దేవుని ప్రేమను నిరాకరించినందులకు ప్రజలకు శిక్ష

11 1. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               యిస్రాయేలు బాలుడైయుండగా

               నేనతడిని ప్రేమించితిని.

               ఐగుప్తునుండి నా కుమారుని పిలిచితిని.       

2.           కాని నేనతనిని పిలిచినకొలది

               అతడు నా నుండి వైదొలగెను.

               నా ప్రజలు బాలుదేవతకు బలులు అర్పించిరి.

               విగ్రహములకు సాంబ్రాణిపొగ వేసిరి.

3.           ఎఫ్రాయీము చేయిపట్టుకుని

               వానికి నడక నేర్పినవాడను నేనే,

               వారిని కౌగిలించుకొనిన వాడను నేనే.

               అయినను నేను తమను కరుణించితినని

               వారు గ్రహింపరైరి.

4.           గాఢమైన ప్రేమానురాగములతో

               నేను వారిని నా చెంతకు రాబట్టుకొింని.

               వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొింని.

               క్రిందికివంగి వారిచే అన్నము తినిపించితిని.

5.           అయినను వారు

               నాయొద్దకు వచ్చుటకు అంగీకరింపరైరి.

               కావున వారు ఐగుప్తునకు వెళ్ళిపోవలెను.

               అస్సిరియా వారిని పరిపాలించును.

6.           ఆ జనుల నగరములు యుద్ధమునకు గురియగును.

               వారి పట్టణ ద్వారములు కూలిపోవును.

               నా ప్రజలు తమకిష్టము వచ్చినట్లు

               ప్రవర్తించుచున్నారుగాన పోరున కూలుదురు.

దేవునిప్రేమ ఆయన శిక్షకంటే బలీయమైనది

7.            నా ప్రజలు నా చెంతనుండి

               వైదొలగ  తీర్మానించిరి.

               మహోన్నతునివైపు తిరుగవలెనని

               (ప్రవక్తలు)  పిలిచినను

               చూచుటకు ఎవ్వడును యత్నింపడు.            

8.           యిస్రాయేలూ!

               నేను నిన్నెట్లు విసర్జింతును?

               నిన్నెట్లు పరిత్యజింతును?

               నేను నిన్ను అద్మానువలె నాశనము చేయగలనా?

               సెబోయీమునకు చేసినట్లు చేయగలనా?

               నా హృదయము అందుకు అంగీకరించుటలేదు. నా యెడద జాలితో కంపించుచున్నది.

9.           నా కోపాగ్నినిబ్టి

               నాకు కలిగిన ఆలోచనను               నేను నెరవేర్చను.

               ఎఫ్రాయీమును మరల నాశనముచేయను.

               నేను మీ మధ్య దేవుడనుగాని, నరుడనుగాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని.

               మిమ్మును దహించునంతగా నేను కోపింపను.

జనులు ప్రవాసము నుండి తిరిగివచ్చుట

10.         నేను నా ప్రజల శత్రువులనుగాంచి

               సింహమువలె గర్జింపగా,

               నా జనులు నా వెంటవత్తురు.

               వారు పడమినుండి

               శీఘ్రమే నా చెంతకు వత్తురు.

11.           ఐగుప్తునుండి పకక్షులవలెను,

               అస్సిరియానుండి పావురములవలెను

               వేగముగా వత్తురు. నేను వారిని

               మరల తమ నివాసములకు కొనివత్తును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

యిస్రాయేలీయులు, యూదావాసులు దుష్టులు

12.          యిస్రాయేలీయులు బొంకులతో,

               మోసముతో నా చుట్టునుతిరుగుచున్నారు.

               యూదా ప్రజలు విశ్వాసపాత్రుడను,

               పవిత్రుడనైన దేవుడనగు

               నాకు ఎదురు తిరుగుచున్నారు.

Previous                                                                                                                                                                                                    Next