30 1. నేను పేర్కొనిన దీవెనలు, శాపములు నెరవేరి మీరు వివిధజాతులమధ్య చెల్లాచెదరైనపుడు ఈ సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

2. మీరు, మీ సంతానము, నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలకు పూర్ణముగా బద్ధులై, ప్రభువునొద్దకు పూర్ణహృదయము తోను, పూర్ణఆత్మతోను మరలివత్తురేని, 3. ప్రభువు మీ మీద దయచూపును. ప్రభువు మిమ్ము వివిధ జాతుల మధ్య చెల్లాచెదరు చేసెనుగదా! అచి నుండి మిమ్ము మరల తోడ్కొనివచ్చును. మీరు మరల అభివృద్ధి చెందునట్లు చేయును.

4. మీరు మిన్నులు పడ్డచోట చెల్లాచెదరైయున్నను, ప్రభువు అచినుండి గూడ మిమ్ము తోడ్కొనివచ్చును.

5. ఆయన మీ పితరులు స్వాధీనము చేసికొనిన నేలకు మిమ్మును కొనిపోవును. మీరు ఆ దేశమును వశము చేసి కొందురు. ప్రభువు మీ పితరులకంటె గూడ మిమ్ము అధిక సంపన్నులను, అధికసంఖ్యాకులను చేయును.

6. ప్రభువు మీకును, మీ సంతానమునకును విధేయాత్మకములైన హృదయములనొసగును. మీరు ఆయనను పూర్ణహృదయముతో, పూర్ణఆత్మతో ప్రేమింతురు. ఆ నేలమీద చిరకాలము జీవింతురు.

7. మిమ్ము ద్వేషించి పీడించు శత్రువుల మీదికే ప్రభువు ఈ శాపములన్నియు దిగివచ్చునట్లు చేయును.

8. కనుక మీరు మరల ఆయనకు విధేయులగుదురు. నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలెల్ల పాింతురు.

9. ప్రభువు మీ కార్యములెల్ల సఫలముచేసి మిమ్ము పెంపొందించును. మీకు చాలమంది పిల్లలు, చాల మందలు కలుగును. మీ పొలములు సమృద్ధిగా ఫలించును. ఆయన మీ పితరులపట్ల సంతోషించి వారిని పెంపొందించినట్లే, మీ యెడల సంతృప్తి చెంది మిమ్మును కూడ పెంపొందించును.

10. మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింప బడిన ఆయన ఆజ్ఞలనెల్ల పాించి పూర్ణ హృదయము తోను, పూర్ణఆత్మతోను ఆయన యొద్దకు మరలి వత్తురేని పై దీవెనలెల్ల బడయుదురు.

11. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిదికాదు.

12. అదెక్కడనో ఆకాశమున ఉన్న్టిది కాదు. కనుక ”మేము ఆ శాసనమును విని పాించుటకు ఎవరు ఆకాశమున కెక్కి పోయి దానిని ఇచటకు కొనివత్తురు?” అని మీరు అడుగనక్కరలేదు.

13. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్న్టిది కాదు. కనుక ”మేము ఆ శాసనమును విని పాించుటకు ఎవరు సముద్రములు దాిపోయి దానిని ఇచటకు కొనివత్తురు?” అని మీరు అడుగ నక్కరలేదు.

14. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనము పాింపుడు.

రెండు మార్గాలు

15. జీవమును మేలును, కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను.

16. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలు పాింతు రేని, ఆయనను ప్రేమించి, ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్ల నెరవేర్తురేని, మీరు పెంపు చెంది పెద్దజాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసికొనబోవు నేలమీద ప్రభువు మిమ్ము దీవించును.

17-18. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని, తప్పక నశింతురని నేడు నేను నొక్కివక్కాణించు చున్నాను. మీరు యోర్దానుకు ఆవలివైపున స్వాధీనము చేసికొనబోవు నేలమీద కూడ ఎక్కువకాలము జీవింప జాలరు.

19. ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష ్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణ మును, ఆశీస్సును శాపమును మీ యెదుట నుంచితిని. కనుక జీవమునెన్నుకొని మీరును, మీ సంతానమును బ్రతికిపొండు.

20. మీరు ప్రభువును ప్రేమింపుడు. ఆయనకు విధేయులుకండు. ఆయనయే మీకు జీవన మని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదు నని వాగ్ధానము చేసిన నేలమీద, మీరు చిరకాలము జీవింతురు.”

Previous                                                                                                                                                                                               Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము