మట్టి పాత్రలలో ఆధ్యాత్మిక నిధి

4 1. తన కృపవలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము.

2. రహస్యములును సిగ్గుపడదగిన పనులను విసర్జించితిమి. మోసముతో ప్రవర్తింపము. దేవుని వాక్కును అసత్యము చేయము. దేవుని దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింప వచ్చును.

3. ఒకవేళ, మేము బోధించు సువార్త ఎవరికైన కనుమరుగైనచో నశించువారికి మాత్రమే అది కనుమరుగైనది.

4. దేవుని స్వరూపియైవున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ లోకసంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డి తనము కలుగజేసెను.

5.ఏలయన, మేముబోధించునది మమ్ము గూర్చి కాదు. యేసుక్రీస్తు ప్రభువు అనియు, ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము.

6. ”చీకి నుండి వెలుగు ప్రసరించునుగాక!” అని పలికిన ఆ దేవుడే, మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవమహిమయొక్క జ్ఞానమను వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రస రింపజేసెను.

7. కాని ఈ ఆధ్యాత్మిక సంపదగల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టిపాత్రలవంటి వారమే. ఏలయన, ఈ మహత్తరశక్తి దేవునిదేకాని మాదికాదు.

8. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము. కాని, అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు.

9. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను, తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు.

10.యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము.

11. మా జీవితకాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడును ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరములయందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది.

12. మృత్యువు మాయందును, జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము.

13.  ”నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని” అని వ్రాసినవానియందున్న విశ్వాసపుటాత్మ మాయందును కలదు. కనుక మేముకూడా విశ్వసించుచున్నాము, మ్లాడుచున్నాము.

14. యేసు ప్రభువును మృతులలోనుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్ము లను లేవనెత్తి, మీతో సహా ఒక చోటచేర్చి, ఆయన సమక్షమునకు తీసికొనిపోగలడని మాకు తెలియును.

15. ఇది అంతయును మీ కొరకే. దైవసందేశము వ్యాపించిన కొలది, ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములను అర్పింతురు.

విశ్వాసముతో జీవించుట

16. ఇందువలననే మేము ఎన్నడును నిరుత్సాహపడము. మేము భౌతికముగ క్షీణించుచున్నను ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము.

17. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము, ఆ కష్టమునకంటె ఎంతయో అధికమైన నిత్యమహిమను మాకు సమకూర్చును.

18. గోచరములగు విషయములపై కాక, అగోచరములగు విషయములపై మాశ్రద్ధను కేంద్రీకరింతుము. గోచరములు కొలదికాలము మాత్రమే ఉండును. అగోచర ములు శాశ్వతములు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము