దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసికొనుట

1. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రామునకు దర్శనమున ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవునిమాట వినబడెను. ”అబ్రామూ! భయపడకుము. నేను నిన్ను డాలువలె కాపాడెదను. నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను” అనెను.

2. అంతట అబ్రాము ”ప్రభూ! నీవు నాకేమి యీయగలవు? నేను సంతానములేని వాడనైతిని. దమస్కువాడయిన ఎలియెజెరే నా యిిింకి వారసుడు అగునుగదా!” అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను: 3. ”నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడు అగును.”

4. అంతట అబ్రామునకు దేవునిమాట ఇట్లు వినవచ్చెను: ”ఇతడు నీకు వారసుడు కాడు. నీకు  ప్టుినవాడే నీకు వారసుడు అగును.”

5. దేవుడు అబ్రామును వెలుపలికి తీసికొనివచ్చి ”ఆకాశమువైపు చూడుము. లెక్కపెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము. నీ సంతతి కూడ అలాగుననే  అగును”  అని చెప్పెను.

6. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బ్టి దేవుడు అబ్రామును నీతిమంతు నిగా ఎంచెను.

7. దేవుడు అతనితో ”నేను సర్వేశ్వరుడను. ఈ దేశమును నీ వశముచేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరమునుండి నిన్నుకొనివచ్చితిని” అనెను.

8. అబ్రాము ”ప్రభూ! ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియును?” అనెను.

9. దానికి ప్రభువు ”మూడేండ్లపెయ్యను, మూడేండ్ల ఆడుమేకను, మూడేండ్ల పొట్టేలును, ఒకగువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసికొనిరమ్ము” అనెను.

10. అబ్రాము వాినన్నిని తీసికొనివచ్చెను. జంతువులను నడిమికి రెండుముక్కలుగా నరికెను. దేని ముక్కను దాని  ముక్కకు ఎదురునుంచెను. పకక్షులను మాత్రము కోయలేదు.

11. అప్పుడు గ్రద్దలు1 ఆ కళేబరములకు మూగినవి. కాని అబ్రాము వానిని తోలివేసెను.

12. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్రపట్టెను. భయానకమైన మహాగాఢాంధకారము అతనిని క్రమ్మెను.

13. ప్రభువు అబ్రాముతో ”ఇది నిశ్చయమని తెలుసుకొనుము. నీసంతతివారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి, ఆ దేశపు వారికి బానిసలగుదురు. ఆ దేశీయులు నాలుగు వందల యేండ్లపాటు నీ వారిని పీడింతురు.

14. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతివారు ఐశ్వర్యముతో తులదూగుచు ఆ దేశమునుండి బయటబడుదురు.

15. ఏ దిగులు లేకుండ నీవు నీ పితరులను కలిసికొందువు. పండు ముసలితనమున నిన్ను పాతిపెట్టుదురు.

16. నీ తరువాత నాలుగవతరమువారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పికిగాని అమోరీయుల పాపము పండదు.” అనెను.

17. అంతట ప్రొద్దుకూకి  చీకిపడెను. అప్పుడు పొగకుంపి, నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను.

18. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసికొని ”ఐగుప్తు దేశపునది మొదలుకొని మహానదియగు యూఫ్రీసు వరకుగల భూఖండమును నీ సంతతికి ధారపోయుచున్నాను.

19-21. ఆ భూఖండము కేనీయులకు, కనిస్సీయులకు, కద్మోనీయులకు, హిత్తీయులకు, పెరిస్సీయులకు, రెఫాయీలకు, అమోరీయులకు, కనానీయులకు, గిర్గాషీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు చెందిన్టిది” అని చెప్పెను.

Previous                                                                                                                                                                                                   Next                                                                                      

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము