యిస్రాయేలీయులు కనానులో స్థిరపడుట

యూదా, షిమ్యోను, కాలెబు, కేనీయులు స్థిరపడుట

1 1. యెహోషువ చనిపోయిన తరువాత యిస్రా యేలీయులు యావేను సంప్రతించి ”కనానీయులతో పోరాడుటకు మాలో మొదట ఎవరిని పొమ్మందువు?” అని అడిగిరి.

2. యావే ”యూదీయులు1 మొదట యుద్ధమునకు పోవలయును. నేను ఆ దేశమును వారి వశముచేసెదను” అని చెప్పెను.

3. యూదీయులు షిమ్యోనీయులతో ”మీరు మా నేల మీదికివచ్చి మాతో పాటు కనానీయులతో పోరాడుడు. అటు తరువాత మేము మీ నేలమీదికి వచ్చి మీ పక్షమున పోరాడెదము” అనిరి.

4. కనుక షిమ్యోనీయులు యూదీయులతో దండువెడలిరి. కనానీయులమీదికి యూదీయులు పోయినపుడు యావే కనానీయులను, పెరిస్సీయులను వారివశము చేసెను. యూదీయులు బేసెకువద్ద శత్రు వులను పదివేలమందిని చంపివేసిరి.

5. అచటనే అదోనిసెదెకు అను రాజును ఎదిరించి అతనితో వచ్చిన కనానీయులను, పెరిస్సీయులను చెల్లాచెదరు చేసిరి.

6. అదోనిసెదెకు యుద్ధము నుండి పారిపోవు చుండగా యూదీయులు అతనిని వెాండి పట్టుకొనిరి. అతని కాలు చేతులందలి బొటనవ్రేళ్ళను కోసివేసిరి.

7. అదోనిసెదెకు ”నేను డెబ్బదిమంది రాజులకు బొటనవ్రేళ్ళు తీయించితిని. వారు నా భోజనశాలవద్ద పడియుండి నేను విసరివేసిన మెతుకులు తిని బ్రతుకు చున్నారు. నేను వారికి చేసినట్లే దేవుడు నాకును చేసెను” అనెను. యూదీయులు అతనిని యెరూషలేమునకు కొనివచ్చిరి. అతడు అచటనే చనిపోయెను.

8. యూదీయులు యెరూషలేమును ముట్టడించి పట్టు కొనిరి. పౌరులను కత్తివాదరకు ఎరజేసి నగరమును కాల్చివేసిరి.

9. అటుతరువాత యూదీయులు కొండలమీద, లోయలలో, ఎడారియందు వసించు కనానీయులతో యుద్ధము చేయబోయిరి. ఆ పిమ్మట హెబ్రోనున వసించు కనానీయులను ఎదిరించిరి.

10. అంతకు ముందు హెబ్రోనునకు కిర్యతార్బా అని పేరు. వారు షేషయి,  అహీమాను,  తల్మయీలను  ఓడించిరి.       

11. అచినుండి దెబీరుపై దాడివెడలిరి. దెబీరునకు  పాతపేరు కిర్యత్సేఫేరు.

12. కాలెబు ”కిర్యత్సేఫేరును ముట్టడించి పట్టుకొనిన వీరునికి నా కూతురు అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదను” అనెను.

13. కాలెబు చిన్న తమ్ముడగు కనసు కుమారుడు ఒత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలెబు అతనికి అక్సాను ఇచ్చి వివాహము చేసెను.

14. ఆమె కాపురమునకు వచ్చినపుడు ఒత్నీయేలు మీ తండ్రిని పొలమిమ్మని అడుగుమని ప్రోత్సహించెను. ఆమె గాడిదనుండి దిగి నిలచుండెను. కాలెబు ”తల్లీ! నీకేమి కావలయును?” అని అడిగెను.

15. అక్సా తండ్రితో ”నాయనా! నాకు ఒక వరమిమ్ము. నన్ను నేగేబు ఎడారిసీమకు పంపితివి. కనుక నీిబుగ్గలను కూడ దయచేయుము” అనెను. కాలెబు కుమార్తెకు ఎగువ నీిబుగ్గలను, దిగువ నీిబుగ్గలను ఇచ్చివేసెను.

16. మోషే మామ కేనీయుడు గదా! అతని సంతతి వారు యూదీయులతో పాటు ఖర్జూరముల నగరము నుండి వెడలిపోయి ఎడారియందలి అరదు వద్ద అమాలెకీయుల చెంత వసించిరి.

17. తరువాత యూదీయులు షిమ్యోనీయులతో దండువెడలి కనానీయుల సేఫాత్తును ముట్టడించి శాపముపాలు చేసిరి. అప్పి నుండి ఆ నగరమునకు హోర్మా అని పేరు వచ్చెను.

18. యూదీయులు గాజా, అష్కేలోను, ఎక్రోను పట్టణ ప్రదేశములను పట్టుకొనిరి.

19. యావే తోడ్పాటువలన యూదీయులు యూదా కొండ సీమలను జయించిరి. కాని మైదానములలో వసించు జనులకు ఇనుపరథములు ఉన్నందువలన వారిని వెళ్ళగొట్టలేకపోయిరి.

20. మోషే సెలవిచ్చినట్లే యిస్రాయేలీయులు హెబ్రోనును కాలెబునకు ఇచ్చిరి. అతడు అనాకు కుమారులు మువ్వురను అచినుండి తరిమివేసెను.

21. కాని బెన్యామీనీయులు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలగొట్టలేక పోయిరి. వారు నేడును బెన్యామీనీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు.

యోసేపు వంశీయులు స్థిరపడుట

22. యోసేపు వంశీయులు బేతేలు నగరము మీదికి యుద్ధమునకు పోయిరి. యావే వారికి తోడ్పడెను.

23. వారు బేతేలునకు వేగులవారిని పంపిరి. పూర్వము ఆ నగరము పేరు లూసు.

24. వేగుల వాండ్రు పురమునుండి వచ్చు నరునొకనిని చూచి ”మాకు నగరము ప్రవేశించు మార్గము తెలియ జేసెదవేని నిన్ను చంపక వదలివేసెదము” అనిరి.

25. అతడు వారికి త్రోవచూపెను. వేగులు పట్టణ మున ప్రవేశించి వీరులనందరిని కత్తివాదరకెరచేసిరి. త్రోవచూపిన నరుని, అతని కుటుంబమును మాత్రము వదలిరి.

26. ఆ నరుడు హిత్తీయుల మండలమునకు వెడలి పోయి అచ్చట ఒక నగరము నిర్మించి దానికి లూసు అని పేరు పెట్టెను. నేికిని దాని పేరు అదియే.

ఉత్తరదేశపు తెగలు స్థిరపడుట

27. మనష్షే వంశీయులు బేత్‌షెయాను, తానాకు, దోరు, యిబ్లెయాము, మెగిద్దో పట్టణములను వాని ప్రాంత గ్రామములను వశపరచుకోలేదు. ఆ ప్రాంతము లందు కనానీయుల ప్రాభవము చెల్లుచుండెను.

28. కాని యిస్రాయేలీయులు బలవంతులైన పిదప, కనానీయులను తరిమివేయక పోయినను వారిచే వ్టెి చాకిరిచేయించుకొనిరి.

29. ఎఫ్రాయీము వంశీయులు కనానీయులను గేసేరు నుండి తరిమివేయలేదు. గేసేరులో కనానీయులు వారి మధ్యన నివసించిరి.

30. సెబూలూను వంశీయులు కిత్రోను, నహలోను పట్టణవాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు సెబూలూను వంశీయుల మధ్య జీవించిరి. కాని వారికి వ్టెిచాకిరి చేసిరి.

31. ఆషేరు వంశీయులు అక్కో, సీదోను, అహ్లాబు, అక్సీబు, ఎల్బా, ఆఫెకు, రహొబు నగరవాసులను పారద్రోలలేదు.

32. ఆషేరు వంశీయులు ఆ ప్రాంతములందు వసించు కనానీయు లను వెడలగొట్టక వారిమధ్య నివసించిరి.

33. నఫ్తాలి వంశీయులు బేత్షెమేషు, బేతనాతు పౌరులను వెళ్ళ గొట్టలేదు. కాని ఆ పౌరులచే వ్టెిచాకిరి చేయించు కొనిరి.

34. అమోరీయులు దాను వంశీయులను కొండలలోనికి తరిమిక్టొి క్రింద మైదానమునకు రానీయకుండ అడ్డుపడిరి.

35. అమోరీయులు హరేసు, అయ్యాలోను నందలి హోరేసు కొండలోను, షాల్బీము మండలములలో వసింప గ్టి పట్టుప్టి యుండగా, యోసేపు కుటుంబమువారు వృద్ధి చెంది అమోరీయులను అణగద్రొక్కిరి. వారిచే వ్టెిచాకిరి  చేయించుకొనిరి.

36. అమోరీయుల పొలిమేర అక్రాబిమ్‌ కొండనుండి సేలా కొండమీది భాగముల వరకు వ్యాపించియుండెను.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము