5. యిస్రాయేలు యూదాలను గూర్చి ప్రవచనములు
సమరియాకు హెచ్చరిక
28 1. ఎఫ్రాయీము త్రాగుబోతుల
గర్వపు పుష్పకిరీటము
నాశనమగు కాలము వచ్చినది.
సారవంతమైన లోయకెదురుగా నిల్చియుండి
యిస్రాయేలు రాజ్యవైభవమును
సూచించెడు నగరము
పూవువలె వాడిపోవును.
తప్పత్రాగి తూలిపడిపోయియున్నవారు
నాశనమగుదురు.
2. ప్రభువు బలాఢ్యుడైనవీరుని వారిమీదికి పంపెను.
అతడు వడగండ్ల వానవలెను,
సర్వమును ధ్వంసముచేయు తుఫానువలెను,
ఉద్ధృతముగాపారు మహాప్రవాహమువలెను
వచ్చి దేశమును కూలద్రోయును.
3. ఎఫ్రాయీము త్రాగుబోతుల గర్వపు కిరీటమును
ఆయన తన కాలితో త్రొక్కివేయును.
4. సారవంతమైన లోయకెదురుగా నిలిచియుండి,
యిస్రాయేలు రాజ్యవైభవమును
సూచించునదియు,
పూవువలె వాడిపోయినదియు
అగు నగరమువలెను, ఋతువు రాకముందే
పండిన తొలి అంజూరపు పండును
ఒకడు చూచినవెంటనే, తన చేతిలోనికి తీసికొని
గబాలున మ్రింగివేయు చందమున నాశనమగును.
5. ఆ కాలమున సైన్యములకధిపతియైన ప్రభువు
తనప్రజలలో మిగిలియున్న వారికి అందమైన
కిరీటమగును. సుందరమైన మకుటమగును.
6. ఆయన న్యాయస్థానమున న్యాయాధిపతులకు,
తీర్పుతీర్చ నేర్పును, ఆత్మను దయచేయును.
నగరద్వారమువద్ద పోరాడుచు శత్రువులను
త్రిప్పికొట్టు వీరులకు పరాక్రమమును ఒసగును.
యాజకులను, దుష్టప్రవక్తలను గూర్చి
7. యాజకులు, ప్రవక్తలు
ఘాటయిన మద్యముసేవించి మతికోల్పోయిరి.
వారు తప్ప త్రాగి మైకముతో తూలుచున్నారు.
ఘాటైన మద్యమువలన వారు తూలుతున్నారు.
వారు తప్పత్రాగి ఉన్నందున
దర్శనములు కలిగినప్పుడు తూలుదురు.
న్యాయము చెప్పవలసి వచ్చినపుడు
జారిపడుదురు.
8. వారు కూర్చున్న తావులన్నియు
వారి వాంతుల వలన మలినమైనవి.
శుభ్రమైన స్థలమొక్కియు లేదు.
9. ”ఇతడు తానెవరికి
బోధచేయుచున్నాననుకొనుచున్నాడో?
ఇతని ఉపదేశములెవరికి కావలెను?
ఇప్పుడే చనుబాలు మానిన చిన్న బిడ్డలకా?
10. ఇతడు మనకు ఆజ్ఞ మీద ఆజ్ఞను,
సూత్రము మీద సూత్రమును,
కొంచెమిక్కడను, కొంచెమక్కడను
బోధించుచున్నాడు” అని వారనుకొనుచున్నారు.
11. సరే, ప్రభువు ఈ ప్రజలతో
అన్యదేశీయుల భాషలో నత్తినత్తిగా మ్లాడును.
అయినను వారు వినరైతిరి.
12. ఆయన మీకు విశ్రాంతి నొసగెను.
”అలసిపోయినవారు విశ్రాంతి చెందుడు”
అని చెప్పెను. కాని మీరు ఆయనమాట వినరైతిరి.
13. కావున ప్రభువు మీకిప్పుడు ఆజ్ఞమీద ఆజ్ఞను,
సూత్రము మీద సూత్రమును,
కొంచెమిక్కడను, కొంచెమక్కడను బోధించును.
మీరు నడచుచు వెనుకకు మొగ్గి వెల్లకిలపడుదురు.
మీరు గాయపడి వలలోచిక్కి బందీలగుదురు.
దుష్టాధికారులు
14. యెరూషలేమున ప్రజలను ఏలెడి
అపహాసకులారా!
మీరు ప్రభువు పలుకులు వినుడు.
15. ”మేము మృత్యువుతో నిబంధన చేసికొింమి.
పాతాళలోకముతో ఒప్పందము చేసికొింమి.
నాశనకరమైన మహాప్రవాహము వచ్చినపుడు
మమ్ము బాధింపజాలదు.
మేము అబద్ధము నాశ్రయించితిమి,
అసత్యము మరుగుజొచ్చితిమని
మీరు ప్రగల్భములు పలుకుచున్నారు.
దైవోక్తి
16. కాని ప్రభువైన యావే ఇట్లనుచున్నాడు:
”సియోనున పునాదిరాయిని వేసినవాడను నేనే.
అది పరీక్షకు నిలిచిన రాయి.
ఆ మూలరాయి అమూల్యమైనది, పిష్ఠమైనది.
విశ్వసించువాడు చలింపడు.
17. ఆ పునాదిరాతికి
న్యాయము కొలనూలుగానుండును.
నీతి లంబసూత్రముగానుండును.
మరల దుష్టాధికారులను గూర్చి
వడగండ్లవాన మీ అబద్ధములనెడు
కుీరమును కూల్చివేయును.
ప్రవాహము
మీ ఆశ్రయస్ధానమును కూలద్రోయును”.
18. మీరు మృత్యువుతోచేసికొనిన
నిబంధనము వమ్మగును.
పాతాళముతో చేసికొనిన
ఒప్పందము వ్యర్థమగును.
నాశనకరమైన ప్రవాహము వచ్చినపుడు
అది మిమ్ము హతము చేసితీరును.
19. ఆ ప్రవాహము మిమ్ము మాిమాికి తాకును.
ప్రతి ఉదయము మిమ్ము బాధించును.
ఈ విషయమునర్థము చేసికొందురేని
మీరు భయకంపితులగుదురు.
20. ‘కాళ్ళుచాచుకొనుటకు మంచము కురచ,
కప్పుకొనుటకు కంబళి వెడల్పుచాలదు’
అను సామెత మీపట్ల నెరవేరితీరును.
21. ప్రభువు పెరాసీముకొండ మీదవలె
యుద్ధము చేయును.
గిబ్యోను లోయయందువలె పోరాడును.
ఆయన విచిత్రమైన కార్యము చేయును.
ఆశ్చర్యకరమైన చెయిదము సల్పును.
22. కావున మీ అపహాసములిక చాలింపుడు.
లేదేని మీ బంధములు మరి అధికముగా
బిగుసుకొనును.
సైన్యములకధిపతియగు ప్రభువు
నిఖిలదేశమును నాశనము చేయుదునని
ప్రకటనము చేయగా నేనువింని.
రైతు సామెత
23. నా మాటలను జాగ్రత్తగావినుడు.
నా పలుకులను అవధానముతో గ్రహింపుడు.
24. సేద్యగాడు విత్తుటకుగాను
నిరంతరము పొలము దున్నుచునేయుండునా?
ఎల్లవేళల మ్టిపెల్లలు
పగులగొట్టుచునే యుండునా?
25. అతడు పొలము చదునుచేసినపిమ్మట
నల్లజీలకర్రగాని, తెల్లజీలకర్రగాని చల్లునుగదా!
గోధుమలు చాళ్ళుగా విత్తును.
యవలను సిద్ధపరిచిన పొలములో
ఇతర మొక్కలను గట్టున వేయునుగదా!
26. ప్రభువే సేద్యగానికి ఉపదేశముచేసి,
అతడికి ఆ పని నేర్పించును.
27. సేద్యగాడు నల్లజీలకర్రను
బరువైన పరికరముతో నూర్చడు.
బండిచక్రములను జీలకర్రమీద నడిపింపడుగాని,
కర్రచేత నల్లజీలకర్రను, చువ్వచేత జీలకర్రను
దుళ్ళకొట్టునుగదా!
28. గోధుమలను మితిమీరి త్రొక్కించి
పిండిచేయరు గదా?
గింజలు నలిగి పోకుండునట్లుగనే
వానిమీద బండిచక్రములు త్రిప్పుదురు.
29. సైన్యములకధిపతియైన ప్రభువే
ఈ పరిజ్ఞానమునుకూడ దయచేయును.
ప్రభువు ప్రణాళికలు అద్భుతమైనవి.
ఆయన కృత్యములు మహత్తరమైనవి.