ఐగుప్తులోని యూదులకు జాబులు

మొదటి జాబు

1 1. ”యెరూషలేములోను, యూదయాలోను నివ సించు యూదులు ఐగుప్తునందలి సోదర యూదులకు శుభము పలికి వ్రాయునది. మీకు శాంతియు,  అభ్యు దయము  సిద్ధించునుగాక!

2. ప్రభువు తన విశ్వాస దాసులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసికొనిన నిబంధనమును స్మరించుకొని మీకు మేలు చేయునుగాక!

3. ప్రభువు మీకు తనను ఆరాధించు బుద్ధి ప్టుించునుగాక! ఆయన మీరు హృదయపూర్వకము గను, ఉత్సాహముగను తన చిత్తమును పాించునట్లు చేయునుగాక!

4. తన ధర్మశాస్త్రమును, తన ఆజ్ఞలను అర్థము చేసికొను శక్తిని మీకు ప్రసాదించి మీకు శాంతిని దయచేయునుగాక!

5. మీ ప్రార్థనలు ఆలించి మీ తప్పిదములను మన్నించును గాక! ఆప త్కాలమున మిమ్ము చేయి విడువకుండునుగాక!

6. ఇచట మేము మీ కొరకు ప్రార్థనలు అర్పించుచున్నాము.

7. గ్రీకుశకము నూట అరువది తొమ్మిదవ  యేట (క్రీ.పూ 143) దెమేత్రియసు  పరిపాలనాకాలమున మేము మీకొక లేఖను వ్రాసి ఇట్లు తెలియజేసితిమి: ‘యాసోను అతని అనుచరులు మన పరిశుద్ధ దేవాలయముమీద తిరుగబడిన తరువాత మేము మతహింసలకును, ఉపద్రవ ములకును గురియైతిమి.

8. వారు దేవాలయద్వార ములను తగులబ్టెి, నిర్ధోషులైన ప్రజలను వధించిరి. అంతట మేము ప్రభువునకు మొరపెట్టగా ఆయన మా వేడికోలును ఆలించెను. మేము పశుబలులు, ధాన్యబలులు అర్పించితిమి. దేవాలయమున దీపములు వెలిగించితిమి. సాన్నిధ్యపురొట్టెలను అమర్చితిమి.

9. కనుక మీరును కీస్లేవు నెలలో గుడారముల పండుగ జరుపుకొనుడు. ఈ కమ్మ గ్రీ.శ. నూట ఎనుబది ఎని మిదవ (క్రీ.పూ 124) వ యేట వ్రాయబడినది.”

రెండవ జాబు

10. ”యెరూషలేములోను, యూదయాలోను వసించు యూదులును, యూదుల పరిపాలనసభయు, యూదాసు కలిసి యాజకుల తెగకు చెందినవాడును ప్టోలమీ రాజునకు, గురువునగు అభిషిక్తుడైన అరిష్టోబులసునకును ఐగుప్తులోని యూదులకును నమస్కరించి వ్రాయునది. మీకెల్లరికిని శుభాకాంక్షలు, ఆరోగ్యము సిద్ధించునుగాక!

అంియోకసునకు శిక్ష, దేవునికి వందనములు

11. ప్రభువు మమ్ము పెద్ద ఆపదనుండి కాపాడెను గనుక మేము ఆయనకి వందనములు చెల్లించుచున్నాము. మేము రాజు నెదిరించి పోరాడవలసి వచ్చెను.

12. కాని ప్రభువు పరిశుద్ధనగరమునకు వ్యతిరేకముగ పోరాడిన వారిని పారద్రోలెను.

13. అంతియోకసు రాజు పారశీకమున ప్రవేశించినపుడు అతని సైన్యము అజేయముగానుండెను. కాని నానెయా దేవతను అర్చనచేయు యాజకులు మోసముతో అతని సైన్య మును తమ దేవళములోనే చిత్రవధ చేసిరి.

14. ఆ రాజు తన స్నేహితులతో నానెయా దేవళమునకు వెళ్ళెను. అతడు ఆ దేవతను పెండ్లియాడి ఆమె దేవళము నందలి నానావిధ నిధులను వరకట్నము పేరుతో అపహరింప చూచెను.

15. యాజకులు ఆ నిధులను దేవాలయమున ప్రదర్శింపగా రాజు వానిని స్వాధీనము చేసికొనుటకుగాను కొద్దిమంది మిత్రులతో దేవాలయ ములోనికి వెళ్ళెను, గాని యాజకులు వెంటనే గుడి తలుపులు మూసిరి.

16. వారు పైకప్పులోని రహస్య తలుపు తెరచి రాజును అతని మిత్రులను రాళ్ళతో క్టొి చంపిరి. వారి తలలను నరికివేసి దేవాలయము వెలుపల నిలిచియున్న ప్రజల చెంతకు విసరివేసిరి.

17. ఆ దుర్మార్గులను తగిన రీతిగా శిక్షించినందులకు గాను మన దేవుని స్తుతింతముగాక! అన్ని కార్యములకు  గాను  అతనిని  కీర్తింతముగాక!

పవిత్రాత్మ పదిలముగా ఉండుట

18. మేము కీస్లేవు నెల ఇరువదిఐదవ తేదీ గుడారముల పండుగవలె దేవాలయ శుద్ధీకరణ పండు గను గూడ జరుపుకొందుము. మీరును ఈ పండుగను చేసికోవలెనన్న కోర్కెతో, మేము ఈ క్రింది సంఘట నను గూర్చి మీకు వ్రాయుచున్నాము. ఈ పండుగను చేసికొనుటద్వారా, పూర్వము నెహెమ్యాకు దేవాలయ మును, బలిపీఠమును పునర్నిర్మాణముచేసి బలులు అర్పించునపుడు అగ్ని ఎట్లు ప్రత్యక్షమైనదో మీరు గుర్తుంచుకొందురు.

19. మన పూర్వులు పారశీకమునకు బందీలుగా వెళ్ళినపుడు భక్తిమంతులైన యాజకులు కొందరు బలిపీఠము మీదినుండి అగ్నిని తీసికొని వచ్చి ఎండిపోయిన ఒక బావిలో రహస్యముగా దాచి యుంచిరి. వారు ఆ నిప్పును నేర్పుతో దాచిరి. కనుక అది ఎవరి కంటను పడలేదు.

20. చాల యేండ్లు కడచిన తరువాత దేవునికి అనుగ్రహము కలుగగా పారశీక ప్రభువు నెహెమ్యాను యెరూషలేమునకు పంపెను. నెహెమ్యా పూర్వము నిప్పును దాచిన యాజకుల వంశజులను పిలిచి, మీరు వెళ్ళి ఆ అగ్ని ఎచటనున్నదో కనుగొనుడని చెప్పెను. వారు అగ్ని కాదు గాని ఏదో చిక్కనైన ద్రవపదార్థము తమ కంట బడినదని మాతోచెప్పిరి. నెహెమ్యా ఆ ద్రవపదార్థ మును కొంత తనయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

21. బలికి అవసరమైన వస్తువులన్నిని బలిపీఠముపై అమర్చిన పిదప నెహెమ్యా వేదికమీది కొయ్యలమీదను, బలిపశువు మీదను ఆ ద్రవపదార్థమును పోయుడని యాజకులను ఆజ్ఞాపించెను. వారటులనే చేసిరి.

22. కొన్ని క్షణములు కడచిన తరువాత అంతవరకు మబ్బు చాటుననుండిన సూర్యబింబము మరల వెలుపలికి వచ్చి ప్రకాశించెను. వెంటనే బలిపీఠము మీదినుండి పెద్దమంట యెగసెను. ఎల్లరును ఆశ్చర్యచకితులైరి.

23. ఆ అగ్ని బలిపశువును దహించుచుండగా యాజ కులు ప్రార్థనలు జపించిరి. యోనాతాను నడిపింపగా, నెహెమ్యా, ఇతర ప్రజలు ఆ ప్రార్థనలకు బదులు పలికిరి.

24. ఆ ప్రార్థనము ఇట్లుండెను:    

               ”ప్రభూ!

               నీవు సర్వమును సృజించినవాడవు,

               భయంకరుడవు, శక్తిసంపన్నుడవు.

               అయినను నీవు కరుణామయుడవు,

               న్యాయము తప్పనివాడవు.

               నీవొక్కడవే రాజువు,

               నీవొక్కడవే దయామయుడవు.

25. నీవొక్కడవే ప్రాణి పోషకుడవు, న్యాయవంతుడవు.

               నీవు సర్వశక్తి మంతుడవు, శాశ్వతుడవు.

               యిస్రాయేలీయులను

               సకలఉపద్రవములనుండి కాపాడువాడవు.

               నీవు మా పితరులను నీ జనముగా ఎన్నుకొని,

               వారిని పవిత్రపరచితివి.

26.        యిస్రాయేలీయుల తరపున మేము సమర్పించు

               ఈ బలిని అంగీకరింపుము.

               నీ ప్రజలమైన మమ్ము రక్షించి

               పవిత్రుల చేయుము.

27.         అన్యదేశములలో బానిసలుగా మ్రగ్గుచున్న

               నీ ప్రజను దాస్యమునుండి విడిపింపుము.

               చెల్లాచెదరైపోయిన నీ జనమును

               మరల ప్రోగుచేయుము.

               అన్యుల అవమానమునకు గురియైన

               నీ ప్రజను కరుణింపుము.

               నీవే మా ప్రభుడవని 

               అన్యజాతులెల్ల  గుర్తించునుగాక!

28.        మమ్ము పీడించు గర్వాత్ములను శిక్షించుము.

29.        మోషే నుడివినట్లే నీ ప్రజ ఈ పవిత్ర దేశమున

               స్థిరపడునట్లు చేయుము.”        

30. అంతట యాజకులు గీతములు పాడిరి.

31. బలిపశువు దగ్ధమైన పిమ్మట నెహెమ్యా మిగిలిన ద్రవపదార్థమునెత్తి పెద్ద శిలలపై పోయుడని ఆజ్ఞా పించెను. 32. అటులచేసిన వెంటనే ఆ బండలపై గూడ మంటయెగసెను. కాని బలిపీఠము మీది అగ్ని నుండి వెలువడిన మంట ఈ క్రొత్త మంటను ఆర్పి వేసెను.

33. ఈ అగ్ని ఉదంతము ఎల్లెడల పొక్కెను. యాజకులు ప్రవాసమునకు వెళ్ళకముందు పీఠము మీది అగ్నిని దాచియుంచిన స్థలమున ద్రవపదార్థ మొకి కనిపించెననియు, నెహెమ్యా అతని మిత్రులు ఆ పదార్థముతో పీఠము మీది బలిపశువును దహించి రనియు పారశీక ప్రభువు వినెను.

34. ఆ రాజు విచారణము జరిపించి ఈ సంగతులెల్ల సత్యమే అని నిర్ధారణ చేసికొనిన పిమ్మట, ఆ చోటు చుట్టును గోడ క్టించి అది పవిత్రస్థలమని ప్రకటనము చేయించెను.

35. ఆ ప్రదేశము రాజునకు మంచి ఆదాయము తెచ్చిపెట్టెను. ఆ సొమ్ముతో అతడు తన మన్నన పొందిన వారికి బహుమతులు పంచియిచ్చెడివాడు.

36. నెహెమ్యా అతని స్నేహితులు ఆ ద్రవపదార్థమును ‘నెఫ్తారు’  అని  పిలిచిరి.  ఆ  మాటకు ”శుద్ధీకరణము” అని అర్థము. కాని ప్రజలు  మాత్రము దానిని ‘నఫ్తా’ అనియే పిలిచిరి.