ప్రభువుదినము

4 1. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లను చున్నాడు: ”ఏలయన నియమింపబడిన దినము వచ్చు చున్నది. కొలిమివలె మండుదినము రాబోవు చున్నది. ఆ రోజు గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె కాలిపోవు దురు.వారిలో వేరు అయినను, చిగురు అయినను లేకుండా పోవును.

2. కాని నాయెడల భయభక్తులుజూపు మీపై నీతిసూర్యుడు ఉదయించును. అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగజేయును. మీరుశాలలనుండి బయటకువచ్చి బీళ్ళకుపోవు లేగలవలెగంతులు వేయుదురు.

3. ఆ నియమిత దినమున మీరు దుష్టుల నణగద్రొక్కగా వారు మీ కాలిక్రింద ధూళివలె నగుదురు.

అనుబంధము

4. మీరు నా సేవకుడగు మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, యిస్రాయేలీయులందరును పాించు టకుగాను హోరేబు కొండపై నేనతనికిచ్చిన చట్ట ములను విధులను జ్ఞప్తియందుంచుకొనుడు.

5. ప్రభువు మహాదినము, ఘోరదినము రాక మునుపే నేను ఏలియా ప్రవక్తను మీయొద్దకు పంపు దును.

6.  నేను వచ్చి మీ దేశమును శపించి నాశనము చేయకుండునట్లు, అతడు తండ్రుల హృదయములను బిడ్డలవైపును, బిడ్డల హృదయములను తండ్రుల వైపును మరల్చును.”

Previous