ఏడవయేడు

15 1. ప్రతి ఏడవయేి తరువాత మీరు ప్రజల ఋణముల రద్దుకు గడువీయవలయును.

2. ఆ గడువు నియమములు ఇవి: తన పొరుగువానికి అప్పు ఇచ్చిన ప్రతివాడు దానికి గడువీయవలయును. ఇది యావేకు గడువు అనబడును. కనుక అప్పిచ్చినవాడు అప్పుతీసుకొనినవానిని నిర్భంధింపరాదు.

3.కాని అప్పుతీసుకొనిన పరదేశీయుని నిర్భంధింపవచ్చును. కాని నీ సహోదరునొద్దనున్న దానిని విడిచిపెట్టవల యును.

4-5. ప్రభువు తాను మీకీయనున్న నేలమీద మిమ్ము దీవించును. మీరు ప్రభువు మాటవిని ఈనాడు నేను మీకు విధించిన ఆజ్ఞలనెల్ల పాింతురేని ఇక మీలో పేదలు అనువారు ఉండబోరు.

6. ఆయన తాను మాట యిచ్చినట్లే మిమ్ము దీవించును. అప్పుడు మీరు పలుజాతులకు ఋణదాతలు అగుదురుగాని ఎవరికిని ఋణగ్రస్తులుకారు. పలుజాతులను మీరు ఏలుదురుగాని ఎవరును మిమ్ము ఏలజాలరు.

7. ప్రభువు మీకు ఈయనున్న దేశమునందలి నగరములలో తోియిస్రాయేలీయులలో పేదవాడు ఎవడైనను ఉన్నచో మీరు హృదయములను కఠినము చేసికొనక అతనికి సాయము చేయుడు.

8. ఉదార బుద్ధితో అతని అక్కరలు తీర్పుడు.

9. బాకీలు రద్దగు ఏడవ యేడు వచ్చినదన్న నీచభావముతో అతనిని చిన్నచూపు చూచి సహాయముచేయ నిరాకరింపకుడు. అతడు మీమీద ప్రభువునకు మొరప్టిెనచో మీరు దోషులుగా గణింపబడుదురు. అది నీకు పాప మగును.

10. ఎి్ట మనోవిచారమును లేక మీరు ఉదారబుద్ధితో పేదవానికి సాయము చేయుదురేని మీ కార్యములన్నిని ప్రభువు దీవించును.

11. దేశమున పేదలేమో ఎప్పుడును ఉందురు. కనుక పేదసాదలైన తోిజనులకు ఉదారబుద్ధితో సాయము చేయుడని మిమ్మాజ్ఞాపించుచున్నాను.

బానిసలను చూడవలసిన తీరు

12. తోియిస్రాయేలీయుడు, పురుషుడుగాని, స్త్రీగాని మీకు బానిసగా అమ్ముడుపోయినచో ఏడవ యేడు అతనిని దాస్యమునుండి విడిపింపవలయును.

13. నీ ఇంినుండి వెడలిపోవునపుడు అతనిని వ్టి చేతులతో పంపరాదు.

14. నీ మందల నుండియు, ధాన్యమునుండియు, ద్రాక్ష సారాయము నుండియు అతనికి ఉదారముగా పాలిభాగమిమ్ము. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినట్లే నీవును అతనిని ఆదుకొనుము.

15. పూర్వము మీరు ఐగుప్తున బానిసలై ఉండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనుగదా! కనుకనే నేడు నేను మీక్టి ఆజ్ఞనిచ్చితిని.

16. కాని ఆ బానిసకు నీపట్ల నీ కుటుంబము పట్ల ఇష్టము పుట్టవచ్చును. అతడు నీ ఇంో్ల ఉండుటకు ఇష్టపడవచ్చును.

17. అప్పుడు అతనిని మీ ఇంితలుపు చెంతకు తీసికొనిపోయి కదురుతో వాని చెవిని గ్రుచ్చుడు. ఇక అతడు జీవితాంతము నీకు బానిసయగును. బానిసరాలకు కూడ ఇట్లే చేయుడు.

18. మీరు ఏ బానిసనైనను స్వేచ్ఛతో పంపి వేయవలసివచ్చినపుడు అనిష్టముతో సణుగుకొనకుడు. అతడు ఆరేండ్లపాటు కూలివానికంటె రెండంతలు అదనముగా నీకు చాకిరిచేసెను. కనుక మీరు అతనిని వెళ్ళిపోనిత్తురేని ప్రభువు మీ కార్యములను దీవించును.

తొలిచూలు పిల్లలు

19. మీ మందలలో ప్టుిన ప్రతి తొలిచూలు పోతును ప్రభువునకు అర్పింపుడు. అది కోడెదూడ అయినచో దానిని సేద్యమునకు వాడరాదు. గొఱ్ఱెపిల్ల అయినచో దాని ఉన్నిని కత్తిరించుకోరాదు.

20. ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలమున ఏటేట వానిని కుటుంబసమేతముగా ఆరగింపుడు.

21. ఆ పశువులకు ఏదైన లోపమున్నచో, అనగా అవి కుింవి, గ్రుడ్డివి, లేక మరి ఏదైన అవలక్షణము గలవి అయినచో, వానినసలు దేవునికి అర్పింపరాదు.

22. మీ ఇంిపట్టుననే, శుద్ధిచేసికొనిగాని, చేసికొనక గాని, జింకనో, దుప్పినో భుజించినట్లుగా వానిని ఆరగింపుడు.

23. వానినెత్తురు మాత్రము ముట్టు కొనక నేలమీద నీినివలె కుమ్మరింపుడు.

Previous                                                                                                                                                                                                        Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము