముగా మంచుపడుటచే అతడు యెరూషలేమునకు పోజాలడయ్యెను. అతడు గుడారములెత్తి గిలాదునకు వెళ్ళెను.

23. త్రూఫోను బస్కామాచెంత యోనాతానుని చంపించి పాతిప్టిెంచెను.

24. అచినుండి అతడు తన దేశమునకు వెళ్ళి పోయెను.

యోనాతానును మోదెయీను ఖననము చేయుట

25. సీమోను తన మనుష్యులను పంపి యోనాతాను అస్థికలను తెప్పించి వానిని తన పితరుల నగరమైన మోదెయీనున ఖననము చేయించెను.

26. యోనాతాను గతించినందుకు యిస్రాయేలీయులందరు మిగుల దుఃఖించిరి. వారు చాలనాళ్ళవరకు అతని కొరకు శోకించిరి.

27. సీమోను తన తండ్రి, సోదరుల సమాధులపై ఎత్తయిన గోరీని క్టించెను. అది దూరమునుండి చూచినను కనిపించును. దాని ముందు వెనుకలందు చెక్కినరాళ్ళు అమర్చిరి.

28. అతడు తన తల్లిదండ్రులకును, నల్గురు సోదరులకును కలిపి ఏడు స్తూపములను ఒకదాని ప్రక్కనొకి నిల్చి యుండు నట్లుగా నిర్మించెను.

29. ఆ స్తూపములచెంత పొడవైన స్తంభములను క్టించెను. వానిమీద ఆయుధముల బొమ్మలను ఓడల బొమ్మలను చెక్కించెను. అది ఆ వీరుల జ్ఞాపకార్థము క్టించిన స్మారకభవనము. అది సముద్రయానము చేయువారికిని కనిపించును.

30. మోదెయీనులో సీమోను క్టించిన ఆ గోరీ నేికిని నిలిచియున్నది.

రెండవ దెమేత్రియసు సీమోనును ఆదరించుట

31-32. త్రూఫోను కుట్రతో బాలుడు ఆరవ అంియోకసు రాజును వధించి అతని రాజ్యమగు సిరియాదేశమును ఆక్రమించుకొనెను. అతడు ఆ దేశ మును కడగండ్లపాలు చేసెను.

33. సీమోను యూదయా దేశములో కోటలను పునర్నిర్మాణముచేసి వానికెత్త యిన బురుజులు,  బలమైన ప్రాకారములు, గడియ లతో కూడిన ద్వారములు క్టించెను. వానిలో భోజన పదార్థములు నిల్వజేయించెను.

34. అతడు త్రూఫోను అంతకుముందే తన దేశమును దోచుకొనెను. కనుక అతడు తన ప్రజలకు పన్నులు రద్దు చేయింపుమని వేడుకొనుచు రెండవ దెమేత్రియసురాజువద్దకు దూతల నంపెను.

35. రాజతడికి అనుకూలముగ ఈ క్రింది రీతిగా జవాబు పంపెను:

36. ”ప్రధానయాజకుడును, రాజమిత్రుడనైన సీమోనునకును యూదులకును, వారి నాయకులకును శుభములు పలికి, దెమేత్రియసు వ్రాయునది.

37. నీవు నాకు పంపిన బంగారు కిరీటమును బంగారు ఖర్జూరపత్రమును స్వీకరించితిని. నేను మీతో సంధిచేసికొందును. మీ పన్నులను రద్దుచేయవలసి నదిగా మా అధికారికి వ్రాయుదును.

38. నీవు పూర్వము మాతో చేసికొనిన నియమములన్నియు అమలులో నుండును. నీవు నిర్మించిన కోటలమీద నీవే  అధి కారము నెరపవచ్చును.

39. మీరు పూర్వము మాతో చేసికొనిన సంధికి విరుద్ధముగా చేసిన కార్యము లన్నియు నేను క్షమింతును. మీరు మాకు కట్టవలసిన కప్పములను, యెరూషలేమున మీరు చెల్లించెడి ఇతర ములైన పన్నులను చెల్లింపనక్కరలేదు. 40. అర్హులైన యూదులెవరైనను రాజసైన్యమున చేరవచ్చును. మీకు మాకు ఇకమీదట రాజీకుదురునుగాక!”

41. గ్రీకుశకం నూటడెబ్బదివయేట (అనగా క్రీ.పూ. 142లో) యిస్రాయేలీయులమీద అన్యజాతి వారి పాలన ముగిసెను.

42. యూదులు తమ దస్తా వేజులన్నిటను ”యూదుల నాయకుడును, మహాసైన్యాధి పతియును, ప్రధానయాజకుడు సీమోను పరిపాలన కాలము మొదియేడు” అని వ్రాయదొడగిరి.

సీమోను గేసేరును ఆక్రమించుకొనుట

43. అంతట సీమోను గేసేరును ముట్టడించెను. అతడి సైన్యములు దానిని చుట్టుముట్టెను. అతడు గోడ లను పడగొట్టు మంచెను నిర్మించి,దానిని నగర ప్రాకా రమునొద్దకు త్రోయించుకొనివచ్చెను. దాని సహాయ ముతో ఒక బురుజును పగులగ్టొి నగరమును స్వాధీ నము చేసికొనెను.

44. ఆ మంచె మీదనున్న యూదులు గేసేరు నగరములోనికి దూకగా అందలి పౌరులు కలవ రపడిరి.

45. పురజనులు, వారి భార్యలు, పిల్లలు నగర ప్రాకారముల మీదికెక్కి విచారముతో బట్టలు చించు కొనిరి. వారు పెద్దగా అరచుచు సీమోనును తమతో రాజీకుదుర్చుకొమ్మని బ్రతిమాలిరి.

46. ‘మా నేర ములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము, మమ్ము కరుణింపుము’ అని వేడుకొనిరి.

47. సీమోను వారితో రాజీ కుదుర్చుకొని యుద్ధమును మాన్పించెను. కాని అతడు పౌరులను ఆ నగరమునుండి వెళ్ళగ్టొించెను. విగ్రహములున్న ఇండ్లను శుద్ధిచేయించెను. అటు పిమ్మట అతడును అతడి సైనికులును స్తుతికీర్తనలతో నగరమును ప్రవేశించిరి.

48. అతడు పట్టణమును మైలపరచువానినన్నిని అచటనుండి తొలగించెను. మోషే ధర్మశాస్త్రమును పాించువారికి దానిలో వసతి కల్పించెను. నగరమును సురక్షితము చేయించి దానిలో తనకును ఒక భవనము నిర్మించుకొనెను.

యెరూషలేము దుర్గమును స్వాధీనము చేసికొనుట

49. యెరూషలేము దుర్గమున వసించువారు వేనినైన అమ్ముటకుగాని, కొనుటకుగాని వెలుపలికి పోజాలరైరి. కనుక వారు ఆకలివలన బాధపడజొచ్చిరి. కొందరు ఆకిబాధకు చచ్చిరి.

50. వారు సీమోనును తమతో రాజీ కుదుర్చుకొమ్మని వేడుకొనగా అతడు వారితో రాజీపడెను. కాని అతడు ఆ సైనికులను కోట నుండి వెళ్ళగ్టొించి దానిని శుద్ధిచేయించెను.

51. గ్రీకు శకము నూటడెబ్బదిఒకటవయేట (అనగా క్రీ.పూ. 141లో) రెండవనెల ఇరువదిమూడవ తారీఖున నగరమున గొప్పఉత్సవము జరిగెను. యిస్రాయేలీ యులను బాధించు శత్రువులను వెళ్ళగ్టొిరి గనుక ఆ పండుగ చేసికొనిరి. సీమోను అతని అనుచరులు స్తుతిగీతములు పాడుచు, ఖర్జూరపు మండలను చేబూని తంత్రీ వాద్యములు చితాళములు మ్రోయించుచు కోటలో ప్రవేశించిరి. సీమోను ఆ ఉత్సవమును ఏటేట జరుపవలెనని  ఆజ్ఞాపించెను.

52. అతడు కోటప్రక్క నున్న దేవాలయ ప్రాకారములను బలపరచెను. తానును తన అనుచరులు కోటలో వసింపమొదలిడిరి.

53. అప్పికే సీమోను కుమారుడగు యోహానునకు యుక్త వయస్సు వచ్చియుండెను. కనుక సీమోను అతడిని సర్వసైన్యములకు అధిపతిని చేసెను. గేసేరు కోటలో అతనికి నివాసము కల్పించెను.