నాల్గవ దర్శనము – పండ్లగంప

8 1. సర్వోన్నతుడైన ప్రభువు నాకు ఇంకొక దర్శనము చూపించెను. నేనొక పండిన వేసవికాలపుపండ్ల గంపను చూచితిని.

2. ప్రభువు ”ఆమోసూ! నీకేమి కనిపించు చున్నది?” అని నన్నడిగెను. నేను ”పండిన వేసవికాల పుపండ్లగంప” అని చెప్పితిని. ఆయన ఇట్లనెను: ”నా ప్రజల అంతము వచ్చియేయున్నది.  నేనిక మనసు మార్చు కొనను, వారిని శిక్షింపక దాిపోను.

3. ఆ దినమున దేవాలయమునందలి పాటలు శోకగీతములుగా మారును. ఎల్లెడల శవములు కనిపించును. ప్రతి స్థలమందు అవి పారవేయబడును. మౌనము వహింపుడు!”

మోసగాండ్రు, దోపిడికాండ్రు

4.           దీనుల తలమీద కాలుమోపుచు

               పేదలను నాశనము చేయువారలారా – వినుడు!

5.           అమావాస్య ఎప్పుడు ముగియును?

               మనము ధాన్యము అమ్ముకోవలెనుగదా!

               విశ్రాంతి దినమెప్పుడు దాిపోవును?

               మనము మరల గోధుమలను అమ్ముకోవలెనుగదా!

               అప్పుడు మనము కొలమానములను

               తగ్గింపవచ్చును.  తూకములను హెచ్చింపవచ్చును.

               దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును.

6.           తాలు గోధుమలను గూడ

               ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును.

               బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పులజోడు వెలకూడ చెల్లింపలేని

               దరిద్రులను కొనవచ్చును.

               అట్లే చచ్చుధాన్యమును కూడా

               అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు.

7.            కాని యిస్రాయేలు దేవుడైన ప్రభువు

               ఇట్లు బాస చేసెను:

               నేను వారి పాపకార్యములను విస్మరింపను.

8.           వారి చెయిదములకుగాను నేలదద్దరిల్లును.

               దేశములోని ప్రజలెల్ల శోకింతురు.

               దేశమెల్ల అతలాకుతలమై నైలునదివలె

               ఆటుపోటులకు గురియగును”.

అంధకారము, విలాపము

9.           సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు:

               ఆ దినము మిట్టమధ్యాహ్నమే ప్రొద్దుక్రుంకగా

               పట్టపగలే నేలపై

               చీకట్లు అలుముకొనునట్లు చేయుదును.

10.         నేను మీ ఉత్సవములను

               అంత్యక్రియలుగా మార్చెదను.

               మీ పాటలను శోకగీతములుగా చేసెదను.

               అందరిని మొలలమీద

               గోనెపట్ట కట్టుకొన చేసెదను.

               అందరి తలలు బోడి చేసెదను.

               తల్లిదండ్రులు తమ ఏకైకపుత్రుని

               మృతికి విలపించినట్లే మీరు కూడ శోకింతురు.

               దాని అంత్యదినము

               ఘోరమైన శ్రమదినముగా ఉండును.

ప్రభువు వాక్కునకే కరువు

11. సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు:

               నేను దేశముమీదికి కరువును

               పంపుకాలము వచ్చుచున్నది.

               అది కూికి, నీికి కలుగు కరువుకాక,

               ప్రభువు వాక్కును

               వినకపోవుటయను కరువు వచ్చును.

12.          ప్రజలు ఈ సముద్రమునుండి

               ఆ సముద్రము వరకును,

               ఉత్తరమునుండి తూర్పు వరకును

               ఇటునటు తిరుగాడుచు

               ప్రభువు సందేశము కొరకు గాలింతురు.

               కాని అది వారికి లభింపదు.

13.          ఆ దినమున బలముగల యువతీయువకులు

               గూడ దప్పికవలన సొమ్మసిల్లిపోవుదురు.

14.          సమరియా విగ్రహముల

               పేరుమీద బాసచేయువారును,

               దాను దేవత పేరుమీద    

               ప్రమాణము చేయువారును

               బేర్షెబా దైవము పేరుమీద

               ఒట్టుపెట్టుకొనువారును,

               నేలపై కూలి మరల పైకి లేవకుందురు.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము