మృతపూజ తగదు
14 1. మీరు ప్రభువైన యావేకు తనయులు. కనుక మీరు మృతులను స్మరించుకొని, మీ శరీరము లను కోసికొనకుడు. నొసిమీద గొరిగించుకొనకుడు.
2. మీరు ప్రభువునకు నివేదితులైన ప్రజలు. ఈ నేలమీది జాతులలోనెల్ల మిమ్మే ఆయన తన సొంత ప్రజలుగా ఎన్నుకొనెను.
శుచికరమైన జంతువులు, అశుచికరమైన జంతువులు
3. మీరు అశుచికరమైన పశువులను తినరాదు.
4-5. ఎద్దు, గొఱ్ఱె, మేక, దుప్పి, జింక, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె వీనిని మీరు భుజింప వచ్చును.
6. చీలినగిట్టలు కలిగి నెమరువేయు జంతువును దేనినైనను మీరు తినవచ్చును.
7. చీలినగిట్టలున్నను, నెమరువేయునవి కావేని ఆ జంతువులను మీరు ఆరగింపరాదు. కనుక మీరు ఒంటెలు, కుందేళ్ళు, ప్టొికుందేళ్ళును ముట్టుకోరాదు. అవి నెమరువేయునుగాని వాని గిట్టలు చీలియుండవు. కావున అవి మీకు అశుచికరమైన జంతువులు.
8. పందికి గిట్టలు చీలియుండునుగాని అది నెమరు వేయదు. కనుక అది మీకు అశుచికరమైన జంతువు. మీరు అి్ట జంతువులను భుజింపకుడు, వాని మృత దేహములను కూడ ముట్టుకొనకుడు.
9. నీిజంతువులలో పొలుసులు, రెక్కలు గల వానినన్నిని మీరు భక్షింపవచ్చును.
10. పొలుసులు, రెక్కలు లేనివి భక్షణయోగ్యములు కావు. అవి మీకు అశుచికరములు.
11. శుచికరములైన పకక్షులను మీరు ఆరగింప వచ్చును.
12-18.1 కాని ఈ క్రింది జాతి పకక్షులను మీరు ఆరగింపరాదు: గరుత్మంతుడు, పెద్దబోరువ, క్రౌంచము, పిల్లి గ్రద్ద, రాబందు, నానావిధములైన కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, నానా విధములైన డేగలు, గుడ్లగూబలు, పైడికిం, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారసము, రకరకములైన కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలము.
19. ఎగిరెడు కీటకములన్నియు అశుచికరములు. కనుక మీరు వానిని ముట్టుకొనరాదు.
20. శుచి కరమైన కీటకములను మాత్రము మీరు తినవచ్చును.
21. చనిపోయిన జంతువును దేనిని మీరు భుజింపరాదు. మీ నగరములలో వసించు పరదేశులు దానిని తినవచ్చును. లేదా అన్యజాతి ప్రజలకు దానిని అమ్మివేయవచ్చును. మీరు ప్రభువునకు పరిశుద్ధ ప్రజలు.
మేకపిల్లను దాని తల్లిపాలలో కలిపి వండరాదు.
ప్రతి యేడాది థమభాగములు
22. ప్రతియేడు మీ పొలమున పండు పంటలో పదియవవంతు పన్నుక్రింద జమకట్టుడు.
23. మీరు ప్రభువు తన నామమును ప్రతిష్ఠింప ఎన్నుకొనిన ఏకైక ఆరాధనస్థలమునకు పొండు. అచట ప్రభువు సమక్ష మున మీ థమభాగములను, ధాన్యము, ద్రాక్షసారా యము, ఓలివుతైలము, మందలలోని తొలిచూలు పిల్లలను భక్షింపుడు. ఇట్లు చేయుదురేని మీరు ఎల్లవేళల మీప్రభువుపట్ల భయభక్తులతో మెలిగినట్లగును.
24. యావే తన నామమునకు నివాసస్థాన ముగా ఎన్నుకొనిన ఆరాధనస్థలము మిక్కిలి దూరముగా నున్నచో, దేవుని అనుగ్రహమువలన మీకు పండిన పంటనుండి మీరు థమభాగములను అంతదూరము మోసికొనిపోజాలనిచో, ఇట్లు చేయుడు.
25. ఆ ధాన్యమును అమ్మి, సొమ్మును ఆరాధన ప్రదేశమునకు తీసుకొనిపొండు.
26. ఆ డబ్బుతో మీ ఇష్టము వచ్చినవానిని అనగా కోడెలు, గొఱ్ఱెలు, ద్రాక్షసారాయము ఘాటయిన మద్యము మొదలయిన వానిని కొని తెచ్చు కొనుడు. వానినెల్ల మీ కుటుంబములతో దేవుని యెదుట భుజించిఆనందింపుడు.
27. మీతోపాటు మీ నగరములలో వసించు లేవీయులను మరచిపోవలదు. వారికి మీకున్నట్లుగా సొంత ఆస్తి ఏమియు లేదుకదా!
మూడవయేి థమభాగములు
28-29. ప్రతి మూడవయేి చివర మీకు పండిన పంటనుండి థమభాగములను కొనివచ్చి నగరమున భద్రపరపుడు. సొంత ఆస్తి ఏమియులేని లేవీయులు, మరియు మీ పట్టణములలో వసించు పరదేశులు, అనాథశిశువులు, విధవలు ఈ ధాన్యమును పంచుకొని ఆరగింతురు. ఇట్లు చేయుదురేని ప్రభువు మీ కష్టమును ఆశీర్వదించి, దీవించును.