ఉపోద్ఘాతము:

పేరు: బారూకు అనువాడు యిర్మీయా ప్రవక్తకు కార్యదర్శి (యిర్మీ. 36:4).

కాలము: క్రీస్తు పూర్వము చివరి శతాబ్ధములో ఈ గ్రంథము వ్రాయబడినది.  పాలస్తీనా వెలుపలనున్న ఒక యూదయ సంఘము నుండి వ్రాయబడినది.

రచయిత: బారుకు అని చెప్పబడినను, ఓ గుప్త రచయిత ఈ గ్రంథమును కూర్చాడని పండితుల అభిప్రాయము. బారూకు గ్రంథము కొన్ని చిన్న ప్రతుల సమూహము. ఈ ప్రతులను వివిధ మూలాల నుండి సేకరించిరి.

చారిత్రక నేపథ్యము: వలసకాలము ముగింపు అనంతరము చాలమంది యూదులు పాలస్తీనాకు తిరిగివచ్చిరి. కాని వారిలో కొందరు ఐగుప్తు, మెసపొోమియా ప్రాంతాలలో స్థిరపడిపోయారు. వారు చెదరిపోయిన (ఈరిబిరీచీళిజీబి) యూదులుగా పిలుబడిరి. వీరు అన్యదేశాలలో నున్నప్పికిని, వారి సొంత మతాచారములను, సాంప్రదాయాలను పాించారు. అచట ప్రార్థనా మందిరాలను నిర్మించుకున్నారు. యాజకుల ద్వారా బోధలు చేయించుకున్నారు.  వీి పర్యావసానముగా కొన్ని క్రొత్త గ్రంథములు వెలువడ్డాయి. ఈ కోవకు చెందినదే బారూకు గ్రంథము. ఈ బారూకు గ్రంథములో బబులోను వలసకాలము గాథలు చాలా వున్నాయి. ఈ కారణము వలన హీబ్రూ బైబులు ఈ గ్రంథమును ప్రామాణికమైనదిగా గుర్తించలేదు. దీన్ని ‘డ్యూటరోకెనానికల్‌’ గ్రంథములలో ఒకిగా పరిగణించారు.

ముఖ్యాంశములు: ప్రవాసములోని యూదులు పశ్చాత్తాపపడుట, విజ్ఞానస్తవము, విమోచనపుాశ, విగ్రహారాధన ఖండనము ఈ గ్రంథమునందలి ముఖ్యాంశములు.

క్రీస్తుకు అన్వయము:  దేవుని జ్ఞానము గూర్చి వివరించబడెను  (3:1-4:4).