నాతాను ప్రవచనము

7 1. దావీదు తన నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహమువలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరును అతనిని బాధింపరైరి.

2. అతడు నాతాను ప్రవక్తతో ”నేను దేవదారు ప్రాసాద మున వసించుచున్నాను. ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది” అనెను.

3. ప్రవక్త అతనితో ”నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము. ప్రభువు నీకు తోడైయుండును” అని చెప్పెను.

4. కాని ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను.

5. ”నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఈ విధమున సెలవిచ్చుచున్నాడని చెప్పుము. ‘నీవు నేను నివసించుటకు ఒక మందిర మును నిర్మింతువా?’

6. నేను యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చిన నాినుండి నేి వరకు గుడారమున పయనించుచు వచ్చితినేకాని మందిరమున వసించితినా?

7. నేను యిస్రాయేలీ యులకు అధిపతులనుగా నియమించిన తెగనాయకు లతో నాకు దేవదారు మందిరము నిర్మింపరైతిరి గదాయని నా సంచారములందెన్నడైన పలికియుింనా?

8. కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతియగు యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొఱ్ఱెలు కాచుకొను చుండగా నేను నిన్ను కొనివచ్చి నాప్రజలైన యిస్రాయేలీ యులకు నాయకుని చేసితిని.

9. నీవు శత్రువులమీదికి పోయినపుడెల్ల నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతేర్చితిని. భూమిమీది మహారాజులకెంతి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతి ప్రసిద్ధి లభించునట్లు చేసితిని.

10. నా ప్రజలైన యిస్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని. వారినటనెలకొల్పెదను. నా జనులు తమతావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పివలె దుర్మార్గులగు శత్రువులు వారిమీదికి ఒంికాలిమీద ఇకరారు.

11. నేను నిన్ను శత్రువుల బారినుండి తప్పింతును. నేనే నీకొక ఇంిని నిర్మింతును.5 

12. నీవు రోజులునిండి నీ పితరులను కలిసికొనిన పిమ్మట నీ మేనినుండి వెలువడిన తనయునే నా రాజ్య మునకు అధిపతిని చేసెదను. అతని యేలుబడిని ధ్రువ పరచెదను.

13. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచె దను.

14. నేను అతనికి తండ్రినయ్యెదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసెనేని, నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును.

15. నిన్ను నియమించుటకై మునుపు నేను కరుణింపక నిరాకరించిన సౌలునకువలె గాక అతనికి నా కృపను ఎల్లప్పుడు చూపుదును.

16. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలమనును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును.”

17. ఈ రీతిగా దేవుడు దర్శనమున తెలియజేసిన సంగతులనన్నిని నాతాను దావీదునకు ఎరుకపరచెను.

దావీదు ప్రార్థన

18. అపుడు దావీదురాజు డేరాలోనికి ప్రవేశించి యావే ఎదుట కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. ”ప్రభూ! నీవు నన్నింతగా పెద్ద చేయుటకు నేనేపాివాడను? నా కుటుంబము ఏపాిది?

19. అయినను నీ దృష్టికి ఇదేమియు గొప్పగాదు. నీ వాగ్ధానము పెక్కు తరముల వరకు ఈ సేవకుని కుటుంబమునకు వర్తించును.6

20. నీవు ఈ సేవకుని కరుణించితివి. ఇక నేను విన్నవించుకో తగ్గదేమున్నది?

21. నాకు ఘనత కూర్పనెంచియేగదా ఇంతివానిని చేసితివి! నీ సంకల్పము నెరవేర్చుకొింవి.

22. కనుకనే నీవు మహాదేవుడవు. నీవింవాడేడి? నీవుతప్ప వేరొకదేవుడు లేనేలేడని మా పెద్దలవలన వింమి. అది ముమ్మాికి నిజమే.

23. యిస్రాయేలీయులు నీ ప్రజలు. నీవు వారిని తరలించుకొని వచ్చితివి. నీ స్వంత ప్రజలుగా చేసి కొింవి. వారి తరపున మహాకార్యములు చేసి గొప్ప పేరు తెచ్చుకొింవి. వారిని ఎదిరించు శత్రుజాతు లను, ఆ జాతుల దైవములను తరిమివేసితివి. భూమిపై నీ ప్రజలవిం ప్రజలింకెవరైనను ఉన్నారా? 

24. ఈ జనులను కలకాలమువరకు నీ వారినిగా ఎన్నుకొింవి. నీవే వీరికి దేవుడవైతివి.

25. ప్రభూ! నీ యీ సేవకునకు, ఇతని కుటుంబమునకు నీవు చేసిన వాగ్ధానమును యుగయుగములవరకు నిల బెట్టుకొనుము. నీవుచెప్పిన ప్రకారమే చేయుము.

26. సైన్యములకధిపతియగు యావే యిస్రాయేలీయుల దేవుడని ప్రజలు నిన్ను ఎల్లప్పుడును సన్నుతింతురు గాక! నీ సేవకుడు దావీదు కుటుంబము నీ ప్రాపున కలకాలము నిలుచును.

27. సైన్యములకధిపతివై, యిస్రాయేలీయుల దేవుడవైన నీవే ‘నేను నీకొక మందిరమును నిర్మింతును’ అని ఈ దాసునకు తెలియ పరచితివి. కనుకనే నేడు నీ ఎదుట నేను ఈ ప్రార్థన చేయసాహసించితిని.

28. ప్రభూ యావే! నీవు యథార్థ ముగా దేవుడవు. నీ పలుకులు పరమసత్యములు. నీ సేవకుని గూర్చి ఈ మేలిమాట పలికితివి.

29. కావున నీవు ఈ దాసుని వంశమును దీవింతువేని నా కుటుంబమువారు కలకాలము నీ ఎదుట బ్రతికి పోవుదురు. ప్రభూ! నీవు మాట ఇచ్చితివి. ఇక, నీ దీవెనవలన ఈ దాసునివంశము సదా వర్ధిల్లుగాక!”

Previous                                                                                                                                                                                                   Next