హనన్యాతో వివాదము

28 1. ఆ సంవత్సరముననే, అనగా సిద్కియారాజు పరిపాలనాకాలము నాలుగవయేడు ఐదవనెలలో, గిబ్యోను నగరవాసియు, అస్సూరు కుమారుడునైన హనన్యాప్రవక్త యాజకులును, ప్రజలును వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను: 2. యిస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను బబులోనియారాజు కాడిని విరుగగ్టొితిని.

3. బబులోనియారాజు నెబుకద్నెసరు ఈ తావునుండి తన దేశమునకు కొనిపోయిన దేవాలయ పాత్రములన్నిని రెండేండ్ల కాలములోనే నేను మరల కొనివత్తును.

4. యెహోయాకీము కుమారుడను, యూదారాజునునగు యెహోయాకీనును, బబులోనియాకు బందీలనుగా గొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరిని నేను వెనుకకు తీసికొనివత్తును. నేను బబులోనియారాజు కాడిని విరుగగొట్టుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”

5. అపుడు నేను దేవాలయమునందలి యాజకు లును, ప్రజలును వినుచుండగా హనన్యాతో ఇట్లింని: 6. ”అట్లే జరుగునుగాక! ప్రభువు ఈ కార్యము చేయునుగాక! ఆయన నీవు ప్రవచించిన కార్యమును నెరవేర్చి, దేవాలయ పాత్రములను, బందీలను బబులోనియా నుండి మరల ఇచికి తీసికొని వచ్చును గాక!

7. కాని నేను నీకును, ఈ ప్రజలకును చెప్పు పలుకులాలింపుము.

8. పురాతన కాలమునుండియు నీకును నాకును ముందున్న ప్రవక్తలు పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కుజాతులకును, రాజ్యములకును ప్రవచనములు చెప్పిరి.

9. కాని క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్త యున్నాడే, అతడు ప్రభువువలన పంపబడెనని నిర్థారించుటెట్లు? అతని మాటలు నెరవేరుటవలననేగదా!”

10. అంతట హనన్యా నా మెడ మీదినుండి కాడిని తీసికొని విరుగగొట్టెను.

11. అతడు ప్రజలందరు విను చుండగా ”నెబుకద్నెసరురాజు సకలజాతుల మెడమీద ప్టిెన కాడిని నేను రెండేండ్లలో ఈ రీతిగనే విరుగ గొట్టుదును” అని ప్రభువు పలుకుచున్నాడు అనెను. అటుతరువాత నేను అచినుండి వెళ్ళిపోయితిని.

12. హనన్యా నా మెడ మీది కాడిని విరుగగ్టొిన తరువాత, ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను: నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము.

13. ”నీవు కొయ్యకాడిని విరుగగొట్ట వచ్చును, కాని దానికి బదులుగా నేను ఇనుపకాడిని సిద్ధము చేయుదును.

14. సైన్యములకు అధిపతియైన యిస్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు. నేను ఎల్ల ప్రజలమీద ఇనుపకాడినుంతును. వారు బబులోనియా రాజు నెబుకద్నెసరునకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడ అతనికి సేవలు చేయునట్లు చేయుదును.”

15. తదనంతరము నేను హనన్యాతో ఇట్లింని: ”ఓయి! నీవు నా పలుకులాలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు. నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి.

16. కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. నేను నిన్ను భూమి మీదినుండి ఆవలకు గిెం వేయుదును. ప్రభువుమీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ యేడు ముగియకమునుపే నీవు చత్తువు.”

17. ఆ యేడు ఏడవనెలలోనే హనన్యా కన్ను మూసెను.