ఉపోద్ఘాతము:

పేరు:  హీబ్రూ భాషలో ‘మీకాయ’ అను పదమునకు ‘యావేను పోలిన వాడెవడు’ అని అర్థము (7:18,19). ‘మీకా’ అనునది మీకాయకు హ్రస్వ రూపము. యిస్రాయేలు దేవుడైన యావేయంతి శక్తి, బలపరాక్రమాలు మరెవరికీ లేవు అని దీని భావము. ఇతడు మోరెషెత్‌ (1:1,14) అనే చిన్న పట్టణవాసి. ఇది దక్షిణ యూదాలో గాతు పట్టణ దరిదాపులలో ఉన్నది. మీకా తన స్వస్థలములోని పట్టణవాసుల దుర్మార్గము, అవినీతిని చూసి చలించిపోయాడు.       

కాలము: క్రీ.పూ. 750-700. యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలములో ప్రవక్తగానున్నాడని తెలుస్తున్నది (1:1; యిర్మీ. 26:18).

రచయిత: మీకా.

చారిత్రక నేపథ్యము: యెషయా, హోషేయ ప్రవక్తలకు సమకాలీకుడు. యెరూషలేము విధ్వంసము గూర్చిన వివరములు ఈ గ్రంథములో కూడా కనపడతాయి. (చూడుము: 2 రాజు 15:32-20:21; 2 రా.ది.చ. 27-32 అధ్యాయాలు; యెషయా 7, 20,36-39 అధ్యాయాలు). యిస్రాయేలీయుల చెడుజీవితము వలన వారి రాజధాని సమరియ నాశనము  కానున్నదని (1:5-7), యూదా కూడా అవమానకర రోజుల నెదుర్కోబోతున్నదని (1:9-16) ప్రవచించాడు.

ముఖ్యాంశములు: యిస్రాయేలీయులు, యూదాలపై ఆమోసు, హోషేయ ప్రవక్తలు అందించిన హెచ్చరికలు మీకా ప్రవచనాలలో ప్రస్ఫుటమవుతాయి. షొమ్రోను ప్రజలు, నాయకులు అన్యదేవతలను కొలవడము, పేదలకు అన్యాయము చేయడం విం అంశాలను మీకా ప్రస్తావిస్తాడు (ఆమో 5:10-27; హోషే 2:2-13; మీకా 1:2-7). యెరూషలేము పౌరుల పాపాల చ్టిలను విప్పెను (1:8-11; 3:8-12). దేవుని తీర్పు, రాబోయే దేవునిరాజ్య ప్రస్తావన తెచ్చి ప్రజలను ఉత్తేజపరిచెను.

క్రీస్తుకు అన్వయము: క్రీస్తును గూర్చిన ప్రత్యక్ష ప్రస్తావన విషయములో, పూర్వనిబంధన గ్రంథములలో మీకా ముఖ్యమైనది.  క్రీస్తు జన్మించబోయే జన్మస్థలాన్ని స్పష్టంగా తెలియచేసెను (5:2; మత్త 2:4-6). క్రీస్తు రాజ్యపాలనను గూర్చి వివరించెను. (5:3-6; ఎఫెసి 2:14-18). క్రీస్తుపాలన నిత్యము, అనంతమైనదని తెలిపెను (2:12-13; యోహాను 10:1-6; హెబ్రీ 13:20). 

Home  

Previous                                                                                                                                                                                                  Next