యాజకులు, ప్రముఖులు, రాజు

 ప్రజలను నాశనము చేయుచున్నారు

5 1. యాజకులారా! ఈ పలుకులాలింపుడు.

               యిస్రాయేలీయులారా!   

               సావధానముగా వినుడు.

               రాజవంశజులారా! చెవియొగ్గి వినుడు.

               మీరు న్యాయము నెలకొల్పవలసినవారు

               కావున దేవుడు మీకు తీర్పువిధించును.

               మీరు మిస్ఫావద్ద

               జనులకు బోనుగా తయారైతిరి.

               తాబోరువద్ద

               జనులకు ఉచ్చుగా తయారైతిరి.

2.           మీరు ప్రజలకు గోతివలెనున్నారు.

               కనుక నేను మిమ్మెల్లరిని శిక్షింతును.

3.           ఎఫ్రాయీము ప్రజలగూర్చి

               నాకు బాగుగా తెలియును.

               వారు నా నుండి దాగుకోజాలరు.

               యిస్రాయేలు విగ్రహారాధనతో

               తమను తాము అపవిత్రము చేసికొనిరి.

4.           ప్రజలు తాము చేసిన దుష్కార్యములవలన

               తిరిగి దేవునివద్దకు రాలేకపోవుచున్నారు.

               వారు విగ్రహారాధనమున

               తలమున్కలైయున్నారు.

               కావున ప్రభువును తెలిసికోజాలకున్నారు.

5.           యిస్రాయేలీయుల గర్వమే

               వారు దోషులని నిరూపించుచున్నది.

               వారి పాపములే వారిని కూలద్రోయుచున్నవి.

               ఎఫ్రాయీముతోపాటు

               యూదాప్రజలు కూడ కూలుదురు.

6.           వారు ఎడ్లను గొఱ్ఱెలను దేవునికి బలి యిచ్చినను

               ప్రభువు వారికి దొరకడు.

               అతడు  వారిని విడనాడెను.

7.            వారు ప్రభువునకు ద్రోహము చేసిరి.

               వారి బిడ్డలు అన్యులబిడ్డలు.

               కనుక వారు తమపొలములతో పాటు

               నాశనమగుదురు.

యిస్రాయేలునకు యూదాకును మధ్య యుద్ధము

8.           గిబియాలో బాకానూదుడు.

               రామాలో బూరనూదుడు.

               బేతావెనున యుద్ధనాదము చేయుడు.

               బెన్యామీనీయులారా! పోరునకు సన్నద్ధులుకండు.

9.           శిక్షాదినము వచ్చుచున్నది.

               ఎఫ్రాయీము చెడిపోవును.

               యిస్రాయేలూ! నేనెరిగించు

               ఈ కార్యము జరిగితీరును.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               యూదానాయకులు యిస్రాయేలుపై

               దండెత్తి వారి భూమిని ఆక్రమించుకొనిరి.

               కావున నా శిక్ష వారిపై వరదవలెపారును.

11.           ఎఫ్రాయీమీయులు సాయము చేయలేని

               వారివద్దకు సాయముకొరకు

               పోయిరిగాన పీడనమునకు గురియైరి.

               న్యాయముగా తమకు చెందియున్న

               భూమిని కోల్పోయిరి.

12.          నేను ఎఫ్రాయీమునకు

               చెదపురుగువిం వాడనగుదును.

               యూదా ప్రజకు

               కొరుకుడు పురుగువిం వాడనగుదును.

అన్యదేశముతో పొత్తు అనర్థదాయకము

13. ఎఫ్రాయీము తన జబ్బును తెలిసికొనెను.

               యూదా తన గాయములను గమనించెను.

               ఎఫ్రాయీము అస్సిరియాకు పోయి

               ఆ దేశపు  రాజైన యారేబును సాయమడిగెను.

               కాని అతడు వారి వ్యాధిని

               నయము చేయలేకపోయెను.

               వారి గాయములను మాన్పలేకపోయెను.

14. నేను సింహమువలె

               యిస్రాయేలీయుల మీదికి దూకుదును.

               కొదమసింగమువలె

               యూదాజనుల మీదికి లంఘింతును.

               వారిని ముక్కలు ముక్కలుగా

               చీల్చి వెళ్ళిపోవుదును.

               నేనాజనులను ఈడ్చుకొని పోవుదును.

               ఎవరును వారిని రక్షింపజాలరు.

15.          నా ప్రజలు తమ పాపములకు

               తగిన శ్రమలనుభవించి,

               నన్ను వెదకుకొనుచు వచ్చువరకును

               నేను వారిని విడనాడి

               నా తావునకు వెళ్ళిపోవుదును.

               వారు తమ బాధలోనైన

               నా కొరకు గాలింపవచ్చును.

Previous                                                                                                                                                                                                     Next