18 1. ఇతరులతో కలియక తనకు తాను
జీవించువాడు స్వార్థపరుడు.
అతడు ఇతరుల సలహాలను అంగీకరింపడు
2. మూర్ఖునికి విషయమును
అర్థముచేసికోవలెనన్న కోర్కెలేదు.
స్వీయజ్ఞానమును ప్రదర్శించుటకు మాత్రము
సిద్ధముగా ఉండును.
3. దుష్టుడు రాగానే తిరస్కారము వచ్చును.
అవమానమురాగానే నిందవచ్చును.
4. సముద్రమువలె అగాధమున పారు
ఏరువలె నిర్మలమునై నరుని పలుకులు
విజ్ఞాన సంభరితములై ఉండును.
5. దుష్టునికి పక్షపాతము చూపి,
నిర్దోషికి న్యాయము జరిగింపకుండుట
ధర్మముకాదు.
6. వివాదమునకు పాల్పడిన మూర్ఖుడు
దెబ్బలనాహ్వానించును.
7. మూఢుని పలుకులు స్వీయనాశనమును తెచ్చును.
అతని మాటలే అతనికి ఉరులగును.
8. కొండెగాని మాటలు మధుర భక్ష ్యములవలె
సులువుగా మ్రింగుడుపడును.
9. పనిచేయని సోమరిపోతు
వినాశమూర్తికి సాక్షాత్తు సోదరుడు.
10-11. ప్రభువు దివ్యనామము కోటవింది.
పుణ్యపురుషులు దానిలోనికి ప్రవేశించి
రక్షణము బడయుదురు.
ధనవంతులుమాత్రము తమ సంపద
తమను ఉన్నతమైన ప్రాకారమువలె
సంరక్షించునని భ్రాంతిపడుదురు.
12. గర్వితునికి నాశనము తప్పదు.
వినయమువలన గౌరవము అబ్బును.
13. ఇతరులు చెప్పునది సావధానముగా విని
కాని జవాబు చెప్పకూడదు.
అటుల చేయనివాడు మూర్ఖుడు,
పరులనవమానించినవాడగును.
14. ఉత్సాహశక్తి కలవాడు
వ్యాధిబాధలను సహించును.
కాని ఆ శక్తియే నశించినచో
ఇక జీవితమును భరించుటెట్లు?
15. వివేకికి తెలివి అబ్బును.
జ్ఞాని సదా విజ్ఞానార్జనముకొరకు
ఎదురు చూచుచుండును.
16. బహుమతివలన కార్యములు సమకూరును.
దాని సాయముతో గొప్పవారినికూడ
కలిసికోవచ్చును.
17. వివాదములో మొదట మ్లాడినవాని పలుకులు
న్యాయముగనే చూపట్టును.
కాని ప్రత్యర్థి అతనిని ప్రశ్నింపగానే
విషయము భిన్నముగా కన్పించును.
18. చీట్లు వేయుటచేత వివాదములు మానును.
అది తీవ్ర కలహకారులమధ్య
పరిష్కారము చూపును.
19. తోడివాని సాయమును పొందినవాడు
కోటవలె అభేద్యుడగును.
కాని తోడివానితో కలహించినవాడు
అతని సాయము పొందలేడు.
20. నాలుకను బ్టియే నరుని జీవితముండును.
జిహ్వనుబ్టియే నరుని జీవిత విధానముండును.
21. జీవమును, మరణమునుగూడ
నాలుక అధీనములోనున్నవి.
నరుడు దానినెట్లు వాడుకొనునో
అి్ట ఫలితమునే బడయును.
22. భార్యను బడసినవాడు పెన్నిధిని బడసినట్లే,
ప్రభువు అనుగ్రహమును సంపాదించినట్లే.
23. పేదవాడు అడుగునపుడు దీనముగా
బతిమాలవలయును.
కాని సంపన్నుడు జవాబు చెప్పునపుడు
కర్కశముగా మ్లాడును.
24. కొందరు మిత్రులు మనకు కీడుతెచ్చెదరు.
కాని కొందరు సోదరులకంటె
ఎక్కువ హితము చేకూర్చెదరు.