మనవి, కృతజ్ఞతాస్తుతి

 దావీదు కీర్తన

28 1.      నాకు రక్షణదుర్గమవైన ప్రభూ!

                              నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను.

                              నీవు మౌనము వహింపవలదు.

                              నీవు మౌనము వహింతువేని

                              నాకును మృతలోకమునకేగువారి

                              గతియే పట్టును.

2.           నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను.

               నీ సహాయమును అర్థించుచున్నాను.

               నీవు నా వేడుకోలును ఆలింపుము.

               నేను నీ పవిత్రమందిరమువైపు

               చేతులెత్తుచున్నాను.

3.           దుష్కార్యములుచేయు

               దుష్టులతోపాటు నన్ను గొనిపోకుము.

               వారు కుిలమనస్కులై

               శాంతికాముకులుగా నింతురు.

               వారు బయికి

               చెలిమి ఉి్టపడునట్లు మాటలాడుదురు.

4.           ప్రభూ! వారి చెయిదములకుగాను,

               వారు చేసిన దుష్కార్యములకుగాను,

               నీవు వారిని దండింపుము.

               వారు చేసిన చెడ్డపనులన్నింకిగాను

               వారికి ప్రతిఫలమిమ్ము.

5.           వారు ప్రభువు చేసిన కార్యములను గుర్తింపరైరి.

               ఆయనచేసిన సృష్టిని గమనింపరైరి.

               కనుక ప్రభువు వారిని నిర్మూలనము చేయును.

               ఆయన వారిని మరల వృద్ధిలోనికి తీసికొనిరాడు.

6.           ప్రభువు నా ప్రార్థన నాలించెను.

               ఆయనకు స్తుతి కలుగునుగాక!

7.            ప్రభువు నాకు బలము, నాకు డాలు.

               నేనతనిని నమ్మెదను.

               అతడు నన్నాదుకొనెను కనుక

               నేను సంతసింతును.

               అతనిని స్తుతించి కీర్తనలు పాడుదును.

8.           ప్రభువు తన ప్రజలకు బలమును దయచేయును. ఆయన తన అభిషిక్తుడికి రక్షణదుర్గమగును.

9.           ప్రభూ! నీ జనులను కాపాడుము.

               నీకు వారసులయిన ఈ ప్రజలను దీవింపుము.

               నీవు వీరికి కాపరివి కమ్ము.

               వీరిని సదా ఆదుకొమ్ము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము