పండుగలు

23 1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీ  యులతో ఇట్లుచెప్పుమనెను: ”ప్రభువు పండుగను, నియమితదినములను కొనియాడుటకు ప్రోగైన జను లెల్లరును పవిత్రసమాజముగా ఒనగూడుదురు. నా పండుగలు ఇవి:

1. విశ్రాంతిదినము (సబ్బాతు)

3. మీరు ఆరునాళ్ళు శ్రమించి పనిచేయ వచ్చును. కాని ఏడవనాడు విశ్రాంతిదినము. ఆనాడు పనిచేయకుడు. ఆరాధనమునకు సమావేశముకండు. మీరు ఎచట వసించుచున్నను, ఆ దినమును ప్రభువు నకు చెందినదానినిగా భావింపుడు.

4. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశ మునకై ప్రకింపుడు.

2. పాస్క, పొంగని రొట్టెల పండుగలు

5. మొదినెల పదునాలుగవనాి సాయంత్రము పాస్క పండుగ ప్రారంభమగును.

6. అదే నెల పదునైదవనాడు పొంగని రొట్టెలపండుగ మొదలగును. ఏడుదినముల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు.

7. మొదిరోజున ప్రజలను ఆరాధనమునకు ప్రోగుజేయుడు. ఆనాడు మీరు జీవనోపాధికైన ఏ పనియుచేయకూడదు.

8. ఏడుదినములపాటు దహనబలులు అర్పింపుడు. ఏడవ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆదినమున మీ జీవనోపాధికైన ఏ పనియుచేయరాదు.”

3. తొలి వెన్నులు (ప్రథమఫలముల పండుగ)

9-10. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను: ”ప్రభువు మీకు ఈయనున్న దేశము చేరుకొని, అచట పంటకోయునపుడు, తొలి వెన్నులను యాజకునిచెంతకు కొనిపొండు.

11. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతిదినమునకు మరుసినాడు యాజకుడు ఈ కానుక అర్పించును.

12. ఈ ధాన్యమును అర్పించు రోజుననే అవలక్షణములులేని ఏడాది ఈడుగల పొట్టేలును దహనబలిగా అర్పింపుడు.

13. దానితోపాటు రెండు కుంచముల గోధుమపిండిని నూనెతో కలిపి దహనబలిగా అర్పింపుడు. దాని సువాసనవలన ప్రభువు సంప్రీతుడగును. మరియు ముప్పావుబుడ్డి ద్రాక్ష సారాయము కూడ అర్పింపుడు. 14. ఈ బలులన్నింని సమర్పించువరకు మీరు క్రొత్తధాన్యమును రొట్టెగా చేసికొని, పచ్చిగాగాని, వేయించిగాని భుజింపరాదు. మీరు ఎచట నివసించి నను, మీ వంశజులెల్లరును ఈ నియమములను కలకాలము పాింపవలయును.

4. వారముల పండుగ (పెంతెకోస్తు పండుగ)

15. విశ్రాంతిదినమున తరువాతినాడు వెన్నులు అర్పింతురుగదా! ఆ వెన్నులు అల్లాడింపు అర్పణగా సమర్పించిన రోజునుండి ఏడువారములు లెక్క పెట్టుడు.

16. అటుల ఏడు విశ్రాంతిదినములు గడచినపిదప ఏబదియవనాడు ప్రభువునకు నూతన ధాన్యబలిని అర్పింపుడు.

17. ప్రతి కుటుంబము రెండు రొట్టెలుకొని వచ్చి ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పింప వలయును. ఒక్కొక్క రొట్టెను రెండు కుంచముల గోధుమపిండితో పులిసిన ద్రవ్యము కలిపియే తయారు చేయవలయును. ఇవి ఆ యేి పంటలోని ప్రథమ ఫలమునుండి  తయారైన రొట్టెలు.

18. మీరు ఈ రొట్టెలతో పాటు ఏడాది ఈడుగల ఏడుగొఱ్ఱెపిల్లలను, ఒక కోడెదూడను, రెండు పొట్టేళ్ళను దహనబలిగా అర్పింపవలయును. వీనికి అవలక్షణములు ఏమియు ఉండరాదు. ఇంకను ధాన్యబలిని, ద్రాక్షసారాయబలిని కూడ అర్పింపవలయును. ఈ దహనబలి సువాసన వలన ప్రభువు సంతృప్తుడగును. 19. ఇదే సమయ మున పాపపరిహారారబలిగా ఒక మేకపోతును, సమాధానబలిగా ఏడాదిఈడుగల రెండుగొఱ్ఱెపిల్లలను కూడ అర్పింపుడు.

20. తొలివెన్నులతో చేసిన రొట్టెలతోపాటు యాజకుడు వానిని కూడ ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పించును. ఈ రొట్టెలు, ఈ రెండు గొఱ్ఱెపిల్లలు పవిత్రనైవేద్యములు. అవి యాజకులకే చెందును.

21. ఆ దినమున మీ జీవనోపాధియైన ఏ పనియు చేయకుడు. ఆరాధనకై ప్రజలెల్లరు ప్రోగుకండు. మీ వంశజులు ఎచటవసించుచున్నను ఈ నియమమును కలకాలము పాింపుడు.  

 22. మీరు పొలమున పండిన పంట కోయునపుడు, గట్టువరకు కోయకుడు. తప్పిపోయిన వెన్నులను కోయుటకు మరల వెనుకకుపోవలదు. పేదలకొరకు, పరదేశులకొరకు ఆ పరిగలను వదిలి వేయుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

5. ఏడవనెల మొదినాడు బూరల పండుగ

23-24. ప్రభువు మోషేను యిస్రాయేలీయు లతో ఇట్లు చెప్పుమనెను: ”ఏడవనెల మొదినాడు మీరు విశ్రాంతిదినమును పాింపవలయును. బూరలు ఊదినపుడు ప్రజలెల్లరు ఆరాధనమునకు ప్రోగుకండు.

25. ఆనాడు మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు. ప్రభువునకు దహనబలి అర్పింపుడు.”

6. ప్రాయశ్చిత్తదినము

26. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను: 27. ”ఈ ఏడవనెల పదియవనాడు ప్రాయశ్చిత్తదినము. ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగు కండు. దహనబలిని అర్పింపుడు.

28. ఆ రోజున మామూలు పని ఏమియు చేయరాదు. మీ పాపము లను తొలగించుటకుగాను ఆనాడు దేవుని ఎదుట మీకు ప్రాయశ్చిత్తము జరుపబడును.

29. ఆ రోజు ఉపవాసము ఉండనివాడు సమాజమునుండి వెలి వేయబడును.

30. ఆ రోజున పనిచేసినవానిని ప్రజలలో లేకుండ నేను నాశనము చేయుదును.

31. మీ వంశజులు ఎచట వసించినను ఆ దినమున పని చేయకూడదను నియమము కలకాలము వర్తించును.

32. ఈ నెల తొమ్మిదవనాి సాయంత్రమునుండి పదియవనాి సాయంత్రము వరకు ఉపవాసము ఉండి విశ్రాంతి దినమును పాింపుము. అది మహా విశ్రాంతిదినము. ఈ దినము ఉపవాసము ఉండి పనిని విరమించుకొనుడు.”

7. గుడారముల లేక పర్ణశాలల పండుగ

33-34. ప్రభువు మోషేను యిస్రాయేలీయు లతో ఇట్లు చెప్పుమనెను. ”గుడారములపండుగ ఏడవనెల పదునైదవ రోజున ప్రారంభమై వారము రోజులపాటు కొనసాగును.

35. మీరు మొదిరోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు.

36. ఏడునాళ్ళపాటు ప్రభువునకు దహనబలులు అర్పింపుడు. ఎనిమిదవనాడు మరల ఎల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహనబలిని అర్పింపుడు. అది ఆరాధనరోజు కనుక ఆనాడు జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

ఉపసంహారము

37. ప్రభువు నియమించిన విశ్రాంతిదినము లతో పాటు మీరెల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవదినములు ఇవియే. ఈ తరుణమున ఆయాదినముల నియమిత పరిచర్య ననుసరించి దహనబలులు, సంపూర్ణదహనబలులు, ధాన్యబలులు, ద్రాక్షసారాయబలులు, సామాన్య బలులను అర్పింపవలయును.

38. ఇంకను మీరు మామూలుగా ఆచరించు విశ్రాంతి దినములు, సమర్పించు కానుకలు, స్వేచ్ఛార్పణలు, మ్రొక్కు చెల్లించు అర్పణలు మాత్రమేకాక పై ప్రత్యేకబలులు కూడ అర్పింపుడు.

గుడారముల పండుగ గూర్చిన ఇతరాంశములు

39. మీ పొలమున పండినపంటను కూర్చు కొనిన తరువాత, ఏడవనెల పదునైదవ రోజున ఈ ఉత్సవమును ప్రారంభించి ఏడునాళ్ళపాటు కొన సాగింపుడు. మొదినాడు, ఎనిమిదవనాడు విశ్రాంతి దినములు.

40. మొదినాడు మీ చెట్లమీద కాచిన మేలిపండ్లను, ఖర్జూరముల మట్టలను, గుబురు ఆకులుగల చెట్లకొమ్మలను, వాగులపక్కన పెరుగు చెట్లకొమ్మలను చేతబట్టుడు. ఏడుదినములపాటు ప్రభువుపేరిట ఉత్సవముచేసికొని ఆనందింపుడు.

41. ఈ రీతిగా మీరు ప్రతియేడు ఏడవనెల ప్రభువు పేరిట ఏడుదినములు పండుగ చేసికోవలయును. ఇది మీ వంశజులకు శాశ్వతనియమము కావలయును.

42. మీరు ఈ పండుగను ఏడవనెలలో జరుపు కోవలయును. అప్పుడు యిస్రాయేలీయులెల్లరు ఏడుదినములు పర్ణశాలలలో వసింపవలయును.

43. దీనివలన నేను మిమ్ము ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినపుడు మీరు పర్ణశాలలలో వసించితిరని మీ సంతతివారెల్లరును తెలిసికొందురు. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

44. ఈ రీతిగా మోషే యిస్రాయేలు ప్రజలు ప్రభువుపేరిట జరుపవలసిన ఉత్సవములగూర్చి తెలియజేసెను.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము