షెబ తిరుగుబాటు

20 1. యిస్రాయేలీయులలో షెబ అను దుర్మార్గుడు ఒకడు కలడు. అతడు బెన్యామీనీయుడైన బిక్రి కుమారుడు. షెబ బాకానూది:

”మనకు దావీదు సొత్తులో పాలులేదు,

యిషాయి కుమారుని వారసులతో పొత్తులేదు.

కావున యిస్రాయేలీయులారా!

మన నివాసములకు వెడలిపోవుదము రండు!”

అని కేకలిడెను.

2. ఆ మాటలాలించి యిస్రాయేలీ యులు దావీదును విడనాడి షెబ వెంటబోయిరి. కాని యూదీయులు మాత్రము దావీదును వదలక యోర్దానునుండి యెరూషలేమువరకు అతని వెంట నింపోయిరి.

3. దావీదు యెరూషలేములోని తన పురము చేరుకొని ప్రాసాదమున ప్రవేశించెను. అతడు ఆ ప్రాసాదమును పరామర్శించుటకని వదలి పోయిన పదిమంది ఉంపుడుగత్తెలనొక ఇంటనుంచి వెచ్చము లిచ్చి పోషించెను. దావీదు వారిని మరల కన్నెత్తియైన చూడలేదు. కనుక వారు చనిపోవువరకు విధవలవలె జీవించిరి.

అమాసా వధ

4. రాజు అమాసాతో ”నీవు వెళ్ళి యూదీయులను మూడుదినములలో ప్రోగుచేసి కొనిరమ్ము! నీవు స్వయముగా వారితో రమ్ము” అని చెప్పెను.

5. అమాసా యూదీయులను గుంపుగూర్చుటకు వెడలిపోయెను. కాని అతడు దావీదు ప్టిెన గడువులోపల రాలేక పోయెను.

6. రాజు అబీషయితో ”ఈ బిక్రి కుమారుడు షెబ మనలను అబ్షాలోముకంటె ఎక్కువగా ముప్పు తిప్పలు పెట్టును. కనుక నీవు రాజు సంరక్షకభటులను తీసికొనిపోయి షెబను వెన్నాడుము. అతడు సురక్షిత పట్టణములు ప్రవేశించెనేని ఇక మన చేతికిచిక్కడు” అని చెప్పెను.

7. కనుక యోవాబు వారును, కెరెతీయులును, పెలెతీయులును మరియు మహావీరులు యెరూషలేము నుండి అబీషయితో పయనమై బిక్రి కుమారుడు షెబను పట్టుకొన బోయిరి.

8. గిబ్యోను చెంతనున్న పెద్ద రాతిబండ దగ్గరకు రాగానే ఆమాసా వారికెదురుగా వచ్చెను. యోవాబు నిలువుచొక్కాయి ధరించి నడికట్టు కట్టుకొని యుండెను. ఆ నడికట్టు మీదినుండి ఒరలో కత్తి కట్టుకునియుండగా ఆ ఒర వదులై కత్తి నేలబడెను.

9. యోవాబు ”తమ్ముడా అమాసా! క్షేమమేగదా!” అనుచు ముందికి వచ్చి, ముద్దిడుకొను వానివలె కుడిచేతితో అతని గడ్డము పట్టుకొనెను.

10. అమాసా యోవాబు చేతనున్న కత్తిని గమనింపనేలేదు. యోవాబు ఆ కత్తితో అమాసాను కడుపున పొడువగా అతని ప్రేవులుజారి నేలపైబడెను. రెండవపోటుతో అవసరము లేకయే అమాసా అసువులు బాసెను. అంతట అబీషయి, యోవాబు బిక్రి కుమారుడు షెబను పట్టుకొనుటకై చెరచెర సాగిపోయిరి.

11. యోవాబు సైనికుడొకడు అమాసా చేరువ నిలిచి ”యోవాబు, దావీదుల పక్షము అవలంబింప గోరువారు యోవాబును అనుసరించి వెళ్ళుడు” అని చెప్పుచుండెను.

12. అమాసా త్రోవనడుమ నెత్తుి మడుగులో పడియుండెను. ఆ త్రోవవెంట వచ్చు యోధు లందరను అచటఆగి నిశ్చేష్టులై చూచుచుండిరి. అది గాంచి ఒకసైనికుడు అమాసా శవమును ప్రక్క పొలము లోనికి లాగివేసి దానిమీద ఒక వస్త్రము కప్పెను.

13. అటుపిమ్మట యోధులందరు బిక్రి కుమారుడైన షెబను పట్టుకొనుటకై నేరుగా యోవాబును అనుసరించివెళ్ళిరి.

షెబ తిరుగుబాటు సమసిపోవుట

14. షెబ యిస్రాయేలు రాజ్యమంతట తిరిగి చివరకు ఆబేలుబెత్మాకా నగరము ప్రవేశించెను. బిక్రీయులు అతనిననుసరించి వెళ్ళిరి.

15. షెబ పట్టణమున ప్రవేశింపగనే అతనిని వెన్నాడివచ్చినవారు నగర ప్రాకారమెత్తు వరకు కట్టపోసి ప్రాకారమును కూలద్రోయదొడగిరి.

16. అపుడు వివేకవతియగు వనిత ఒకత్తె ప్రాకారముపై నుండి ”అయ్యలారా! ఒక్క మాటవినుడు. యోవాబును ఇచ్చికి పిలిపింపుడు. నేనాయనతో మ్లాడవలయును” అని పలికెను.

17. యోవాబు ముందికి వచ్చెను. ఆమె ”యోవాబువు నీవేనా?” అని అడుగగా అతడు ”అవును నేనే” అని చెప్పెను. ఆమె ”ఈ దాసురాలి పలుకులాలింపుము” అనెను. అతడు ”ఆలించుచునేయున్నాను చెప్పుము” అనెను.

18. ” ‘యిస్రాయేలు పెద్దల ఆచారములు అడుగిం పోయెనేని ఆబేలు, దాను పట్టణములను చూచి మరల నేర్చుకొనుడు’ అని పూర్వమొక సామెత యుండెడిది.

19. యిస్రాయేలు దేశమున శాంతి యుతులును యదార్ధవంతులును వశించు పట్టణమిది. మీరీ పట్టణమును, ఈ మాతృనగరమును నాశనము చేయబోవుచున్నారు. నాయనలార! ప్రభువు సొత్తయిన ఈ పురమునే కూలద్రోయుదురా?” అని పలికెను.

20. యోవాబు ”అమ్మా! ఇవి ఏి మాటలు? ఈ నగరమును ఆక్రమించుకోవలయుననిగాని, నాశనము చేయవలయుననిగాని నాకు కోరికలేదు.

21. ఉన్న మాట వినుము. ఎఫ్రాయీము కొండకోనకు చెందిన బిక్రి కుమారుడగు షెబ మన రాజు దావీదుపై తిరుగు బాటు చేసెను. అతనినొక్కనిని మాకు ప్టి యిత్తురేని వెంటనే మీ నగరమును వీడి వెడలిపోయెదము” అనెను. ఆమె ”దానికేమి, ఈ గోడమీద నుండి అతని తలను మీ కడకు విసరివేసెదము” అని చెప్పెను.

22. ఇట్లు చెప్పి ఆమె నగరములోనికి వెడలిపోయి తన తెలివితేటలతో పురజనులను ఒప్పించెను. వారు బిక్రి కుమారుడు షెబ తల నరికి గోడమీది నుండి యోవాబు ఎదుటకు విసరివేసిరి. వెంటనే యోవాబు బాకానూదెను. అతని అనుచరులు పోరు చాలించి తమ తమ గుడారములు చేరుకొనిరి. యోవాబు యెరూషలేమునకు వెడలిపోయెను.

దావీదు ఉద్యోగులు

23. యోవాబు దావీదు పాలములన్నింకిని నాయకుడు. యెహోయాదా పుత్రుడైన బెనాయా కెరెతీయులకును, పెలెతీయులకును నాయకుడు.

24. అదోరాము వ్టెిచారికి చేయు నిర్బంధ సైనికులకు అధిపతి. అహీలూదు కుమారుడు యెహోషాఫాత్తు లేఖకుడు.

25. షెవా కార్యదర్శి. సాదోకు, అబ్యాతారు యాజకులు. 

26. యాయీరు నివాసి యీరా కూడ దావీదునకు యాజకుడు.

Previous                                                                                                                                                                                                   Next