ఉపోద్ఘాతము:

పేరు, కాలము, రచయిత: యోహాను మొదటి  లేఖ గ్రంథం వివరణను చూడండి.

చారిత్రక నేపథ్యము: పలు పట్టణాలలో నున్న క్రైస్తవ సంఘాల నుద్దేశించి రాశాడు. ఒక సంఘంలో పెద్దలు, నాయకురాలైన ఒక స్త్రీని, సంబోధించి రాశాడు (వ.1). అసత్య వాదులను నిరోధించడానికి రాశాడు.

ముఖ్యాంశములు: క్రీస్తు విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించు కుంటూ సత్యానికి లోబడి వుండాలని సూచించడం ప్రధానోద్దేశం. విశ్వాసులను ప్రోత్సహిస్తూ, విరోధులను గూర్చి హెచ్చరికలు చేశాడు.

క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తును సత్యం, ప్రేమ విలువలతో చిత్రించాడు. క్రీస్తు ప్రేమాజ్ఞల ప్రకారం (వ.6) నడుచుకోవడమే క్రైస్తవుని కర్తవ్యం. క్రీస్తు మానవ శరీరం ధరించి వచ్చెనని ఒప్పుకొనని వారు మోసగాండ్రు, క్రీస్తు విరోధులు (వ.7).