దేవుడు ప్రేమమయుడు
దావీదు కీర్తన
103 1. నా ప్రాణమా! ప్రభువును స్తుతింపుము.
నాలోని సమస్తశక్తులారా!
ఆయన పవిత్రనామమును సన్నుతింపుడు.
2. నా ప్రాణమా! ప్రభువును స్తుతింపుము.
ఆయన ఉపకారములను వేనిని మరువకుము.
3. ఆయన నీ పాపములనెల్ల మన్నించును.
నీ వ్యాధులనెల్ల కుదుర్చును.
4. సమాధినుండి నిన్ను కాపాడును.
కరుణా కాక్షములు అనెడు కిరీటమును
నీకు ఒసగును.
5. నీ జీవితకాలమంతయు శుభములతో నింపును.
నీవు గరుడపక్షివలె యువకుడవుగాను,
శక్తిసంపన్నుడవుగాను మనునట్లు చేయును.
6. ప్రభువు నీతిని పాించును.
పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును.
7. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెను.
యిస్రాయేలీయులకు
తన మహాకార్యములు విశదము చేసెను.
8. ప్రభువు కరుణామయుడు,
దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి.
9. ఆయన మనలను నిత్యము చీవాట్లు పెట్టడు.
మనమీద కలకాలము కోపపడడు.
10. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు
మన దోషములకు తగినట్లుగా
మనలను దండింపడు.
11. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో
ప్రభువుపట్ల భయభక్తులు చూపువారియెడల
ఆయన ప్రేమ అంత మిక్కుటముగానుండును.
12. పడమరకు తూర్పు ఎంతదూరమో
అంత దూరముగా
అతడు మన పాపములను పారద్రోలును.
13. తండ్రి తన కుమారుల మీద జాలి
చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు
కలవారి మీద జాలి చూపును.
14. మనమెట్లు రూపొందితిమో
ఆయనకు తెలియును.
మనము మ్టిమనుషులమని
ఆయన జ్ఞప్తియందు ఉంచుకొనును.
15. నరుల జీవితము గడ్డిపరకవింది.
పిచ్చిమొక్కలు పూయు పూవువింది.
16. ఆ పూవుమీద గాలి తోలగా అది రాలిపోవును.
అది యిక ఎవరికంటను పడదు.
17. కాని ప్రభువుపట్ల భయభక్తులు చూపువారియెడల ఆయన కృప అనాదినుండి
అనంతకాలమువరకును ఉండును.
18. ప్రభువు నిబంధనమును పాించి
అతని కట్టడలను అనుసరించువారికి
అతని రక్షణము తరతరములవరకు
లభించుచుండును.
19. ప్రభువు తన సింహాసనమును
ఆకసమున నెలకొల్పెను.
ఆయన ఎల్లరిమీద పరిపాలనము చేయును.
20. బలాఢ్యులైన ప్రభువు దూతలారా!
ఆయన ఆజ్ఞ పాించి ఆయన మాట
వినువారలారా! మీరు ఆయనను స్తుతింపుడు.
21. ప్రభువు సైన్యములారా ! ఆయనకు పరిచారకులై
అతని చిత్తమును పాించువారలారా!
మీరు ఆయనను స్తుతింపుడు.
22. ప్రభువు సామ్రాజ్యమునందలి
సమస్త సృష్టివస్తువులారా!
మీరు ఆయనను స్తుతింపుడు.
నా ప్రాణమా! ప్రభువును స్తుతింపుము.