కలలను నమ్మరాదు

34 1.      మూర్ఖులు లేనిపోని ఆశలవలన

                              మోసపోవుదురు.

                              కలలవలన వారి ఆలోచనలు రెక్కలు

                              కట్టుకొని ఎగురును.

2.           స్వప్నములను నమ్ముట

               నీడను పట్టుకొనుటవింది,

               గాలిని తరుముటవింది.

3.           అద్దములో ముఖమువలె కలలలో

               మన అనుభవములే ప్రతిబింబించును.

4.           కల్మషత్వము నుండి నిర్మలత్వము రాదు.

               నిజము కానిదానినుండి నిజమైనది రాదు.

5.           సోదె, శకునములు, కలలు నిజములు కావు.

               అవి ప్రసవవేదనలో నున్న స్త్రీ ఊహలవలె

               వ్టి ఊహలు.

6.           సర్వోన్నతుడైన ప్రభువు కలిగించిన కలను

               నమ్మవచ్చును,

               కాని వ్టి కలలను విశ్వసింపరాదు.

7.            స్వప్నముల వలన చాలమంది అపమార్గము ప్టిరి

               వానిని నమ్మి చాలమంది నిరాశ చెందిరి.

8.           ధర్మశాస్త్రమున అి్ట అబద్ధమేమియు లేదు.

               సత్పురుషులు బోధించిన విజ్ఞానమున

               అి్ట అనృతము లేదు.

ప్రయాణము వలన అనుభవము

9.           ప్రయాణములు చేసినవానికి

               అనేక విషయములు తెలియును.

               అనుభవశాలి అర్థయుక్తముగా మ్లాడును.

10.         కష్టముల నెదుర్కొననివానికి

               కొద్దిగానే తెలియును.

               దేశాటనములు సల్పిన వానికి

               అనుభవము పెరుగును.

11.           నా సంచారములలో నేను

               చాలా సంగతులు తెలిసికొింని.

               మాటలలో చెప్పగలిగిన దానికంటె

               ఎక్కువ అంశములనే గ్రహించితిని.

12.          నేను చాలా అపాయములను ఎదుర్కొింని.

               కాని నా పూర్వానుభవము వలన

               వాని నుండి తప్పించుకొింని.

13.          దైవభీతికలవారు జీవనమును పొందుదురు.

               వారు నమ్మిన దేవుడు వారిని  కాపాడును.

14.          దైవభీతి కలవాడు భయము చెందనక్కరలేదు.

               ప్రభువును నమ్మెను కనుక

               అతడు పిరికివాడు కానక్కరలేదు.

15.          ప్రభువును నమ్మినవాడు ధన్యుడు.

               ఏ దిక్కునుండి సహాయము లభించునో

               అతనికి తెలియును.

16.          దేవుడు తనను ప్రేమించువారిని

               ఒక కంట కనిప్టిె ఉండును.

               వారిని తప్పక ఆదుకొని శక్తితో సంరక్షించును.

               వారిని వడగాలినుండి మధ్యాహ్నపువేడిమి నుండి

               కాపాడును.

               వారిని కాలుజారి పడనీయడు,

               నాశనమైపోనీయడు.

17.          వారికి సేదదీర్చి, వారి కన్నులలో

               కాంతిని నెలకొలుపును.

               ఆయురారోగ్యములతో వారిని దీవించును.

బలులు

18.          అన్యాయార్జితమైన పశువును బలిగా అర్పించిన

               ఆ బలి దోషపూరితమైనదగును.

               దుష్టులబలిని దేవుడు అంగీకరింపడు.         

19.          మహోన్నతుడు దుర్మార్గుల బలివలన

               సంతుష్టి చెందడు.

               పెక్కు బలులర్పించుట వలన

               వారి పాపములు తొలగిపోవు.

20.        పేదవాని పశువునపహరించి బలిగా అర్పించుట

               తండ్రి చూచుచుండగా

               అతని కుమారుని చంపుట వింది.

21.          పేదలకు అన్నమే ప్రాణము.

               ఆ అన్నమును నాశనము చేయుట అనగా 

               పేదవానిని చంపుటయే.

22.        పేదవాని జీవనోపాధి చెరచువాడు

               వానిని చంపినట్లే.

               కూలివానికి కూలి ఎగగొట్టువాడు

               వానిని హత్య చేసినట్లే.

23.        ఒకడు గోడ కట్టుచుండగా మరియొకడు

               పడగొట్టెనేని శ్రమ తప్ప ఏమి మిగులును?

24.         ఒకడు ప్రార్థించుచుండగా మరియొకడు

               శపించెనేని దేవుడు ఎవరి మనవి ఆలింపవలెను?

25.        శవమును మ్టుి, శుద్ధి చేసికొని మరల ముట్టెనేని

               ఆ శుద్ధివలన ప్రయోజనమేమి?

26.        ఎవడైనను తన పాపములకు పరిహారముగా

               ఉపవాసముండి మరల అవియే పాపములను

               చేసినచో వాని ఉపవాసమునకును

               ఫలితమేమైన కలదా?

               వాని ప్రార్థననెవరు ఆలింతురు?