11 1. పేదవారి జ్ఞానము వారిని

                              తల ఎత్తుకొనునట్లు చేయును.

                              వారిని అధికులమధ్య

                              కూర్చుండునట్లు చేయును.

వెలుపలి డంబమును లెక్కచేయవద్దు

2.           అందముగానున్నందువలన

               ఎవరిని మెచ్చుకోవలదు.

               అందముగా లేనందువలన

               ఎవరిని నిరాకరింపవలదు.

3.           రెక్కలతో ఎగురు ప్రాణులలో తేనెీగ చాలచిన్నది

               కాని దాని తేనె మహామధురముగా ఉండును.      

4.           నీ నాణ్యమైన దుస్తులను చూచుకొని

               మురిసి పోవలదు.

               గౌరవము అబ్బినపుడు పొగరుబోతువు కావలదు.

               ప్రభువు అద్భుతకార్యములు చేయును.

               వానిని నరులు తెలిసికొనజాలరు.

5.           చాలమంది రాజులు గద్దెదిగి నేలమీద కూర్చుండిరి

               ఎవరు ఊహింపని వారువచ్చి,

               ఆ రాజుల కిరీటములు ధరించిరి.

6.           పాలకులు చాలమంది అవమానమున మునిగిరి.

               సుప్రసిద్ధులు చాలమంది

               అన్యుల శక్తికి లొంగిపోయిరి.

ఆలోచన, జాగరూకత

7.            విషయమును జాగ్రత్తగా పరిశీలించి చూచినగాని తప్పుపట్టవద్దు.

               ఆలోచించి చూచిన పిదపగాని 

               విమర్శకు పూనుకోవద్దు.

8.           ఇతరులు చెప్పినది వినిన పిదపగాని

               జవాబు చెప్పవద్దు.

               మాటలాడు వానికి మధ్యలో అడ్డురావద్దు.

9.           నీకు సంబంధింపని విషయములలో తలదూర్చి

               తగవు తెచ్చుకొనకుము. 

               పాపాత్ముల  కలహములలో జోక్యము

               కలిగించుకొనకుము.

10.         కుమారా! నీవు చాల కార్యములను

               నెత్తిన పెట్టుకోవద్దు.

               చాలపనులను చేపట్టెదవేని కష్టములను

               కొనితెచ్చుకొందువు.

               త్వరపడి పనిచేసినను నీవు మొదలుప్టిెన

               కార్యములెల్ల ముగింపజాలవు.

               వానిని విడనాడజాలవు కూడ.

దేవుని మాత్రమే నమ్మవలెను

11. ఒకడు ఎంత శ్రమించి పనిచేసినను

               ఎల్లపుడు వెనుకబడుచునే యుండును.

12.          మరియొకడు మందమతి,

               అన్యుల సహాయము కోరువాడు,

               శక్తిలేనివాడు, పరమదరిద్రుడు కావచ్చును.

               కాని ప్రభువు వానిని కరుణతో వీక్షించి,

               దీనావస్థనుండి ఉద్ధరింపవచ్చును.

13.          అప్పుడతడు ఔన్నత్యము పొందగా చూచి

               ఎల్లరు ఆశ్చర్యచకితులగుదురు.

14.          మేలు- కీడు, బ్రతుకు-చావు, కలిమి-లేమి

               అన్నియు దేవునినుండియే వచ్చును.

15.          విజ్ఞానము, వివేకము, ధర్మశాస్త్రజ్ఞానము,

               ప్రేమ, సత్కార్యాచరణను ప్రభువే దయచేయును.

16.          చెడు, అంధకారము దుష్టులకు

               పుట్టుకతోనే వచ్చును.

               చెడును కోరుకొనే వారు వృద్ధులగువరకు

               చెడ్డవారుగనే ఉండిపోయెదరు.

17.          ప్రభువు భక్తిపరునికొసగు దీవెనలు

               దీర్ఘ కాలము నిలుచును.

               ఆయన మన్ననపొందినవాడు

               నిత్యము విజయములు చేపట్టును.

18.          నరుడు కష్టించి, సుఖములు త్యజించి,

               ధనమార్జించినను కడన ఫలితమేమున్నది?

19.          అతడు, ”ఇక శ్రమచేయుట చాలించి

               నేనార్జించిన సొత్తుననుభవింతును”

               అని యెంచవచ్చునుగాక!

               కాని అతడు చనిపోవుటకును,

               అతని సొత్తు అన్యులు  పాలగుటకును

               ఇంకెన్నినాళ్ళ వ్యవధియున్నదో

               అతడికే తెలియదుకదా!

20.        నీ బాధ్యతలను పట్టుదలతోను,

               దక్షతతోను నిర్వహింపుము.

               నీవు చేయవలసిన పనులు చేయుటలోనే

               ముసలివాడవుకమ్ము.

21.          పాపాత్ముల విజయములనుగాంచి

               అసూయ చెందకుము.

               దేవుని  నమ్మి నీ  పనులు నీవు శ్రద్ధగా చేయుము.

               క్షణకాలములోనే దరిద్రుని సంపన్నుని చేయుట

               ప్రభువునకు కష్టముకాదు.

22.        భక్తుడు దేవుని దీవెననే బహుమతిగా బడయును. ఆ దీవెన క్షణకాలముననే సత్ఫలమొసగును.

23.        కనుక నా అవసరములెట్లు తీరును?

               భవిష్యత్తులో నాకు విజయములు

               ఎట్లు సిద్ధించును? అని ఆందోళన చెందకుము.

24.         మరియు, ”నాకు కావలసిన

               వస్తువులన్నియు ఉన్నవి.

               భవిష్యత్తులో నాక్టిె కీడు వాిల్లదులే”

               అని  తలపకుము.

25.        జనులు కలిమి కలిగినపుడు

               రానున్న కష్టములు గుర్తింపరు.

               చెడుకాలము వచ్చినపుడు

               ముంది లాభములను స్మరింపరు.  

26. నరుడు చనిపోవుదినము వరకు వేచియుండి,

               అప్పుడు అతనిని బహూకరింప పూనుకొనుట

               ప్రభువునకు కష్టముకాదు.

27.         ఆ క్షణమున అతని మంచిచెడ్డలు

               ఎల్లరును తెలిసికొందురు.

               ఆ కష్టపు క్షణములోనే

               అతని ఆనందమంతయు ఎగిరిపోవచ్చును.

28. కనుక చనిపోక పూర్వము

               ఏ నరుని ధన్యునిగా ఎంచవలదు.

               అతని సంతానము ద్వారానే

               అతడు ఎి్టవాడో తెలియును.

దుష్టులను నమ్మరాదు

29.        ప్రతివానిని నీ ఇంికి ఆహ్వానింపవద్దు.

               కపాత్ములెన్ని పన్నాగములైనను పన్నుదురు.

30.        స్వజాతిపకక్షులను వలలోనికి

               ఆహ్వానించు కౌజువలె

               దుష్టుడు మనలను అపాయము పాలుచేయును.

               వేగుల వానివలెనతడు

               మన పతనమును పొంచి చూచుచుండును.

31.          అతడు మన మంచినిగూడ

               చెడుగా ప్రదర్శించును.

               మన మంచిపనులలోకూడ తప్పుపట్టును.

32.        చిన్న నిప్పురవ్వ

               గంపెడు బొగ్గులను రగిలించును.

               దుష్టుడు హత్యచేయుటకు కాచుకొని ఉండును.

33.        అి్ట దుర్మార్గుని పన్నుగడలను

               కనిప్టిె ఉండవలెను.

               లేదేని అతడు మనలను సర్వనాశనము చేయును

34.         పొరుగు వానిని నీ ఇంికి కొనివత్తువేని

               అతడు తగవులు ప్టిె నీకును,

               నీ కుటుంబమునకును మధ్య చీలికలు తెచ్చును.