విందులో పాల్గొను విధానము

32 1.      నిన్ను విందు పెద్దను చేసిన యెడల

                              గర్వింపకుము.

                              విందుకు వచ్చిన వారందరివలె

                              నీవును నిగర్వివైఉండుము.

                              మొదట అతిథులను పరామర్శించి,

                              పిమ్మట నీస్థానమున కూర్చుండుము.

2.           నీ బాధ్యతను నెరవేర్చిన పిదప

               నీవు కూర్చుండవచ్చును.

               తోడివారితో కలిసి ఆనందింపవచ్చును.

               అప్పుడు  ఆ  తోడివారు నిన్ను అభినందింతురు.

3.           వృద్ధులారా! మీరు విందులో మాటలాడ వచ్చును

               కాని మీరేమి చెప్పుచున్నారో

               మీకు తెలిసియుండవలెను.

               మీ మాటలు సంగీతమునకు

               ఆటంకము కలిగింపరాదు.

4.           వినోద కార్యక్రమము నడుచునపుడు

               మీ సోదిని ఆపివేయుడు.

               మీ విజ్ఞానమును ప్రదర్శించుటకు

               అది అదనుకాదు.

5.           విందులో సంగీతము సువర్ణాంగుళీయమున

               సూర్యకాంతమును తాపించినట్లుండును.

6.           ద్రాక్షరసముతో గూడిన విందులో గానము,

               బంగారమున పొదిగిన మరకతమువలె నుండును

7.            యువకులారా! అవసరమునుబ్టి

               మీరు విందులో మ్లాడవచ్చును.

               కాని రెండుసారులే, అదియును ఇతరులు

               మిమ్ము ప్రశ్నించినపుడే మాటలాడవచ్చును.

8.           అడిగిన అంశమునకు మీరు

               క్లుప్తముగా జవాబుచెప్పుడు.

               మీరు సంగతి తెలిసియు, మౌనము

               వహించుచున్నారనిపించుకొనుడు.

9.           మేమును పెద్దవారితో

               సమానమన్నట్లు ప్రవర్తింపకుడు.

               ఇతరులు ఉపన్యసించునపుడు

               మీలో మీరు మాటలాడుకోవలదు.

10.         ఉరుమునకు ముందు మెరుపు చూప్టినట్లే,

               వినయవంతుని మంచిపేరు అతనికి

               ముందుగా నడచును.

11.           అతిథులారా! మీరు సకాలమున 

               విందుశాలనుండి వెళ్ళిపొండు.

               అచినుండి వెళ్ళువారిలో

               మీరు చివరి వారుకారాదు.

               విందుశాలచుట్టు తారాడక నేరుగా మీ ఇంికి వెళ్ళిపొండు.

12.          మీ ఇంట మీ ఇష్టము వచ్చినట్లు

               ఆనందింపవచ్చును.

               కాని ప్రగల్భములు పలికి

               పాపము మాత్రము కట్టుకోవలదు.

13.          కడన మీకు ఇన్ని సుఖములను దయచేసిన

               మీ సృష్టికర్తకు తప్పక వందనములు అర్పింపుడు.

దైవభీతి

14.          దైవభీతి కలవాడు దేవుని శిక్షణకు లొంగును.

               తనను మక్కువతో వెదకువారిని

               ప్రభువు దీవించును.

15.          శ్రద్ధగా పఠించువాడు ధర్మశాస్త్రమును

               నేర్చుకొనును.

               కాని చిత్తశుద్ధితో పఠింపనివానికి

               అది వశపడదు.

16.          దైవభీతి కలవారు న్యాయమును గ్రహింతురు.

               వారి న్యాయవర్తనము దీపమువలె వెలుగును.    

17.          పాపాత్ములు శిక్షణను అంగీకరింపరు.

               ఏవేవో సాకులతో తాము కోరిన

               పనులెల్ల చేయుదురు.

18.          బుద్ధిమంతులు ఇతరుల

               అభిప్రాయములను ఆలింతురు.

               కాని భక్తిహీనులైన గర్వాత్ములు దేనికీ జంకరు.

19.          ఆలోచన లేకుండ ఏ పనిని చేయరాదు.

               ఆలోచించి కార్యము చేసినపిదప వగవనక్కరలేదు.

20. కరకుమార్గమున పయనింతువేని

               రాళ్ళుతట్టుకొని పడిపోయెదవు.

21.          నునుపుమార్గమున పోవునపుడును

               జాగ్రత్తగా ఉండవలెను.

22.        నీ గమ్యమునెల్లపుడు పరిశీలించి

               చూచుకొనుచుండవలెను.       

23.        ఏ పని చేసినను జాగ్రత్తగా చేయుము.

               అట్లయిన దేవుని ఆజ్ఞలను పాించినట్లగును.

24.         ధర్మశాస్త్రమును నమ్ముట అనగా

               దాని ఆజ్ఞలు పాించుటయే.

               ప్రభువుని నమ్మిన వానికి

               ఏ అపాయమును వాిల్లదు.