26 1. ఎండ కాలమునకు మంచును,
పంటకాలమునకు వానయు తగనట్లే
మూర్ఖునకు గౌరవమర్యాదలు తగవు.
2. దోషులుకానివారి మీద కురిపించిన
శాపవచనములు దాిపోవు పిచ్చుకలు,
వాన కోవెలలవలె ఎగిరిపోవునేగాని హానిచేయవు.
3. గుఱ్ఱమునకు కొరడా, గాడిదకు కళ్ళెము,
మూర్ఖుని వీపునకు బెత్తమవసరము.
4. మూర్ఖుడడిగెడి మూర్ఖపు ప్రశ్నలకు
జవాబు చెప్పకూడదు.
చెప్పినచో మనమును వానివిం
వారలము అగుదుము.
5. మూర్ఖుడడిగెడి వెఱ్ఱి ప్రశ్నలకు
వెఱ్ఱి జవాబులనే చెప్పవలయును. లేకున్నచో
వాడు తాను తెలివైనవాడననుకొని విఱ్ఱవీగును.
6. మూర్ఖుని దూతగా పంపువాడు తనకుతానే
కాళ్ళు విరుగగొట్టుకొని విషము గ్రోలినట్లు.
7. కుింవాడు తన కాళ్ళను వినియోగించుకోలేనట్లే
మూఢుడు సుభాషితమును ఉపయోగించుకోలేడు.
8. మూర్ఖుని పొగడుట ఒడిసెలలో
రాతిని గ్టిగ బిగించుట వింది.
9. మూర్ఖుని నోట సుభాషితము
త్రాగుబోతు చేతికి ముల్లు గ్రుచ్చుకొనినట్టులు.
10. మూర్ఖుని వినియోగించుకొను యాజమానుడు
దారిన పోవువారినెల్ల
బాణములతో కొట్టు విలుకాని వింవాడు.
11. కుక్క తాను కక్కిన కూికివలె,
మూర్ఖుడు తన మూర్ఖపు పనులకు మరలును.
12. నేను తెలివికలవాడను అనుకొను వానికంటె
తిక్కలవాడు మెరుగు.
13. సోమరిపోతు ”దారిలో సింహమున్నది,
వీధిలో సింహమున్నది” అని పలుకును.
14. తలుపు తన బందులమీద తిరిగినట్లే
సోమరిపోతును పడుకమీద దొర్లును.
15. సోమరిపోతు కంచములో చేయిపెట్టును కాని,
అన్నమునెత్తి నోటబెట్టుకొనుట కష్టమనుకొనును.
16. సహేతుకముగా జవాబుచెప్పు
జ్ఞానులు ఏడుగురికంటె,
సోమరిపోతు తానధికుడను అనుకొనును.
17. ఇతరుల తగవులలో తలదూర్చుట
దారినబోవు కుక్క చెవులను పట్టుకొనుట వింది.
18-19. పొరుగువానిని మోసగించి
నవ్వులాటకు అటుల చేసితినిలే అనెడివాడు
మరణప్రదమైన బాణములను, నిప్పుకొరవులను
విసరెడి పిచ్చివానితో సమానము.
20. కట్టెలు లేనిచో మంటలారిపోవును.
కొండెగాడు లేనిచో కలహములు అంతరించును.
21. నిప్పులకు బొగ్గులు, మంటలకు కట్టెలు,
జగడములకు కలహప్రియుడును అవసరము.
22. కొండెగాని పలుకులు రుచిగల పదార్థములవలె
శ్రోతలకు సులువుగా మ్రింగుడుపడును.
23. దుష్టహృదయుని పెదవులు రంగుపూసిన
మ్టికుండవలె బయికి నిగనిగలాడును.
24. కపాత్ముడు తన హృదయములోని ద్వేషమును
ఇచ్చకపు మాటలతో కప్పివేయును.
25. అి్టవాని మాటలు సొంపుగావున్నను
వానిని నమ్మకూడదు.
అతడి యెదలో దుష్టత్వము
గూడుకట్టుకొనియుండును.
26. అతడు తన ద్వేషమును
మోసముతో కప్పిపుచ్చవచ్చుగాక!
వాని దుష్కార్యములను మాత్రమెల్లరును గ్రహింతురు
27. ఎవడు త్రవ్విన గోతిలో వాడే పడును.
ఎవడు దొర్లించిన రాయి వానిమీదికే దొర్లును.
28. ఎవనికి కల్లలు చెప్పుదుమో
వానిని ద్వేషించినట్లు.
ముఖస్తుతి మాటలు వినాశనమునే తెచ్చిపెట్టును.