అమ్మోనునకు శిక్ష
49 1. అమ్మోనును గూర్చి ప్రభువిట్లు చెప్పెను:
యిస్రాయేలునక కుమారులు లేరా?
అతనికి వారసులు లేకపోయెనా?
వారు తమ దేశమును
ఎందుకు కాపాడుకోలేదు?
అమ్మోనురాజు గాదును
ఏల భుక్తము చేసుకొనెను?
అతని ప్రజలు దాని నగరములలో
ఏల వసింతురు?
2. నేను రాజధానియైన రబ్బానగరము
యుద్ధనాదమును ఆలించునట్లు
చేయురోజులు వచ్చుచున్నవి.
అది నాశనమగును,
దాని గ్రామములు కాలి నేలమట్టమగును.
అపుడు యిస్రాయేలీయులు
తమ దేశమును ఆక్రమించుకొనిన
వారివద్దనుండి తమ దేశమును
తిరిగి స్వాధీనము చేసికొందురు.
3. హెష్బోను పౌరులారా! విలపింపుడు.
హాయి నాశనమైనది.
రబ్బా మహిళలారా! శోకింపుడు.
గోనెతాల్చి శోకగీతమును ఆలపింపుడు.
కలవరముతో అటునిటు పరుగెత్తుడు.
మీ దేవుడైన మోలెకును అతని యాజకులతోను
అధిపతులతోను ప్రవాసమునకు కొనిపోవుదురు.
4. విశ్వాసఘాతకులైన మీ ప్రజలు
ప్రగల్భములు పల్కనేల?
మీరు మీ శక్తిని నమ్ముకొని
మమ్మెవరు ముట్టడింపగలరని పల్కుచున్నారు.
5. నేను నలువైపులనుండి
మీ మీదికి భీతినిగొని వత్తును.
మీలో ప్రతివాడు బ్రతుకుజీవుడా అని పారిపోవును
మీ సైన్యమును మరల
ప్రోగుజేయు వాడెవడును ఉండడు.
కాని కాలము గడచిన పిదప
6. నేను అమ్మోనునకు మరల
అభ్యుదయమును ఒసగుదును.
ఇది ప్రభుడనైన నా వాక్కు.”
ఎదోమునకు శిక్ష
7. ఎదోమును గూర్చి ప్రభువిట్లు నుడివెను:
”తేమాను ప్రజల విజ్ఞానము అంతరించెనా?
వారి జ్ఞానులు ఉపదేశము చేయలేరా?
వారి తెలివి అడుగంటెనా?
8. దెదాను పౌరులారా!
మీరు పారిపోయి దాగుకొనుడు.
ఏసావు వంశజులను శిక్షించుకాలము వచ్చినది.
కనుక నేను వారిని దండింపపూనుకొింని.
9. ద్రాక్షపండ్లు కోయువారు
కొన్ని పండ్లు వదలివేయుదురు.
రాత్రిలో దొంగలించువారు వారికి వలసిన
వస్తువులను మాత్రమే కొనిపోవుదురు.
10. కాని నేను ఏసావు వంశజులను
పూర్తిగా కొల్లగొట్టుదును.
వారు దాగియుండు తావులను
బట్టబయలు చేయుదును.
కనుక వారిక దాగుకోజాలరు.
ఎదోమీయులెల్లరును నాశనమైరి.
వారిలో ఎవడును మిగులడు.
11. మీరు మీ అనాధశిశువులను నాకు ఒప్పగింపుడు
నేను వారిని కాపాడుదును.
మీ వితంతువులను నేను సంరక్షింతును.
12. శిక్షకు గురిగానక్కరలేని వారుకూడ తప్పక శిక్ష అనుభవించుచుండగా, మరి మీరుమాత్రము దండన నెట్లు తప్పించుకొందురు? మీరు శిక్షాపాత్రములోని పానీయమును త్రాగితీరవలెను.
13. బోస్రా నగరము ఎడారి అగును. ప్రజలు దానిని చూచి వెరగందుదురు. దానిని ఎగతాళి చేయుదురు. దాని పేరును తిట్టుగా వాడు కొందురు. దాని చుట్టుపట్లనున్న గ్రామములును పాడ గును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”
14. ఎదోమూ! ప్రభువు నుండి
నేను ఈ సందేశము వింని.
ప్రభువు వార్తావహుని జాతులవద్దకు పంపెను.
వారెల్లరును సైన్యములతో నీ మీదికి వచ్చి
దాడిచేయవలెనని కబురు చెప్పించెను.
15. ప్రభువు నీ బలమును నాశనము చేయును.
నిన్ను జాతులలో బలహీనపరచి
తృణీకారమునకు గురిచేయును.
16. నీ గర్వమే నిన్ను పెడత్రోవ ప్టించినది.
నీవు తలచినట్లుగా ఇతరులు
నీకు భయపడుటలేదు.
మీరు ఎత్తయినకొండ కొమ్ములమీద వసింతురు.
మీరు గరుడ పక్షివలె ఉన్నతమున వసించినను
ప్రభువు మిమ్ము క్రింద పడత్రోయును.
ఇది ప్రభువు వాక్కు.
17. ప్రభువు ఇట్లనెను: ”ఎదోము పాడువడును. దానిని చూచినవారెల్ల వెరగంది విస్తుపోవుదురు.
18. సొదొమ గొమొఱ్ఱాలకును, వాని దాపులోని నగరము లకును ప్టిన దుర్గతియే ఎదోమునకును పట్టును. అచట ఇక ఎవడును వసింపడు. ఇది ప్రభుడనైన నా వాక్కు.
19. సింహము యోర్దాను నదీతీరమునందలి
దట్టమైన అడవులలోనుండి బయలుదేరి,
పచ్చని పంటపొలములలోనికి వచ్చినట్లే,
నేనును ఎదోమీయుల మీదికి వచ్చెదను.
వారు నాకు వెరచి
తమ దేశమునుండి పారిపోవుదురు.
అపుడు నేనెన్నుకొనిన నాయకుడు
ఆ భూమినేలును.
నాతో పోల్చదగిన వాడెవడు?
నన్ను సవాలు చేయువాడెవడు?
నన్నెదిరింపగలవాడెవడు?
20. నేను ఎదోమీయులకు ఏమి చేయుదునో వినుడు.
తేమాను పౌరులకు ఏమిచేయుదునో ఆలింపుడు.
విరోధులు వారి పిల్లలను కూడ
ఈడ్చుకొని పోవుదురు.
ఎల్లరును వారిని చూచి భీతిల్లుదురు.
21. ఎదోము కూలినపుడు
భీకరనాదముప్పతిల్లగా భూమి కంపించును.
ఆ దేశము ఆర్తనాదము
రెల్లు సముద్రమువరకు విన్పించును.
22. గరుడపక్షి రెక్కలు విప్పి దిగివచ్చినట్లే
శత్రువులు బోస్రామీది కెత్తివత్తురు.
ఆ దినమున ఎదోము సైనికులు
ప్రసవించు స్త్రీవలె భీతిల్లుదురు.
దమస్కునకు శిక్ష
23. ప్రభువు దమస్కు గూర్చి ఇట్లనెను:
”హమాతు అర్పాదు నగరముల ప్రజలు
ఘోరవార్తలు విని కలవరముచెందిరి.
వారు విచారసాగరమున మునిగి
శాంతిని కోల్పోయిరి.
24. దమస్కు ప్రజలు బలము కోల్పోయి పారిపోయిరి.
వారు ప్రసవించు స్త్రీవలె బాధకును,
దుఃఖమునకును గురియైరి.
25. ఆ సుప్రసిద్ధమైన నగరము,
ఆనందమునకు నిలయమైన
ఆ నగరము పాడువడినది.
26. ఆ దినమున ఆ నగర యువకులను
నడి వీధులలోనే చంపుదురు.
దాని సైనికులెల్లరును కూలుదురు.
27. నేను దమస్కు ప్రాకారములకు నిప్పింంతును.
బెన్హెదదు ప్రాసాదమును కాల్చివేయుదును.
సైన్యములకు అధిపతియు ప్రభుడనైన
నా వాక్కిది.”
అరబు తెగలకు శిక్ష
28. కేదారు తెగలను గూర్చియు, బబులోనియా రాజగు నెబుకద్నెసరు జయించిన హసోరు మండల ములను గూర్చియు ప్రభువు ఇట్లనెను:
”మీరు కేదారు తెగలమీదికి దాడిచేయుడు.
తూర్పు జాతులను నాశనము చేయుడు.
29. వారి గుడారములను, తెరలను, మందలను
గుడారములోని వస్తువులను అపహరింపుడు.
వారి ఒంటెలను పట్టుకొనుడు.
భీతి మిమ్ము చుట్టుమ్టుియున్నది
అని వారితో చెప్పుడు.
30 హసోరు ప్రజలారా!
మీరు దూరముగా పారిపోయి దాగుకొండని
ప్రభుడనైన నేను హెచ్చరించుచున్నాను.
నెబుకద్నెసరు మిమ్ము నాశనము చేయుటకు
వ్యూహము పన్నెను.
31. మనము సురక్షితముగా వసించు
ఈ ప్రజలపై దాడి చేయుదము.
వీరి నగరములకు, ద్వారమునకు అడ్డుగడెలులేవు.
దానికి రక్షణములేదు అని అతడు పలుకుచున్నాడు.
32. మీరు వారి ఒంటెలను, గొఱ్ఱెలను
తోలుకొనిపొండు.
చెంపల వెంట్రుకలను కురచగా కత్తిరించుకొను
ఆ ప్రజలను నేను నలుదిక్కులకు చెదరగొట్టుదును.
ఎల్లవైపులనుండి వారిని
నాశనమునకు గురిచేయుదును.
33. హసోరు కలకాలము వరకును ఎడారియగును.
నక్కలకు వాసస్థలమగును.
అచటనిక యెవడును వసింపడు.
ఇది ప్రభుడనైన నా వాక్కు.
ఏలామునకు శిక్ష
34. సిద్కియా యూదాకు రాజైనవెంటనే ప్రభువు ఏలామును గూర్చి నాతో ఇట్లుచెప్పెను:
35. సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కిది.
నేను ఏలామునకు బలకారణమైన
విలుకాండ్రను వధింతును.
36. అన్ని దిక్కులనుండియు పెనుగాలులు
ఏలాము మీదికి వీచునట్లు చేయుదును.
ఆ దేశ ప్రజలు ఎల్లెడల చెల్లాచెదరగుదురు.
దాని కాందిశీకులు
తలదాచుకొనని దేశమేఉండదు.
37. ఏలాము ప్రజలు తమను చంపగోరు
శత్రువులను చూచి భయపడుదురు.
నేను మహాకోపముతో వారిని తుదమ్టుింతును.
వారి మీదికి సైన్యములను పంపి
వారిని మట్టుపెట్టుదును.
38. వారి రాజులను, నాయకులను సంహరించి,
ఏలాము దేశమున
నా సింహాసనమును నెలకొల్పుదును.
39. కాని రానున్న రోజులలో
ఏలామును మరల వృద్ధిలోనికి దెత్తును.
ఇది ప్రభుడనైన నా వాక్కు.”