యెహోషువ పాలస్తీనా దక్షిణభాగమును జయించుట

ఐదుగురు రాజులు గిబ్యోనును ముట్టడించుట

10 1. యెహోషువ హాయి పట్టణమును జయించి, దానిని శాపముపాలు చేసెననియు, ఆ పట్టణమునకు దానిరాజునకు, యెరికో పట్టణమునకు దాని రాజునకు ప్టినగతియే పట్టెననియు యెరూషలేము రాజైన అదోనిసెదెకు వినెను. గిబ్యోను నివాసులు యిస్రాయేలీ యులతో సంధిచేసికొని వారితో చేతులుకలిపిరని తెలిసికొనెను.

2. గిబ్యోను పెద్దపట్టణము. రాజనగరము వింది. హాయి పట్టణముకంటె పెద్దది. ఆ నగర వాసులందరు శూరులు. అటువిం పట్టణమే లొంగి పోవుట చూచి ఎల్లరును మిక్కిలి భయపడిరి.

3-4. కనుక యెరూషలేమురాజగు అదోనిసెదెకు, హెబ్రోను రాజగు హోహామునకు, యార్మూతురాజగు పీరాము నకు, లాకీషురాజగు యాఫియాకు, ఎగ్లోను రాజగు దెబీరునకు ”మీరు నాకు సహాయముగారండు. గిబ్యోను యెహోషువతోను, యిస్రాయేలీయులతోను సంధిచేసి కొనెను. గనుక మనమందరము కలసి గిబ్యోను పట్టణమును జయింతము” అని వార్త పంపెను.

5. ఆ రీతిగా అమోరీయరాజులు ఐదుగురు అనగా యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఏకమై సైన్యములతో వచ్చి గిబ్యోను వద్ద దండుదిగి పట్టణమును ముట్టడించిరి.

యెహోషువ, గిబ్యోనునకు సాయము వచ్చుట

6. గిబ్యోను పౌరులు గిల్గాలు శిబిరముననున్న యెహోషువకు కబురంపి ”మమ్ము గాలికి వదలవలదు. నీవు వెంటనే వచ్చి మమ్ము రక్షింపుము. మాకు సాయ పడుము. పర్వత ప్రాంతములలో నివసించుచున్న అమోరీయరాజులందరు మాకు విరోధముగా ఏకమై వచ్చియున్నారు” అని వర్తమానము పంపిరి.

7. ఆ కబురు వినగానే యెహోషువ తన వీరులనెల్ల ప్రోగు చేసికొనివచ్చెను.

8. యావే యెహోషువతో ”నీవు శత్రువులకు భయపడవలదు. నేను వారిని నీ వశము చేసితిని. వారిలో ఏ ఒక్కరును నిన్ను ఎదిరింపజాలరు” అని సెలవియ్యగా, 9. యెహోషువ గిల్గాలు నుండి రాత్రి అంతయు నడచివచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీదపడెను.

దేవుడు యెహోషువకు సాయపడుట

10. యావే శత్రువులకు యిస్రాయేలీయులనిన భయము ప్టుించెను. ఆయన గిబ్యోనున వారిని నిర్మూలించెను. బేత్‌హోరోను పల్లము వరకు శత్రువు లను తరిమెను. అసేకా, మక్కేడా నగరములవరకు వెాండి యోధులు వారిని చిత్రవధచేసిరి.

11. అమోరీ యులు యిస్రాయేలీయులకు జడిసి బేత్‌హోరోను పల్లము మీదుగా పారిపోవుచుండగా, యావే అసేకా వరకు వారిపై పెద్ద వడగండ్లవాన కురిపించెను. యిస్రాయేలీయుల కత్తివాతబడి చచ్చినవారికంటె ఆ వడగండ్లవానవలన చచ్చినవారే ఎక్కువ.

12. యావే అమోరీయులను యిస్రాయేలీయుల చేతికి అప్ప గించిన దినముననే యెహోషువ యావేను ప్రార్ధించెను. అతడు యిస్రా యేలీయులు వినుచుండగా ఇట్లనెను:

”సూర్యుడా!

నీవు గిబ్యోను పట్టణముపై నిలువుము;

చంద్రుడా!

నీవు అయ్యాలోను లోయమీద ఆగుము.”

13. ఆ రీతిగనే యిస్రాయేలు శత్రువుల మీద బడి పగతీర్చుకొనునంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ సంగతి ‘నీతిమంతుల గ్రంథము’4 లో వ్రాయబడియున్నది. ఆ విధముగా సూర్యుడు మిం నడుమ ఆగిపోయి, ఒకరోజు వరకు అస్తమించ లేదు.

14. దేవుడు నరునిఆజ్ఞకు బద్ధుడైన ఆ దినము విందినము మరియొకిలేదు. ఇక ఉండబోదు. నాడు యావే యిస్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసెను.

15. అటు తరువాత యెహోషువ తన సైన్యముతో గిల్గాలు శిబిరమునకు తిరిగివచ్చెను.

మక్కేడా గుహలో దూరిన ఐదుగురు రాజులు

16. శత్రురాజులు ఐదుగురు పారిపోయి మక్కేడా గుహలో జొరబడిరి.

17. వారు మక్కేడా గుహలో దాగుకొనియున్నారని యెహోషువకు తెలుపబడినపుడు 18. అతడు గుహముఖమున పెద్దరాళ్ళను దొర్లించి భటులను కాపుపెట్టుడని ఆజ్ఞాపించెను.

19. పైగా యెహోషువ తనజనముతో ”మీరు ఊరకుండక శత్రువుల వెంటబడి తరుముడు. పారిపోవుచున్న వారిని ప్టి చంపుడు. వారిని మరల పట్టణములలో ప్రవేశింపనీయకుడు. యావే వారిని మీ చేతికి అప్పగించెను” అని చెప్పెను.

20. యెహోషువ యిస్రాయేలీయులు, అమోరీ యులను చాలమందిని మట్టుబ్టెి, వారిలో కట్టకడపి వారిని వధించుచుండగా తప్పించుకొనిపోయిన వారు కొంతమంది తమ కోటలలో దూరిరి.

21. యిస్రా యేలీయులందరు చెక్కుచెదరకుండ మక్కేడా వద్ద విడిదిచేసియున్న యెహోషువ వద్దకు మరలివచ్చిరి. శత్రువులెవరును వారిని పల్లెత్తిమాట అనుటకైన సాహసింపలేదు.

22. యెహోషువ అనుచరులతో ”మక్కేడా గుహ ముఖమున పెద్దరాళ్ళను తొలగించి ఆ ఐదుగురు రాజులను నా కడకు కొనిరండు” అని చెప్పెను.

23. వారు యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఐదుగురను యెహోషువ కడకు కొనివచ్చిరి.

24. యెహోషువ ప్రజలందరిని సమా వేశపరచి తనతో నిలిచి యుద్ధముచేసిన ప్రజా నాయకులతో ”మీరిటువచ్చి వీరి మెడలపై పాద ములు మోపుడు” అని చెప్పెను. వారు ముందుకు వచ్చి శత్రురాజుల మెడలపై పాదములు ప్టిెరి.

25. యెహోషువ వారితో ”మీరు భయపడవలదు. ఆశ్చర్య పడవలదు. ధైర్యముతో, బలముతో పోరాడుడు. మీరు ఎదిరించి పోరాడు శత్రువులనందరిని ప్రభువు ఈ రీతిగనే నాశనము చేయును” అని చెప్పెను.

26. యెహోషువ ఆ ఐదుగురు రాజులను వధించి, ఐదు చెట్లకు వ్రేలాడదీయించెను. సాయంకాలమగువరకు, వారు ఆ చెట్లనుండి వ్రేలాడిరి.

27. ప్రొద్దుగ్రుంకిన పిదప యెహోషువ ఆనతి యీయగా రాజుల శవములను చెట్లనుండి క్రిందికి దింపి మునుపు వారు దాగుకొనిన కొండగుహలో పడవేసిరి. గుహముఖమున పెద్దరాళ్ళను దొర్లించిరి. ఆ రాళ్ళు నేికిని అచటనే యున్నవి.

యెహోషువ కనానుదేశ దక్షిణభాగమును జయించుట

28. ఆ దినముననే యెహోషువ మక్కేడాను జయించెను. ఆ పట్టణప్రజలను, దానిని ఏలు రాజును కత్తివాదరకు ఎరచేసెను. అచటనున్న ప్రతి ప్రాణిని శాపముపాలు చేసెను. కనుక ఎవరును తప్పించు కోలేదు. మక్కేడా రాజుకును యెరికో రాజునకు ప్టిన గతియే పట్టెను.

29. యెహోషువ అతని అనుచరులు మక్కేడానుండి లిబ్నాకు వచ్చి ఆ పట్టణమును ముట్ట డించిరి.

30. యావే ఆ పట్టణమును దానిని పాలించు రాజును యిస్రాయేలు వశముచేసెను. యిస్రాయేలీ యులు అచటనున్న ప్రతిప్రాణిని కత్తివాదరకు ఎర చేసిరి. కనుక ఎవరును తప్పించుకోలేదు. ఆ పట్టణపు రాజునకును యెరికోరాజునకు ప్టిన గతియేపట్టెను.

31. యెహోషువ తన అనుచరులతో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అచట దండు విడిచి పట్టణ మును ముట్టడించెను.

32. యావే ఆ పట్టణమును యిస్రాయేలీయుల వశముచేయగా వారు రెండవ రోజున దానిని జయించిరి. లిబ్నా యందువలె లాకీషున కూడ ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎరచేసిరి.

33. గేసేరు రాజు హోరాము, లాకీషుకు తోడ్పడ వచ్చెను. కాని యెహోషువ ఆ రాజును ససైన్యముగా మట్టుపెట్టెను. వారిలో ఒక్కరును మిగులలేదు.

34. యెహోషువ అతని అనుచరులు లాకీషు నుండి ఎగ్లోనునకు వెళ్ళి ఆ పట్టణమును ముట్ట డించిరి.

35. ఆ రోజుననే పట్టణమును స్వాధీనము చేసికొని సర్వనాశనము చేసిరి. లాకీషునవలె అచట నున్న ప్రతిప్రాణియు శాపముపాలయ్యెను.

36. యెహోషువ అతని అనుచరులు ఎగ్లోను నుండి హెబ్రోనునకువచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి.

37. నగరమును స్వాధీనము చేసికొని రాజును, ప్రజలను, దాని అధీనములోనున్న గ్రామములను కత్తివాదరకు ఎరచేసిరి. ఎగ్లోనులోవలె హెబ్రోనున గూడ ఎవరిని మిగులనీయలేదు. పట్టణమును, అందు వసించు ప్రాణులను సర్వనాశనము చేసిరి.

38. యెహోషువ అనుచరులతో దెబీరునకు వచ్చి పట్టణమును ముట్టడించెను.

39. ఆ పట్టణమును, దానినిపాలించు రాజును, దాని అధీనముననున్న గ్రామములను వశముచేసికొని కత్తివాదరకు ఎర చేసెను. అందువసించు ప్రాణులన్నియు శాపము పాలయ్యెను. హెబ్రోనునకు ప్టిన గతియే మరియు లిబ్నాకును దాని రాజునకును ప్టినగతియే దెబీరునకు దాని రాజునకు కూడ పట్టెను.

దక్షిణదేశ జైత్రయాత్ర సంపూర్ణమగుట

40. ఈ రీతిగా యెహోషువ పీఠభూములను, దక్షిణ భూభాగములను, పల్లపునేలలను, మన్యపు నేలలను వానినిపాలించు రాజులను స్వాధీనము చేసి కొనెను. యిస్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే ఎవ్వరిని తప్పించుకోనీయకుండ అందరిని శాపము పాలుచేసెను.

41. కాదేషుబార్నెయా నుండి గాసా వరకు, గిబ్యోను వరకు గల గోషెను మండలమును యెహోషువ స్వాధీనము చేసికొనెను.

42. యావే యిస్రాయేలీయుల పక్షమున పోరాడెను గనుక యెహోషువ పైరాజులను వారి రాజ్యములను ఒక్క దండయాత్రలోనే జయించెను.

43. అటుపిమ్మట అతడు, అతని అనుచరులు గిల్గాలునందలి శిబిరమును చేరుకొనిరి.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము