6. గుడారపు పరికరములు, దాని నిర్మాణమ విశ్రాంతిదినము

1. మోషే యిస్రాయేలీయులందరిని ప్రోగుచేసి ”యావే మీకు ఆనతిచ్చినకట్టడలివి.

2. మీరు ఆరునాళ్ళు పనిచేసికోవచ్చును. కాని ఏడవనాడు పవిత్రదినము. అది ప్రభువునకు అంకితమయిన విశ్రాంతిదినము. ఆ దినమున ఎవ్వరైనను ఏదైనను పనిచేసినచో మరణమునకు పాత్రులగుదురు.

3. విశ్రాంతిదినమున ఇండ్లలో నిప్పుగూడ రగిలింపరాదు” అని చెప్పెను.

గుడారపు పరికరములను సేకరించుట

4. మోషే యిస్రాయేలు సమాజముతో ఇట్లనెను: ”ప్రభువుఆజ్ఞ ఇది.

5. మీరు ప్రభువునకు కానుకలు అర్పింపవలయును. ప్రతియొక్కడు హృదయపూర్వక ముగా కానుకలను సమర్పింపవలయును. అవి: బంగారము, వెండి, ఇత్తడి లోహములును, 6-9. ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నిని కొని రండు. ‘సన్నని నారబట్టలును, మేకవెంట్రుకలతో నేసినబట్టలును, ఎఱ్ఱని అద్దకము వేసిన పొట్టేలు చర్మములును, నాణ్యమైన గ్టితోళ్ళను, తుమ్మకఱ్ఱ, దీపతైలమును, అభిషేక సుగంధ తైలమును, సువాసనగల సాంబ్రాణిని తయారుచేయుటకు వలసిన సుగంధద్రవ్యములను, లేతపచ్చలను, ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు, వక్షఃఫలకమునకు పొదుగవలసిన మణులను కొనిరండు.

10-19. మీలో నేర్పుగల పనివారందరును ప్రభువు ఆజ్ఞాపించిన పనులు చేయరండు. గుడార మును, దాని డేరాను, కప్పడమును, కొక్కెములను,  చట్రములను, బద్దెలను, అడ్డకఱ్ఱలను, స్తంభములను, వాని క్రింది దిమ్మలను, మందసమును దాని మోత కఱ్ఱలను, మందసముమీది కరుణాపీఠమును, వానిని కప్పియుంచు తెరను, రొట్టెలనుంచు బల్లను, దానిని మోయు మోతకఱ్ఱలను, దాని ఉపకరణములను, సన్నిధి రొట్టెలను, వెలుతురునిచ్చు దీపస్తంభమును, దాని పరికరములను, దాని దివ్వెలను, వానికి వాడెడి చమురును, ధూపమును అర్పించు పీఠమును, దానిని మోయు మోతకఱ్ఱలను, అభిషేకతైలమును సువాసన గల సాంబ్రాణిని, గుడారపు ప్రవేశముననున్న తెరను, దహనబలులు అర్పించు బలిపీఠమును, దాని చుట్టు నున్న ఇత్తడి జల్లెడను, ఆ పీఠము మోయు మోత కఱ్ఱలను, దాని పరికరములను, గంగాళమును, దాని పీటను, ఆవరణపుతెరలను, ఆవరణపు స్తంభములను, వాని దిమ్మలను, ఆవరణ ప్రవేశముననున్న తెరను, గుడారము మరియు ఆవరణములందలి తెరల మేకులను, మోకులను, పరిశుద్ధస్థలమున కైంకర్యము చేయు యాజకుల అమూల్యమైన వస్త్రములను, అనగా యాజకుడగు అహరోనునకు ప్రతిష్ఠితవస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వలసిన వస్త్రములను తయారు చేయరండు” అనిచెప్పెను.

20. ఆ మాటలు ఆలించి యిస్రాయేలు ప్రజలు అందరు మోషే చెంతనుండి వెడలిపోయిరి.

21. హృదయములో, ఆత్మలో ప్రేరేపితులై ప్రభువునకు కానుకలు అర్పింపగోరిన వారందరు కానుకలు కొనివచ్చిరి. వారు గుడారమును నిర్మించుటకును, అందు కైంకర్యమును చేయుటకును పవిత్రవస్త్రము లను తయారు చేయుటకును వలయు సామగ్రి నంతిని కొనివచ్చిరి.

22. యిస్రాయేలు స్త్రీపురుషులు వచ్చిరి. వారు ఇష్టపూర్తిగా బులాకీలను, పోగులను, ఉంగరములను, దండలను, బంగారునగలను కొని వచ్చిరి. ప్రభువునకు బంగారునగలు కానుక పెట్ట గోరిన వారందరును వానిని కొనివచ్చిరి.

23. ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్ని, నారబట్టలు, మేక వెంట్రుకలతో నేసిన బట్టలు, ఎఱ్ఱని అద్దకము వేసిన పొట్టేలు చర్మము, నాణ్యమైన గ్టితోళ్ళు ఎవరెవరి వద్ద ఏమియున్నవో వారు వాిని తీసుకొనివచ్చిరి.

24. వెండి, ఇత్తడి గలవారు వానిని కొనివచ్చిరి. తుమ్మకఱ్ఱ గలవారు దానిని తీసికొనివచ్చిరి.

25. నేర్పుగల స్త్రీలు నేతకు పూనుకొని ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో పేనినదారమును, నేసిననార బట్టలను తయారు చేసికొనివచ్చిరి.

26. హృదయ ప్రేరేపితులై ప్రావీణ్యముగల స్త్రీలందరు మేక వెంట్రుకలను వడికిరి.

27. ప్రజల నాయకులు లేతపచ్చలను, పరిశుద్ధవస్త్రమునకు, వక్షఫలక మునకు పొదుగవలసిన మణులను, 28. దీపము లను, అభిషేకతైలమునకు, సువాసనగల సాంబ్రాణికి వలసిన చమురును, సుగంధ ద్రవ్యములను కొనివచ్చిరి.

29. ఈ రీతిగా హృదయ ప్రేరేపితులైన యిస్రాయేలు స్త్రీపురుషులందరును ప్రభువు మోషేకు ఆజ్ఞాపించిన పరికరములను చేయుటకు వలసిన కానుకలను యిష్టపూర్తిగా కొనివచ్చిరి.

గుడారమునుకట్టు పనివారు

30. మోషే ప్రజలతో ”ప్రభువు యూదా వంశ మునకు చెందిన హూరు మనుమడును, ఊరి కుమారుడునగు బేసలేలును ఎన్నుకొనెను.

31. అతనిని దైవాత్మతో నింపెను. కనుక అతనికి సుందరమైన వస్తువులనుచేయు నేర్పు సామర్థ్యము, తెలివితేటలు లభించెను.

32. అతడు సుందర వస్తువుల నమూనా లను చేసికొని వెండితో, బంగారముతో, ఇత్తడితో వానిని తయారు చేయగలడు.

33. రత్నములను సానప్టిె బంగారమున పొదగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు.

ఈ రీతిగా సుందర వస్తువులన్నిని తయారు చేయగలడు.

34. బేసలేలునకును, దాను తెగకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబునకును సుందర వస్తువులను చేయునేర్పును, ఆ పనితనమును ఇతరులకు గూడ నేర్పించు బుద్ధిని ప్రభువు దయచేసెను.

35. ప్రభువు వారిద్దరికి రాళ్ళను చెక్కుటకును, సుందరవస్తువుల నమూనాలను తయారుచేయుట కును, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నిని నేయుట కును, నారవస్త్రములు సాదా వస్త్రములు తయారు చేయుటకును జ్ఞానహృదయములను ప్రసాదించెను. వారు సుందర వస్తువులను వేనినైనను చేయగలరు. చిత్రమైన వస్తువులను తయారు చేయగలరు” అని నుడివెను.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము