ప్రభువు అభిషేకించిన రాజు
2 1. ‘అన్యజనులు
ఏల కోపమున చెలరేగుచుండిరి?
వ్యర్థమైన విషయములను గూర్చి
జనులు ఏల యోచించుచుింరి?
2. ప్రభువును, అతడు అభిషేకించిన రాజును
ఎదిరించుటకుగాను
ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరును కలిసి
దురాలోచనలు చేయుచున్నారు:
3. ”మనము వారి బంధములను త్రెంపుదము.
వారి పాశములను మననుండి ఛేదింతము”
అని చెప్పుకొనుచున్నారు.
4. కాని ఆకాశమున సింహాసనాసీనుడైయున్న
ప్రభువు వారి మాటలువిని నవ్వును,
వారిని అపహాసము చేయును.
5. అతడు కోపముతో వారితో మ్లాడును.
తీవ్రఆగ్రహముతో
వారిని భయపెట్టుచు ఇట్లనును:
6. ”నా పవిత్ర పర్వతమైన సియోనుమీద
నేను నా రాజును
సింహాసనాసీనుని చేసియుింని.”
7. నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను.
ప్రభువు నాతో ఇట్లనెను:
”నీవు నా కుమారుడవు,
నేడు నేను నిన్ను కనియుింని.
8. నన్నడుగుము, నేను జాతులనెల్ల
నీకు ధారాదత్తము చేసెదను.
ఈ భూమండలమునెల్ల
నీకు స్వాధీనము చేసెదను.
9. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టుదువు. మ్టికుండవలె వారిని
ముక్కలుముక్కలు చేయుదువు.”
10. కనుక రాజులారా! మీరు వివేకులైయుండుడు.
భూపతులారా!
మీరు నా హెచ్చరికలు ఆలకింపుడు.
11. మీరు భయభక్తులతో గడగడలాడుచు
ప్రభువును సేవింపుడు.
అతని పాదములు ముద్దిడుకొనుడు.
12. లేదేని అతడు శీఘ్రముగా ఆగ్రహముచెందును.
మీరు మార్గమునుతప్పి నశించెదరు.
ఆ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు.