సమూవేలు మరణము

25 1. సమూవేలు చనిపోయెను. యిస్రాయేలీయు లందరు ప్రోగై అతని మరణమునకు శోకించిరి. రామాలో అతని ఇంిలో అతని శవమును పాతి ప్టిెరి. అటుపిమ్మట దావీదు పారాను ఎడారికి వెడలి పోయెను.

నాబాలు – అబీగాయీలు

2. మావోను సీమకు చెందిన కర్మెలునందు సంపన్నుడైన నరుడొకడు వసించుచుండెను. అతనికి మూడువేల గొఱ్ఱెలు, వేయిమేకలు కలవు. ఒకసారి అతడు కర్మెలు పట్టణమునందు గొఱ్ఱెలకు ఉన్ని కత్తి రించుచుండెను.

3. అతడు కాలెబు వంశీయుడు. పేరు నాబాలు. అతని భార్యపేరు అబీగాయీలు. ఆమె తెలివితేటలుకలది, అందగత్తె. అతడు వ్టి మోటు వాడు, దుష్టుడు.

4. ఎడారియందు వసించుచున్న దావీదు, నాబాలు తనగొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించుచుండెనని వినెను.

5. అతడు తన అనుచరులను పదిమందిని నాబాలు వద్దకు పంపుచు ”మీరు కర్మెలు పట్టణమునకు పోయి నాబాలును దర్శించి నా పేర నమస్కారము చేయుడు.

6. అతనితో ఇట్లనుడు: నీకును, నీ బలగమునకును, నీ ఆస్తిపాస్తులకును శుభములు కలుగునుగాక!

7. నీవు గొఱ్ఱెలకు ఉన్ని కత్తిరించు చున్నావని వింని. ఇంతవరకు నీ కాపరులు మా చెంతనే మసలుచుండినను మేము వారిని బాధింప లేదు. వారు కర్మెలులోనున్నంతకాలము మందలనుండి ఒక్క జంతువును మాయము కాలేదు.

8. ఈ మాట నిజమోకాదో నీ జనముననే అడిగి తెలిసికోవచ్చును. నా సేవకులను చల్లనిచూపు చూడుము. నేడు శుభ దినమున మేము వచ్చితిమికదా! కనుక నీ సేవకులకును, నీ కుమారుడు దావీదునకును నీ యిచ్ఛనుబ్టి ఇచ్చి పంపుము”.

9-10. దావీదు సేవకులు నాబాలు వద్దకు వచ్చి తమ నాయకుని పలుకులు విన్నవింపగనే అతడు ”దావీదనిన ఎవరికి గొప్ప? యిషాయి కుమారుడనిన ఎవరికి లావు? ఈ రోజులలో యజమానుల వద్ద నుండి పారిపోయిన సేవకులు చాలమంది కనిపించు చున్నారు.

11. నా రొట్టెలను, ద్రాక్షసారాయమును, నా పనివారికొరకు కోసిఉంచిన వేటమాంసమును తీసికొని ఊరుపేరు తెలియని ఈ దేశదిమ్మరులకు ఈయవలయును కాబోలు!” అనెను.

12. సేవకులు తిరిగిపోయి నాబాలు అనిన మాటలు తమ నాయకుడు దావీదునకు చెప్పిరి.

13. దావీదు ఎల్లరిని కత్తి చేపట్టు డని ఆజ్ఞాపించెను. పరిజనులందరు వారివారి కత్తు లను గైకొనిరి. దావీదు కూడ తన కత్తి పుచ్చుకొనెను. వారిలో రెండువందలమంది సామానులకు కావలి కాయుటకై అచ్చటనే ఉండిపోయిరి. నాలుగు వందల మంది దావీదును అనుసరించి వెళ్ళిరి.

14. అప్పుడు నాబాలు సేవకులలో ఒకడు అతని భార్యయైన అబీగాయీలుతో ”అమ్మా! దావీదు ఎడారి నుండి మన యజమాని వద్దకు దూతలనంపెను. కాని ఆయన వారిమీద మండిపడెను.

15. ఈ జనులు చాల మంచివారు. మనలనెప్పుడు పీడించి యెరుగరు. మేము వారిదగ్గరి పొలములో మందలను మేపినంత కాలము ఒక్కజంతువుకూడ  మాయమైపోలేదు.

16. అక్కడ మందలు తిరుగాడినంతకాలము రేయింబవలు వారే మాకు అండదండగానుండిరి.

17. కనుక ఇప్పుడు చేయవలసినపని ఏదియో లెస్సగా విచా రింపుము. దావీదు సేవకులు మన యజమానునకు, మన పరివారమునకు నిక్కముగా కీడుచేయ నిశ్చ యించియున్నారు. యజమానుడు వ్టి పనికిమాలిన వాడు. అతనితో మ్లాడినను లాభములేదు” అని పలికెను.

18. అబీగాయీలు త్వరత్వరగా రెండు వందల రొట్టెలను, రెండుతిత్తుల ద్రాక్షసారాయమును, ఐదు వేటలను కోసివండిన మాంసమును, ఐదుకుంచములు వేపుడు ధాన్యమును, నూరుగుత్తులు ఎండు ద్రాక్ష పండ్లను, రెండువందల అత్తిపండ్ల మోదకములను సిద్ధముచేసి గాడిదలపై వేయించెను.

19. ఆమె సేవకులను పిలిచి ”మీరు వీనితో ముందుసాగిపొండు, నేను మీ వెనుకవత్తును” అని చెప్పెను. కాని నాబాలునకు ఈ సంగతేమియును తెలియదు.

20. అబీగాయీలు గాడిదనెక్కి కొండమలుపునకు వచ్చెను. అంతలోనే దావీదు పరివారముతో వచ్చుచు ఆమెకు ఎదురుపడెను.

21. అతడు తనలోతాను ”ఇంతకాలము ఎడారిలో నాబాలు మందలను కాపా డుట గొడ్డువోయినదికదా! వీని గొఱ్ఱెలకు నష్టమే మియు కలుగలేదు. ఈ ఉపకారమునకు బదులుగా వీడు అపకారము చేసెనుగదా!

22. కానిమ్ము ప్రొద్దు పొడుచునప్పికి వాని పరివారము నందలి మగవాండ్ర నందరిని మట్టుపెట్టనేని దేవుడు ఇంకను గొప్పఆపదను దావీదు శత్రువులకు కలుగజేయునుగాక!” అని అనుకొనుచుండెను.

23. అబీగాయీలు దావీదును చూడగనే వడి వడిగా గాడిదనుదిగి దావీదునకు సాష్టాంగనమస్కా రము చేసెను. 24. ఆమె దావీదు కాళ్ళమీదపడి ”ప్రభూ! ఈ అపరాధమునాది. ఈ దాసురాలికి మ్లా డుటకు సెలవిమ్ము. ప్రభువు నాపలుకులు వినిపించు కొనినచాలు.

25. ఏలినవారు పనికిమాలిన ఈ నాబాలును ప్టించుకోనేల? అతని నడవడిగూడ ఆ పేరునకు తగినట్లే ఉన్నది. అతని పేరు నాబాలు12. కనుకనే ఆ మొరటుతనము. నా మట్టుకు నేను నీవు పంపించిన సేవకులను చూడలేదుసుమా!

26. రక్త పాతమునుండి, స్వయముగ శత్రువు మీదపడి పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి ప్రభువు నిన్ను కాపాడుగాక! యావే జీవము తోడు! నీ జీవము తోడు! నీ శత్రువులకు, నీకును కీడు తలప్టిెన దుర్మార్గులకు, ఈ నాబాలుకు ప్టినగతియే పట్టునుగాక!

27. ఇవిగో! నీ దాసురాలు కొనివచ్చిన బహుమానములు! వీనిని నా యేలినవాడవగు నీ వెంటవచ్చిన పరివార మునకు ఇమ్ము.

28. ప్రభువు ఈ దాసురాలి అపరాధ మును క్షమించునుగాక! నీవు యావేపక్షమున యుద్ధ ములు చేయుచున్నావు కనుక, యావే నీ వంశమును కలకాలము కుదురుకొనునట్లు చేయును. బ్రతికి ఉన్నంతకాలము నీకు ఏ ఆపదవాిల్లదు.

29. ఎవ్వడైనను నిన్ను వెంటపడి నీ ప్రాణములు తీయనెంచిన యెడల నీ దేవుడైన యావే నీ ప్రాణములను జీవపు మూటలో చ్టుిప్టిె సురక్షితముగా తనచెంత నుంచు కొనును. కాని నీ శత్రువుల ప్రాణమును ఒడిసెలనుండి రాతిని విసరినట్టుగా దూరముగా విసరివేయును.

30-31. ప్రభువు నీకు వాగ్ధానము చేసిన సత్కార్యము లన్నిని నెరవేర్చినపిమ్మట, నిన్ను యిస్రాయేలీయు లకు రాజుగా నియమించిన పిమ్మట నేడు శత్రువులపై పగతీర్చుకొని నిష్కారణముగా నెత్తురొలికించిన పాపము నీ హృదయమును బాధించి వేధింపకుండును గాక! ప్రభువు నిన్ను చల్లనిచూపున చూచిన పిమ్మట ఈ దాసురాలిని జ్ఞప్తికి తెచ్చుకొనుము” అని పలికెను.

32. దావీదు అబీగాయీలుతో ”నేడు నిన్ను నా వద్దకు పంపిన యిస్రాయేలు దేవుడు యావే స్తుతింప బడునుగాక!

33. నీ తెలివితేటలు కొనియాడదగినవి. రక్తపాతమునుండి, శత్రువులపై పగతీర్చుకొనుట అను దుష్కార్యము నుండి నేడు నన్ను కాపాడితివి కనుక నీవు ధన్యురాలవు.

34. యిస్రాయేలు దేవుడైన యావే మీద ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను వినుము. నీకు కీడు చేయనీయకుండ ప్రభువే నాకు అడ్డుపడెను. నీవు శీఘ్రమేవచ్చి నన్నిట కలసికోనియెడల, రేపు ప్రొద్దు పొడుచునప్పికి నాబాలు పరివారమున ఒక్క మగ పురుగుకూడ బ్రతికియుండెడివాడుకాడు సుమా!” అనెను.

35. అంతట దావీదు ఆమె కానుకలను గైకొని ”ఇక ఏ దిగులులేకుండ నీ ఇంికి మరలిపొమ్ము. నీ మొగముచూచి నీమాట పాించితిని” అనెను.

36. అబీగాయీలు పతి యొద్దకు తిరిగిపోయెను. ఇంివద్ద నాబాలు రాజవైభవముతో ఉత్సవముచేసి విందు నడపుచుండెను. అతడు హాయిగాత్రాగి మైమరచి యుండుటచే మరునాి ప్రొద్దుివరకు ఆ ఇల్లాలు జరిగిన సుద్దులేమియు ఎత్తలేదు.

37. ఉదయము సారాయపుకైపు తగ్గగనే అబీగాయీలు జరిగినదంతయు పెనిమికి తెలియజేసెను. ఆ మాటలకు నాబాలు నిశ్చేష్టుడయ్యెను. అతనికి గుండెపగిలెను. కదలికలేని రాతిబొమ్మవలె బిగుసుకుపోయెను. 38. పది దినములు గడచిన తరువాత యావే నాబాలును శిక్షింపగా అతడు ప్రాణములు విడిచెను.

39. దావీదు నాబాలు చావు కబురువిని ”నన్ను అవమానపరచినందులకు నాబాలునకు ఈ రీతిగా ప్రతీకారము చేసిన యావే స్తుతింపబడునుగాక! కీడు చేయనీయకుండ ప్రభువు నన్ను వారించెను. నాబాలు పాపము నాబాలునకే తగులునట్లు దేవుడుచేసెను” అనెను.

40. అంతట దావీదు అబీగాయీలును పెండ్లి చేసికొనుటకై దూతలద్వారా వర్తమానమంపెను. వారు కర్మెలు నందున్న అబీగాయీలు వద్దకు వచ్చి ”దావీదును పరిణయమాడుటకై నిన్నుతోడ్కొని పోవచ్చితిమి” అని విన్నవించిరి.

41. ఆమె వినయముతో లేచి నేలమీద సాగిలపడి ”ఈ సేవకురాలు నా ప్రభువు పరిచారకుల పాదములు కడుగుటకుగూడ సిద్ధముగానే యున్నది” అనెను.

42. అంతట ఆమె వేగముగ పయనమై ఐదుగురు దాసీకన్యలను వెంటనిడుకొని గాడిదపైనెక్కి దావీదు సేవకుల వెంటబోయెను. దావీదు ఆమెను పెండ్లియాడెను.

43. అంతకుముందే అతడు యెస్రెయేలు నగరవాసియైన అహీనోవమును గూడ పెండ్లిచేసుకొనియుండెను. ఆ ఇరువురు అతని భార్యలైరి.

44. ఇంతకుముందు సౌలు తన కుమార్తె యగు మీకాలును దావీదునకు అప్పగించెనుగదా! అతడు కుమార్తెను మరల గల్లీము నగరవాసియైన లాయీషు కుమారుడు ఫల్తీయేలునకిచ్చి పెండ్లిచేసెను.

Previous                                                                                                                                                                                               Next