యూదులు పగతీర్చుకొనుట
హామాను తెల్లబోవుట
12 (6)1. ఆ రాత్రి రాజునకు నిద్రపట్టలేదు. కనుక అతడు రాజకార్యముల దస్తావేజును తెప్పించి చదివించుకొనెను.
2. ప్రాసాదమున రాజ నివాసము నకు రక్షకులుగానుండిన నపుంసకసేవకులు బిగ్తానను, తేరేషు అనువారు రాజును హత్యచేయుటకు కుట్ర పన్నగా మొర్దెకయి ఆ కుట్రను బట్టబయలుచేసెనని ఆ గ్రంథమున లిఖింపబడియుండెను.
3. రాజు ”ఈ ఉపకారమునకుగాను మొర్దెకయికి ఎి్ట సన్మానము చేసితిమి?” అని ప్రశ్నించెను. పరిచారకులు ”అతనిక్టిె సన్మానమును లభింపలేదు” అని జవాబిచ్చిరి.
4. రాజు ”ఇపుడు మా కార్యాలయమున ఎవరున్నారు” అని ప్రశ్నించెను. హామాను అప్పుడే ప్రాసాదము వసారా లోనికి వచ్చియుండెను. అతడు తాను సిద్ధము చేయించిన ఉరికంబము మీద మొర్దెకయిని ఉరితీ యుటకై రాజు అనుమతిని పొందుటకు వచ్చెను.
5. కనుక పరిచారకులు హామాను వసారాలో వేచియు న్నాడని చెప్పిరి. రాజు అతనిని లోనికి కొనిరండనెను.
6. హామాను తన ఎదుటకి రాగానే రాజు ”ప్రభువు సన్మానింపగోరినవానిని ఏ రీతిన సత్కరింపవలెను?” అని ప్రశ్నించెను. రాజు తననుదప్ప మరియెవరిని సన్మానింపబోడని హామాను తలంచెను.
7. కనుక అతడు ”ప్రభువులవారు సన్మానింపగోరినవానికి ఇట్లు మర్యాదలు చేయింపుడు.
8. అతడు ధరించుటకు ఏలినవారు తాల్చెడు రాజవస్త్రములను తెప్పింపుడు. ప్రభువులవారు ఎక్కెడు గుఱ్ఱమును గూడ తెప్పించి దాని తలమీద కిరీటమును ప్టిెంపుడు.
9. ఆ గుఱ్ఱమును, ఆ ఉడుపులను దేవరవారి కొలువులోని అత్యున్నత అధికారికి ఒప్పజెప్పింపుడు. ఆ అధికారి ప్రభువు లవారు సన్మానింపగోరిన అతనికి ఆ ఉడుపులను కట్ట బెట్టవలెను. అతనిని ఆ గుఱ్ఱముమీద ఎక్కించి రాజ వీధిలో త్రిప్పవలెను. తాను అతని ముందుగా నడ చుచు ‘ప్రభువు సన్మానింపగోరిన వానిని ఈ రీతిగా సత్కరింపవలెను’ అని ప్రకటన చేయవలెను” అని చెప్పెను.
10. రాజు హామానుతో ”వెంటనే ఆ ఉడు పులను, గుఱ్ఱమును తెప్పింపుము. ప్రాసాదద్వారము చెంత కూర్చుండియున్న యూదుడైన మొర్దెకయికి నీవు చెప్పిన ఈ సత్కార్యములన్నిని చేయింపుము. నీవి పుడు పేర్కొనినవానిలో వేనిని వదలిపెట్టరాదు సుమా!” అని పలికెను.
11. హామాను రాజవస్త్రములను గుఱ్ఱమును తెచ్చెను. ఆ ఉడుపులను మొర్దెకయికి తొడిగించెను. అతనిని గుఱ్ఱము మీద ఎక్కించి రాజవీధిలో త్రిప్పెను. తాను ముందు నడచుచు ”రాజు సన్మానింపగోరిన వానిని ఈ రీతిగా సత్కరింపవలెను” అని ప్రకటన చేసెను.
12. ఆ పిమ్మట మొర్దెకయి ప్రాసాదద్వారము చేరుకొనెను. హామాను అవమానముతో మొగము కప్పు కొని బిరబిర ఇంికి వెళ్ళిపోయెను.
13. అతడు జరిగిన సంగతియంతయు భార్యకు, మిత్రులకు తెలియజేసెను. అప్పుడు హామాను భార్య, బుద్ధి కుశలులైన అతని మిత్రులు అతనితో ”నీవు మొర్దెకయికి లొంగిపోయి తివి. అతడు యూదుడు. నీవు అతనిని గెలువజాలవు. అతడు నిన్ను ఓడించితీరును” అనిరి.
14. వారింకను మాటలాడుచుండగనే నపుంసక సేవకులు వచ్చి హామానును ఎస్తేరు సిద్ధము చేయించిన విందునకు ఆహ్వానించిరి.