ఉపోద్ఘాతము:

పేరు: జెఫన్యా అను పదమునకు ”యావే దాగుకొనెను” అని అర్థము. జెఫన్యా మనష్షే ఆకృత్యాలనుండి దాచబడుటను ఇది సూచించును.  ఇతడు హిజ్కియారాజు సంతతివాడు, మనష్షేరాజు పాలన చివరిరోజులలో ప్టుివుండును. 

కాలము: క్రీ.పూ. 630. (1:1). యిర్మీయాకు సమకాలీకుడు.

రచయిత: జెఫన్యా.

చారిత్రక నేపథ్యము:  హిజ్కియా మరణానంతరము అతని కుమారుడు మనష్షే యూదాను  క్రీ.పూ. 687-642 వరకు పాలించాడు. ఇతని కాలములో యూదారాజ్య భ్రష్టత్వము పరాకాష్ఠకు చేరినది. స్వతంత్య్ర రాజ్యమే అయినప్పికిని అస్సిరీయ రాజ్యమునకు అమ్ముడుపోయినది. మనష్షే అన్యదేవతలకు బలిపీఠాలు క్టించి పూజలు చేయించెను. నక్షత్ర పూజతో బాటు నరబలిని కూడ ప్రోత్సహించెను. దీని ఫలితంగా ప్రజలు శ్రమలనెదుర్కొనిరి. యెరూషలేములో నిరపరాధుల రక్తము వెల్లువలై పారెను (2 రాజు. 21:16). మనష్షే కుమారుడైన ఆమోను కూడా అదే దారిపట్టెను (2 రాజు. 21:19-24). ఇతడిని అతని కొలువువాండ్రే హతమార్చిరి. ఆమోను పిదప యోషీయా (క్రీ.పూ. 640 -609) రాజైన పిదప పరిస్థితుల్లో మార్పు వచ్చినది.  అతడు ప్రజలకు ఆశాజ్యోతిగా కనిపించెను. యూదుల రాజకీయ, మతచరిత్రలో కొన్ని సంస్కరణలు జరిగినవి. యోషీయా పాలనలో జెఫన్యా ప్రోద్భలము వలన జరిగిన సంస్కరణలు ఈ కోవకు చెందును.

ముఖ్యాంశములు: జెఫన్యా గ్రంథము ప్రజలమీద కురిపించే ఉగ్రత, శాపవచనాల సముదాయముగా కనిపించును. కాని గ్రంథము చివరన హేబ్రీయుల మీద ఈ శాపమేఘాలు తొలగి దీవెనలు కురవడము చూడగలము. ‘ప్రభువు దినము’ అనే పదాన్ని జెఫన్యా ప్రవక్త ఎక్కువగా వాడెను. యావే కోపాగ్నిని గూర్చి తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరించెను (2:3). యెరూషలేము పతనాన్ని గురించి, రానున్న మెస్సయా కాలములో యిస్రాయేలీయుల పునరావాసము గురించి కూడా జెఫన్యా ప్రవచించెను.

క్రీస్తుకు అన్వయము: క్రీస్తు నూతననిబంధనలో రెండుమార్లు జెఫన్యా ప్రవచనాలను గుర్తుచేస్తారు (1:15- మత్త. 24:29; 3:12, మత్త.5:4). ఈ రెండు పఠనాలు క్రీస్తు రెండవ రాకడను సూచించును. 3:9 లో కూడా మెస్సియా గూర్చిన పరోక్ష ప్రస్తావన చూడగలము. ప్రజలకు అభయమొసగే వచనాలను ఈ గ్రంథములో చూడగలము (3:15).

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము