దావీదుకుటుంబము అంతఃకలహములు

మెఫీబోషెతు

దావీదు యోనాతాను కుమారునికి దయచూపుట

9 1. దావీదు ”సౌలు కుటుంబమువారు ఇంకెవరైన మిగిలియున్నారా? యోనాతానును స్మరించుకొని వారిని కరుణింతును” అనెను.

2. సౌలు కుటుంబము నకు సేవచేయు దాసుడు సీబా అనునతడు ఒకడు కలడు. అతనిని దావీదు చెంతకు పిలవనంపిరి. రాజు అతనిని చూచి ”సీబావు నీవేనా?” అని అడుగగా వాడు ”చిత్తము నేనే” అని పలికెను.

3. రాజు ”సౌలు కుటుంబము వారెవరును బ్రతికియుండలేదా? యావే పేర నేను వారికి ఉపకారము చేసెదను” అని అడిగెను. సీబా ”యోనాతాను పుత్రుడొకడు మిగిలియున్నాడు. అతడు కుింవాడు” అని చెప్పెను.

4. అతడెక్కడ ఉన్నాడని దావీదు మరలఅడుగగా సీబా ”లోదెబారున, అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట వసించు చున్నాడు” అని విన్నవించెను.

5. కావున రాజతనిని లోదెబారు నందలి మాకీరు ఇంినుండి పిలిపించెను.

6. సౌలు మనుమడును యోనాతాను కుమారు డునగు మెఫీబోషెతు దావీదు సమక్షమునకు రాగానే సాగిలపడి దండము పెట్టెను. దావీదు అతనిని ”మెఫీబోషెతూ” అని పిలచెను. అతడు ”చిత్తము ప్రభూ!” అనెను. 7. దావీదు ”భయపడకుము. నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నీపై దయ చూపెదను. నీ పితరుడైన సౌలుభూములన్నింని నీకు తిరిగి ఇప్పింతును. నీవు ఇకమీదట నా సరసన కూర్చుండి భోజనము చేయుము” అని చెప్పెను.

8. మెఫీబోషెతు మరల దండము ప్టిె ”ఏలిక ఈ దాసునికెంతి ఆదరము చూపెను! నేనేపాివాడను? చచ్చిన కుక్కవింవాడను గదా!” అనెను.

9. దావీదు సీబాతో ”సౌలు కుటుంబమునకు చెందిన ఆస్తిపాస్తులను మీ యజమానుని పుత్రుని వశము చేసెదను.

10. నీవును, నీ కుమారులును, నీ దాసులును మీ యజమానుని పొలములు సాగుచేయుడు. పంట సేకరించి మెఫీబోషెతు కుటుంబమునకు ధాన్యము సమకూర్పుడు. మీ యజమానుని కుమారుడు మెఫీబోషెతు మాత్రము ప్రతిదినము నా ఇంటనే భుజించును” అని చెప్పెను. సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువదిమంది దాసులు కలరు.

11. అతడు రాజుతో ”ఏలిక ఆనతిచ్చిన తీరునే ఈ సేవకుడు అంతయు చక్కబెట్ట గలడు” అని విన్నవించెను.

12. మెఫీబోషెతు రాజపుత్రులవలె దావీదు ఇంటనే భుజించెను. అతనికి మీకా అను బిడ్డడు కలడు. సీబా కుటుంబమువారందరు అతనికి సేవకులైరి.

13. మెఫీబోషెతు యెరూషలేముననే వసించి రాజ గృహమున భుజించెను. అతని రెండుకాళ్ళు కుింవి.

Previous                                                                                                                                                                                                  Next