ఉపోద్ఘాతము:

పేరు: ఈజూఏఊజూష్ట్రంశ్రీంఖ|ంశ్రీ అను ఆంగ్లపదము, ఈజూఏఊజూష్ట్రంఐ (రెండవ) శ్రీంఖంఐ (చట్టము) అను రెండుపదముల కలయిక. పాతనిబంధనమును గ్రీకుభాషలోనికి అనువదించినవారు ద్వితీయ 17:18 లో  ప్రస్తావించిన ధర్మశాస్త్రపుప్రతిని రెండవధర్మశాస్త్రమని అభిప్రాయపడిరి. ప్రభువు మోషే ముఖమున సీనాయి కొండవద్ద దయచేసిన ఉపదేశము మొదిది.

రచయిత(లు):  మోషే వ్రాసెనని సాంప్రదాయక అభిప్రాయము. ఈ పంచకాండములను (ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ)  క్రీ.పూ.6వ శతాబ్దములో బబులోనియా ప్రవాసానంతరము సంకలనము చేయబడెనని పలువురు ఆధునిక పండితుల అభిప్రాయము.

చారిత్రక నేపథ్యము: యిస్రాయేలీయులు  మోవాబు మైదానమును చేరి, వాగ్దత్తభూమి కానానును ఆక్రమించుకోడానికి సిద్ధముగా ఉన్నారు.  ఐగుప్తు బానిసత్వ విముక్తి ఉద్యమానికి నాయకత్వము వహించిన మోషే పరమపదించెను (ద్వితీయ. 34:1-10) . ఆ నాయకత్వ బాధ్యత యెహోషువ భుజస్కంధాలపై పడినది (యెహోషు 1:1-2). మోషే తన తుదిపలుకుల ద్వారా (32:1-33:29) తిరుగుబాటుదారులుగా పేరొందిన యిస్రాయేలీయులను నిబంధన ప్రజలుగా పునరంకితులను చేసెను.

ముఖ్యాంశములు: ఈ గ్రంథము వాగ్దత్తభూమిని స్వాధీనపరచుకొనే నూతనతరము యొక్క స్థితిగతులను తెలుపును. దీనిద్వారా మోషే యిస్రాయేలీయులను స్మృతిపథములో నడిపించెను. వారి ఎన్నికలో దేవుని ప్రేమ, అందునుబ్టి ఆయనయెడల వారి విశ్వాసము, విధేయతలే యావే దేవునికి ప్రీతికరములని ఈ గ్రంథము మరోసారి గుర్తుచేయును. ఏకైక ఆరాధన స్థలమును నొక్కివక్కాణించును (అధ్యా.12).

క్రీస్తుకు అన్వయము: మీ మధ్య నీవిం ప్రవక్తను ప్టుింతును  (18:15-19; అ.కా. 3:22-23; 7:37).  క్రీస్తు శోధన (8:2=  మత్త. 4:4-10). మన్నా (8:3);  ఆజ్ఞలన్నిలోకెల్ల శ్రేష్ఠమైనది (6:5 = మత్త. 22:37).

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము