ఉపోద్ఘాతము:
పేరు: హీబ్రూ భాషలో నహూము అనగా ”నెమ్మది లేక కనికరము”. నహూము స్వస్థలము ఎల్కాషు (1:1). ఇది యూదా రాజ్యములోనిది.
కాలము: క్రీ.పూ. 663-612. యిర్మీయా, జెఫన్యా ప్రవక్తల సమకాలీకుడు.
రచయిత: నహూము.
చారిత్రక నేపథ్యము: అస్సిరియా ఆఖరి రాజు ఆషుర్బానిపాల్ చనిపోవునాికి (క్రీ.పూ. 626) అస్సిరియా రాజ్యము పతనావస్థకు చేరుకున్నది. క్రీ.పూ.612లో మాదీయులు, బబులోనియులు కలసి నీనెవెను పూర్తిగా ధ్వంసము చేసిరి. అస్సిరియనుల క్రూరత్వాన్ని చవిచూసిన యూదులు కూడ వారి పతనమును చూచి హర్షించిరి. ఈ నేపథ్యములో నహూము యూదులలో దేశభక్తిని నింపడానికి ప్రయత్నించెను. ఇది తనవారికి ఒక మంచి గుణపాఠము / హెచ్చరికగా కూడా నిలుస్తున్నది.
ముఖ్యాంశములు: అష్షూరు రాజ్య పతనము, దాని రాజధానియైన నీనెవె పతనము నహూము గ్రంథములో ప్రధానమైన అంశము. దేవుడు త్వరలోనే యూదులను అస్సిరియా బంధమునుండి విడుదలచేయునని, వారు తిరిగి శాంతిసమాధానాలతో వారి పండుగల నాచరించవచ్చని గ్టిగా వినిపించెను (1:15). కష్టకాలములో నమ్ముకున్న వారిని యావే దేవుడు కాపాడుతాడని బోధించెను (1:7). అస్సిరియా నాశనము దానిచే హింసించబడిన దేశాలన్నికి గొప్ప ఊరట కలిగించినది. అదే దైవప్రజలకు ప్రేరణాత్మక సందేశమైనది. దుర్మార్గుల్ని శిక్షించుటకు, తనను నమ్మినవారిని రక్షించుటకు దేవుడు పవిత్రయుద్ధమును ప్రకించడము ఈ గ్రంథ సారాంశము (1:3)
క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములో క్రీస్తుకు అన్వయించదగిన ప్రస్తావనలు ప్రత్యక్షంగా చూపలేము. పరోక్షంగా ఒకి రెండు పఠనాలను గుర్తించగలము. 1:2-8 లో నహూము దేవుని న్యాయతీర్పును గూర్చి చేసిన ప్రవచనాలు క్రీస్తునకు అన్వయించగలము.